డిసెంబర్ కూడా గడిచిపోతోంది. సాధారణంగా డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో రగ్గులు కప్పుకునే చలి ఉంటూ ఉంటుంది. కానీ ఈసారి పలచని దుప్పటి కప్పుకునేంత చలి కూడా లేదు. పైగా ఫ్యాన్ వేసుకోవలసివస్తోంది. డిసెంబర్ లో హైదరాబాద్ లో ఫ్యాన్ వేసుకుని పడుకోవడమా!!! ఎప్పుడైనా అనుకున్నామా? ఎంత ఆశ్చర్యం! ఇదేదో వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం ముచ్చటలా లేదూ?
ఆశ్చర్యాన్ని మించి చాలా ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కే కాదు; దక్షిణాది రాష్ట్రాలకే ఏదో అయింది. చెన్నైలో ఆ జలప్రళయమేమిటి? బెంగళూరులో కూడా చలి లేదట.
ఆశ్చర్యాన్ని మించి చాలా ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కే కాదు; దక్షిణాది రాష్ట్రాలకే ఏదో అయింది. చెన్నైలో ఆ జలప్రళయమేమిటి? బెంగళూరులో కూడా చలి లేదట.
భాస్కరంగారూ, మనుష్యులు ప్రకృతితో ఆటలాడుకోవాలని ప్రయత్నిస్తున్నదాని ఫలితం ఇదండీ. నాకు గుర్తున్న మరొక విషయం 1987లో అక్టోబరు నెలలో ఉక్క ఎంతగా ఉన్నదంటే హైదరాబాదులో, మేము డాబా మీద ప్రక్కలు వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఎల్-నినో ప్రభావంతో కొత్తగా అతివృష్టి కొన్ని చోట్ల, మిగితా ప్రాంతాలన్నిటా అనావృష్టి. ఎప్పుడూ ఎల్-నినోతో అనావృష్టి అనే విన్నాం కాని ఈఅతివృష్టి కొత్త సంగతి.ముందు ముందు ఇంకా ఎన్ని వింతలొస్తాయో తెలియదు.
ReplyDeleteబావులను పూడ్చేసి బాగులను కొట్టేసి చెరువులను బంజేసి బండలను ఇరగ్గొట్టి ఊరును కబ్జాదారులకు అమ్మేసి నగరాన్ని నాశనం చేసుకున్నాక ఇప్పుడు రంది పడితే లాభామేంది?
ReplyDeleteits same worldwide sir!
ReplyDeleteDecember is supposed to be cold and snowing in london, but this time its like rainy season....not cold at all!
global warming :)
జై గారికి తెలంగాణలో కాస్త అనుమానాస్పదంగా ఏమి జరిగినా గతంలో ఆంధ్రోళ్ళ మూలంగా జరిగిన దోపిడీలుఊ వాటి పర్యవసానాలూ గుర్తుకొస్తాయి - ఖర్మ:-)
ReplyDeleteనేను ఈ వ్యాఖ్యలో ఆంధ్రులను ఏమీ అనలేదు మహాప్రభో!
ReplyDeleteహరిబాబుగారూ, జైగారు ఆంధ్రులను ఉద్దేశించి ఏమీ అన్నట్లు కనబడటం లేదుకదండీ?!
ReplyDeleteపూడ్చేసి,కొట్టేసి,బంజేసి,ఇరగ్గొట్టి అని చాలా పొడుగాటి అక్రమాల లిస్టు చదివితేనూ!
ReplyDeleteఅందులోనూ కబ్జాదారులూ,అమ్మేసి అనెవి ఉద్యమమలో తరచుగా వినబడ్డవి కదా?
జై గారూ,
ReplyDeleteవూరికే సరదాగా తీస్కోండి స్మైలీ చూశారుగా:-)
మిత్రులారా, అలాగే లైటు తీసుకున్నానండి బాబూ!
ReplyDelete