Wednesday, August 21, 2013

దేవదాసు సినిమాలో ఆ సన్నివేశం...

శరత్ నవల ఆధారంగా తీసిన దేవదాసు సినిమా చాలాసార్లు చూశాను. ఇన్నేళ్లలో ఆ సినిమా మీద సమీక్షలూ, స్పందనలూ చాలానే వచ్చి ఉంటాయి. ఆ సినిమా ఎప్పుడు చూసినా ఒక సన్నివేశాన్ని మాత్రం కళ్ళు ఆర్పకుండా చూస్తాను. ఆ తర్వాత కొన్ని రోజులపాటు అదే నా ఆలోచనలను నీడలా వెంటాడుతూ ఉంటుంది. అది నాలో విషాద విభ్రమాలు కలగలసిన ఒక విచిత్రానుభూతిని నింపుతూ ఉంటుంది. నిజానికి ఆ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్య, దర్శకుడుగా గొప్ప పేరున్న వ్యక్తి కాదు శరత్. కానీ ఆ సన్నివేశాన్ని అత్యద్భుతంగా పండించినందుకు  ఆయనకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. నా ఉద్దేశంలో ఆ సన్నివేశం సినిమా మొత్తానికి ఆయువుపట్టు.  శరత్ హృదయమంతా అందులోనే నిక్షిప్తమైనట్టు అనిపిస్తుంది. సినిమా చివరిలో వచ్చే ఈ సన్నివేశమే నా అంచనాలో పతాకసన్నివేశం.

ఇదీ ఆ సన్నివేశం...దేవదాసు తన అంతిమ క్షణాలలో పార్వతి అత్తవారి ఊరు చేరుకుంటాడు. బండివాడు అతనిని పార్వతి ఇంటి అరుగు మీదికి చేరుస్తాడు. ఈ సంగతి తెలిసిన పార్వతి అతణ్ణి కలుసుకోడానికి మేడ మీదినుంచి పరుగు  పరుగున కిందికి బయలుదేరుతుంది. అప్పుడు “తలుపులు మూసేయండి” అనే గావుకేక వినిపిస్తుంది. అది ఆమె జమీందారు మొగుడి గొంతు. భళ్ళున తలుపులు మూసుకుంటాయి. అప్రమత్తుడైన పార్వతి సవతి కొడుకు “వద్దు, వద్దమ్మా” అని బతిమాలుతూ ఆమెకు మెట్టు మెట్టునా అడ్డుపడతాడు. వినిపించుకోని పార్వతి మెట్లు దిగే తొందరలో దొర్లిపడి తలకు గాయమై ప్రాణాలు కోల్పోతుంది. అదే సమయంలో, వీధి అరుగుమీద పడున్న దేవదాసు ప్రాణాలు కూడా గాలిలో కలుస్తాయి.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. మీ స్పందనను దయచేసి అందులో పోస్ట్ చేయండి)

2 comments:

  1. బలహీనమైన జీవ స్పందనలను తమ సాహిత్యంలో వర్ణించదమే రచయితలు సమాజానికి చేసే అన్యాయం. జీవితం పట్ల దేవదాసు, పార్వతుల స్పందనలు చాలా బలహీనంగా ఉంటాయి. అసలు ప్రేమ కన్నా జీవితమే గొప్పదనే సూత్రాన్ని చెప్పకుండా త్యాగాలు చావడాలు బాగోలేదండీ దేవదాసులో. ఇలాంటి క్లాసిక్ ల వలననే ప్రేమ పూర్తిగా వ్యక్తిగతమైన వ్యవహారమనే సంకుచితానికి గురియైనది.

    మీ పరిశీలన వర్ణన బాగున్నాయి గానీ సబ్జెక్ట్ అంత వర్తీ కాదండీ.

    ReplyDelete
  2. స్పందనకు ధన్యవాదాలు. మీరన్నది ఒక కోణం నుంచి నిజమేనండి. అయితే దేవదాసు కథలోని మంచి చెడ్డలను పరిశీలించడం నా వ్యాసం పరిధిలోకి రాదు. ఆ కథా వస్తువును సామాజిక చరిత్ర కోణం నుంచి చూడదానికే నా వ్యాసం పరిమితం. వీలైతే మీ స్పందనను సారంగకు పోస్ట్ చేస్తారా?

    ReplyDelete