కాసేపటికి సోఫియా వచ్చింది. తెల్లని దుస్తులు ధరించింది. జుట్టు రిబ్బన్ తో ముడేసుకుంది. చాలా గంభీరంగా ఉంది. అందరిముందూ వైనూ, కేకులూ ఉంచారు. సోఫియా తలవంచుకుని కూర్చుంది. స్లీమన్ తన ప్రపంచయాత్రా విశేషాలను చక్కని గ్రీకులో చెప్పడం ప్రారంభించాడు. మధ్యలో ఉన్నట్టుండి సోఫియావైపు తిరిగి, “నీకు దూరప్రయాణాలు ఇష్టమేనా?” అని అడిగాడు. ఇష్టమేనని ఆమె చెప్పింది. “రోమన్ చక్రవర్తి హేడ్రియన్ ఎథెన్స్ ను ఎప్పుడు సందర్శించాడు?” అని అడిగాడు. సోఫియా తేదీతో సహా ఠకీమని చెప్పింది. “హోమర్ పంక్తులు కొన్ని అప్పజెప్పగలవా?” అని అడిగాడు. గడగడా అప్పజెప్పింది. పరీక్ష నెగ్గింది.
(పూర్తి రచన 'హోమర్ ను చదువుకుంటూ అతడు-ఆమె' అనే శీర్షికతో http://magazine.saarangabooks.com/2015/11/19/%E0%B0%B9%E0%B1%8B%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%81-%E0%B0%9A%E0%B0%A6%E0%B1%81%E0%B0%B5%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%82-%E0%B0%85%E0%B0%A4%E0%B0%A1%E0%B1%81/ లో చదవండి)
No comments:
Post a Comment