‘కన్య అంటే అవివాహిత మాత్రమే తప్ప పురుష సంపర్కం లేనిది కాదు’ అన్న వాక్యం; కన్య గురించిన నేటి మన ఊహను తలకిందులు
చేసి షాక్ ఇస్తున్న మాట నిజమే. అప్పుడు
షాక్ అబ్జార్వర్ గా పనిచేసేది తటస్థ దృష్టి మాత్రమే.
ఋతుమతి
అయితే పురుష సంపర్క దోషం పోతుందన్న సూత్రం, ఆమె కన్యగా సంతానం కన్న అనంతర పరిస్థితికీ వర్తిస్తుంది. అంటే అప్పుడు
కూడా ఆమె కన్యగానే ఉంటుంది. ఉన్నప్పుడు పరాశరుడు సత్యవతికి,
దుర్వాసుడు(లేదా సూర్యుడు) కుంతికి ప్రత్యేకంగా కన్యాత్వ వరాన్ని ఇవ్వనవసరంలేదు.
ఇంకా
స్పష్టంగా చెప్పాలంటే, కన్యకు పురుష సంపర్కం గణసమాజానికి చెందిన నీతి. గణసమాజంలో దానిని దోషంగా
కాదు సరికదా, గుణంగా కూడా భావించినట్టు కనిపిస్తుంది.
గణసమాజం అంతరించినా ఆ సమాజం తాలూకు లక్షణాలు అనంతర కాలంలోకి ప్రవహిస్తూనే వచ్చాయి.
అలా మన పురాణ ఇతిహాసాలకూ ఎక్కాయి. ఇప్పటికీ మన అనేక ఆచారాలలో, భాషలో, నుడికారంలో గణ సమాజ లక్షణాలు కనిపిస్తాయి.
No comments:
Post a Comment