Thursday, November 7, 2013

"నువ్వు కట్టి విడిచిన చీర నేను కట్టుకోవాలా?"

 కచుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ట అనేకమంది కన్యలను వెంటబెట్టుకుని దేవయానితో కలసి వనవిహారానికి వెళ్లింది. అంతా తమ చీరలు గట్టున పెట్టి ఓ సరస్సులో జలక్రీడలాడారు. అంతలో పెద్ద సుడిగాలి వీచింది. చీరలన్నీ కలసిపోయాయి. గట్టు మీదికి వచ్చి చీర కట్టుకునే తొందరలో శర్మిష్ట పొరపాటున దేవయాని చీర కట్టుకుంది.

 దాంతో దేవయాని మండిపడింది. లోకోత్తర చరిత్ర కలిగిన శుక్రుని కూతుర్ని, నీకు పూజనీయురాలిని, ప్రసిద్ధమైన  బ్రాహ్మణకులంలో పుట్టినదానిని, ఇప్పుడు నువ్వు కట్టి విడిచిన మైల చీర నేను కట్టుకోవాలా?’ అంది.

ఆ మాటకు అహం దెబ్బతిన్న శర్మిష్ట దేవయానిని నిందించి ఓ నూతిలోకి తోసి వెళ్లిపోయింది. 

కథనంలో కవి ఎన్ని మెళకువలు చూపాడో చూడండి...దేవయాని-శర్మిష్టల వైరానికి తక్షణ కారణం, శర్మిష్ట కట్టి విడిచిన చీర దేవయాని కట్టుకోవలసి రావడం. నువ్వు కట్టిన మైల చీర నేను కట్టుకోవాలా అని శర్మిష్టను దేవయాని నిలదీయడంలో కులాహంకారం పడగవిప్పి బుసకొట్టింది.  భవిష్యత్తులో దానికి ఆమె ప్రతిఫలం చెల్లించుకోవలసి వచ్చింది. నీ మైల చీర నేను కట్టుకోవాలా అని ప్రశ్నించిన దేవయానే ముందు ముందు తను కట్టుకున్న పురుషుని శర్మిష్టతో కలసి పంచుకోబోతోంది. అంటే, శర్మిష్ట ఎంగిలి చేసినదాన్నే తనూ అనుభవించబోతోందన్నమాట.

అలాగే శర్మిష్ట కూడా...

ప్రకృతి సమవర్తి. అతి ఎక్కడున్నా సహించదు. ఎక్కడో ఒక చోట సమతూకాన్ని స్థాపించితీరుతుంది. 

(పూర్తివ్యాసం http://www.saarangabooks.com/magazine/2013/11/07/%E0%B0%A8%E0%B1%81%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B1%81-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%9A%E0%B1%80%E0%B0%B0/ లో 'పురా'గమనం అనే నా కాలమ్ లో చదవండి)

2 comments:

  1. దేవయానిని పెళ్ళి చేసుకున్న తరవాతే శర్మిష్ఠ కి పిల్లల్ని కన్నాడు యయాతి మరొక సారి పరిశీలించండి.

    ReplyDelete
    Replies
    1. అవును, దేవయానిని పెళ్లి చేసుకున్న తరువాతే శర్మిష్టకి యయాతి పిల్లల్ని కన్నాడు. కాదని నేను అనలేదే...

      Delete