మొన్న కడియం శ్రీహరి...ఈ రోజు కె. కేశవరావు!
పార్టీలు మారడం కొత్త కాదు. పార్టీలు పుట్టినప్పుడే పార్టీ ఫిరాయింపులూ పుట్టాయి. అందులోనూ ఎన్నికల రుతువులో పార్టీలు మారే కప్పల హడావుడి ఎక్కువగా ఉంటుంది. అదను చూసుకుని దూకడానికి గోడమీద పిల్లులు బారులు కడుతూ ఉంటాయి.
ఎంతోమంది పార్టీలు మారుతున్నప్పుడు పై ఇద్దరినే ఎందుకు వేలెత్తి చూపుతున్నారంటే, పార్టీ ఫిరాయింపుదారుల గుంపులో గోవిందంలా ఒకపట్టాన ఊహించలేని ప్రత్యేకత లేదా ప్రత్యేక కారణాలు వీరికి ఉండడం వల్లనేమో! ఏమైతేనేం, వీళ్లూ గుంపులో చేరారు కనుక మన పొరపాటు ఊహను మనమే సవరించుకోవాలి.
శ్రీహరి గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు కేశవరావు గురించి.
కేశవరావు కూడా విద్యాధికుడు. మేధావుల కోవలో ఆయనను చేర్చి చెప్పుకుంటారు. పాత్రికేయుడిగా కూడా ఉన్నారు. 'నిమజ్జనం' అనే ఆర్ట్ ఫిల్మ్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. బహుశా చాలాకాలంగా కాంగ్రెస్ ఆయనను ఆదరిస్తూ ఉండడానికి విద్యాధికత వంటి అర్హతలే కారణం కావచ్చు. ఎందుకంటే ఆయనను గొప్ప జనబలం ఉన్న నాయకుడిగా చెప్పలేం. ఆయన ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించినట్టు లేదు. గతంలో శాసనమండలి సభ్యునిగా, శాసనమండలి ఉపాధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. చెప్పుకోదగిన జనబలం లేకపోయినా కాంగ్రెస్ రాష్ట్రంలో మంత్రిపదవి ఇచ్చి ఆదరించింది. పీసీసీ అధ్యక్షుని చేసింది. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక వేదిక అయిన వర్కింగ్ కమిటీలో సభ్యత్వం ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు పార్టీ పరిశీలకునిగా నియమించింది. ఏ పార్టీ అయినా ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతుంది? అయినాసరే, కేశవరావు కాంగ్రెస్ ను నిమజ్జనం చేసేసి టిఆర్ఎస్ లో చేరుతున్నారు.
కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం లేదు కనుక పార్టీ మారుతున్నానని కేశవరావు చెబుతున్నారు. ఇక్కడే కొన్ని సందేహాలు:
1. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న షరతుతో కేశవరావు కాంగ్రెస్ లో చేరలేదు. తెలంగాణా ఇస్తుందన్న కచ్చితమైన హామీ తీసుకునే ఆ పార్టీలో దశాబ్దాలుగా ఉంటూ పదవులు పొందలేదు. ఎన్నో ఇచ్చిన కాంగ్రెస్ ను తెలంగాణా ఇవ్వడంలేదన్న కారణంతో ఎందుకు వదిలేస్తున్నారు?
2. కాంగ్రెస్ ఇవ్వని తెలంగాణ టిఆర్ఎస్ తప్పనిసరిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటే ఆయన పార్టీ ఫిరాయింపును కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ టిఆర్ఎస్ తెలంగాణ ఇవ్వగలదా? అది కూడా చేయగలిగింది తెలంగాణకు ఒత్తిడి తేవడమే. కనుక ఇంతవరకూ చేసినట్టే కాంగ్రెస్ లో ఉంటూనే కేశవరావు కూడా తెలంగాణకు ఒత్తిడి తేవచ్చు. ఆయన పార్టీ మారడం వల్ల తెలంగాణ లక్ష్యానికి కొత్తగా ఒరిగేది ఏముంటుంది?
3. ఒకవేళ తెలంగాణ టిఆర్ఎస్ వల్లనే సాధ్యమని ఆయన అనుకుంటే ఆయన ఆ పార్టీలో చేరకపోయినా తెలంగాణ వస్తుంది. కాంగ్రెస్ లో ఉండి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా ఆయనకూ గుర్తింపు వస్తుంది. కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ లో చేరడం వల్ల అదనంగా ఏమొస్తుంది? (మరో విడత రాజ్యసభ సభ్యత్వం కాకపోతే)
కనుక మేధావిగా చెప్పుకునే కేశవరావు తను పార్టీ మారడానికి చెబుతున్న కారణం "తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డికోసం" అన్నట్టుగా లేదా?
అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న: దశాబ్దాలుగా ఉన్న పార్టీతో అనుబంధాన్ని ఒక మిథ్యా కారణంతో ఎలా తెంచుకుంటున్నారు? కడియం శ్రీహరి విషయంలో వేసుకున్న అదే ప్రశ్న మళ్ళీ ఇక్కడా....
విద్యావంతులు రాజకీయాలలో చేరితే అవి బాగుపడతాయంటారు. శ్రీహరి, కేశవరావు విద్యావంతులు కారా?!