Friday, June 24, 2016

'అంగా దంగా త్సంభవసి'- కథ

రాత్రి పదవుతోంది. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి, మొహం కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చున్నాను. ఇంటికొచ్చేసరికి రోజూ ఆ వేళ అవుతుంది.
అంతలో వీధి తలుపు తోసుకుని ఏదో సినిమాపాట కూనిరాగం తీస్తూ మా రెండోవాడు హడావుడిగా లోపలికి రాబోయి నన్ను చూసి తగ్గాడు. నా మీద ఓ ముసినవ్వు పారేశాడు. నేను ఏమైనా అంటానేమోనని ముందుగానే నా మీద జల్లే మత్తుమందు ఆ ముసినవ్వు. తలుపు వెనకనుంచి మూడు తలకాయలు తొంగి చూసి, నేను కనబడగానే వాడితో ఏదో గుసగుసగా అనేసి మాయమయ్యాయి. వాడు తలుపు వేసేసి ఓసారి లోపలికి వెళ్ళి వచ్చి,
“నాన్నా! రేపు ఆఫీసునుంచి త్వరగా వచ్చెయ్యి. సెకండ్ షో సినిమా కెళ్దాం” అన్నాడు. ఆ మాటకు నా గుండెల్లో రాయి పడింది. నోట్లోకి ముద్ద దిగడం కష్టమైంది.

9 comments:

  1. భాస్కరం గారూ!
    ‘‘ భార్య గర్భంలో ప్రవేశించి భర్తే కొడుకుగా పుడతాడు. తండ్రికీ కొడుకికీ తేడా లేదు.’’
    మరి, కూతురు ఎలా పుడుతుంది? కూతురిలో తండ్రి అంశ వుండదా? కేవలం తల్లి అంశేనా?

    ReplyDelete
  2. భాస్కరం గారు,

    నేను నా కమెంట్ వ్రాసిన మరుసటిరోజునే ఎర్రబడ్డ కళ్ళు అని అనడం తప్పే క్షమించండి అని వ్రాసాను.నా కమెంట్ ఇంకా ప్రచురించలేదేమిటా అని రోజూ ఎదురుచూస్తున్నాను.నాకు నిజంగానే రావిశాస్త్రి గారు తెలియదు.రమణగారు మాత్రం బ్లాగులద్వారా తెలుసు.అభిమానిని కూడా..
    నేను రచయిత్రిని కాదు.ఒక సాధారణ పాఠకురాలిని మాత్రమే ! నేను సమస్యల నుండి పారిపోయే రకాన్ని కాదు. సమస్యలను సరిక్రొత్త కోణంలో చూసి పరిష్కారం వెతికే తరహా నాది.అభిమానివి అయి ఉండీ రమణగారి దేవుడి గురించి తెలియదా అని మళ్ళీ కళ్ళెర్రజేస్తే నేను ఏమీ చేయలేను.

    ఇకపోతే సాహిత్య పత్రిక రచయతల కోసమా ? పాఠకుల కోసమా అన్నది సంపాదక వర్గంతో తేల్చుకోండి.నేను పాఠకుల కోసం అని అనుకుని ఇక్కడ వ్యాఖ్యానించాను.మీరన్న ఈ ఒక్కమాటతో (hit and run)మీవ్రాతలు వ్యర్ధమని తేలిపోయింది.జనం కోసమే బ్రతికే రావిశాస్త్రిని అవమానించానని ఆవేశపడే మీకు రావి శాస్త్రి గారి పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదేమో ?

    ఇంతకు ముందు వ్రాసిన నా రెండు కమెంట్స్ ప్రచురించకుండా అందరినీ తప్పుద్రోవ పట్టించి నన్ను అనవసరంగా వివాదంలోకి లాగిన సారంగ యాజమాన్యమే సమాధానం చెప్పాలి.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. మీకొక చిన్న అర్హతా పరీక్ష !

    పురావస్థు శకలాలను బట్టి "అయోధ్య" హిందువులదే అని నిర్ణయించడం సబబేనా ?

    ReplyDelete
  5. నీహారికగారూ...
    రావిశాస్త్రి పేరు తెలియదని మీరు అనడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆవేశపరచిన మాటా నిజం. అయినా నేను వెంటనే స్పందించాలనుకోలేదు. పలువురి స్పందనలు చూశాక మీ నుంచి సమాధానం ఉంటుందని ఎదురుచూశాను. రాకపోవడంతో నేను అలా స్పందించాను. మీరు సమాధానం ఇచ్చినా సారంగ ప్రచురించనందుకు నేను విచారిస్తున్నాను. అయితే అందుకు నేను బాధ్యుణ్ణి కాదు. ప్రసిద్ధ కవి రచయితల పేర్లు అయినా తెలిసి ఉండడం సాహిత్య పత్రికలో పాలుపంచుకోడానికి కనీస అర్హతగా నేను భావిస్తున్నాను. కాదు అని మీరు అంటే నేను మీతో వాదించను. మీ అభిప్రాయం మీది. నేను పాఠకురాలిని మాత్రమే నని మీరు అన్నారు. నేనూ పాఠకుడినే. పాఠకులను, రచయితలను రెండు వర్గాలుగా వేరు చేయడం కుదరదు. రచయితా పాఠకుడే. పాఠకుడూ రచయిత కావచ్చు. రావిశాస్త్రి పేరు నిజంగానే తెలియదని మీరు అనడంతో నా వరకు ఇక వివాదానికి తెరపడినట్టే. ఆ వివరణ మీరు ముందే ఇచ్చి ఉంటే నేను స్పందించేవాడిని కాదు. నాకు మీరు అర్హత పరీక్ష పెట్టారు. కానీ నేను అన్న అర్హత పరీక్షకు, మీ అర్హత పరీక్షకు తేడా ఉంది. నేను అన్నది కనీసం ప్రసిద్ధ కవి రచయితల పేర్లు తెలియడం గురించి. ఆ ప్రమాణంతో చూసినప్పుడు నాకు అయోధ్య పేరు తెలుసు. ఆ వివాదం తెలుసు. కానీ మీరు అయోధ్య అంశాన్ని అధ్యయనం చేయడాన్ని నాకు అర్హత పరీక్షగా విధిస్తున్నారు. రావిశాస్త్రిని అధ్యయనం చేయడాన్ని నేను సాహిత్యప్రవేశానికి కనీస పరీక్షగా పేర్కొని ఉంటే మీరు విధించిన అర్హత పరీక్షను స్వీకరించేవాడిని.

    ReplyDelete

  6. ఎవరండీ రావి శాస్త్రి ? రవి శాస్త్రి పాపులర్ కిరికేట్టులో ; ఈ రావి దేంట్లో ?



    జిలేబి

    ReplyDelete
  7. మీరు పురాగమనం గురించి విశ్లేషణలు చేస్తున్నారు కాబట్టి మీకు మీ సబ్జెక్ట్ మీదే అవగాహన ఉంటుందని నేను భావించాను.ఒక విషయం మీద వాదించాలి అంటే ఆ విషయం మీద పూర్తి పట్టు ఉంటే సరిపోతుంది.విద్యార్హతలు అవసరం లేదు అని మీకు తెలియచేయాలనుకున్నాను.ఇప్పటికీ మీకు నేను ఇచ్చిన సమాధానం కూడా సారంగ వారు ప్రచురించకపోవడం వల్ల మీ బ్లాగులో చెప్పుకోవలసి వచ్చింది.

    ReplyDelete
    Replies
    1. మీరు అపార్థం చేసుకున్నారు. నేను 'విద్యార్హత'ల గురించి మాట్లాడలేదు. మీ విద్యార్హతలను శంకించలేదు. నాకు అయోధ్య గురించి తెలుసు. కానీ దానిమీద విశ్లేషణ చేయడం మీద నాకు ఆసక్తి లేదు. అలాగే, "నాకు రావిశాస్త్రి రచనల మీద ఆసక్తి లేదు" అని మీరు అని అంటే అలా అనడానికి గల మీ స్వేచ్ఛను నేను గౌరవిస్తాను. రావిశాస్త్రి ఎవరో తెలియదని మీరు అనడం ఒక్కటే నాకు విపరీతంగా అనిపించింది.

      Delete
    2. మనదేశంలో 100 కోట్లమందికి అయోధ్య పేరు తెలుసు. వివాదం గురించి అధ్యయనం చేయడం ఈ దేశ ప్రధానికి కూడా తెలియదు. అందుకే ఆ ప్రశ్న మిమ్మల్ని అడిగాను.

      Delete