స్లీమన్ కు గ్లాడ్ స్టన్ బాగా తెలిసినవాడే. తన మైసీనియా కు సుదీర్ఘమైన ఉపోద్ఘాతం రాసింది ఆయనే. తనను 10 డౌనింగ్ స్ట్రీట్ లోని తన నివాసానికి ఆహ్వానించి విందు ఇచ్చింది ఆయనే. కానీ తన ఆరాధ్యవీరుడు గోర్డన్ మరణానికి కారణమైన గ్లాడ్ స్టన్ పొరపాటును స్లీమన్ క్షమించలేకపోయాడు. అతనిపట్ల ఆగ్రహంతో వణికిపోయాడు. తన అధ్యయన కక్ష్యలో ఉంచిన అతని సంతకంతో ఉన్న ఫోటోను నేలమీదికి విసిరికొడదామా, లేక చించి పారేద్దామా అనుకున్నాడు. చివరికి తీసుకెళ్లి పాయిఖానాలో ఉంచాడు.
(పూర్తిరచన http://magazine.saarangabooks.com/2016/05/19/%E0%B0%85%E0%B0%A4%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A8%E0%B1%87-%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8A%E0%B0%95%E0%B0%A1%E0%B1%81/ లో చదవండి)
భాస్కరం గారూ!
ReplyDeleteతప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని సంప్రదించడానికై మీ బ్లాగు పోస్టును ఉపయోగించుకుంటున్నందుకు మన్నించండి.
అట్టాడ అప్పల్నాయుడు గారి కథ ’ఎన్నోలో యెన్నెలా‘ సారంగలో మీరు చదివేవుంటారు. ఆ కథకు సంబంధించి నేనొక సూచన చేస్తూ సంభాషణలే పరిష్కారం అన్నాను. దానికి ఆయన ఒప్పుకోలేదు. అప్పల్నాయుడుగారన్నా, మిగతా ప్రగతిశీల సామ్యవాద రచయితలన్నా నాకు గొప్ప గౌరవం. మీలాంటి విజ్ఞలంతా కలసి ఆ విశ్వవిద్యాలయంలోని పరిస్థితిని చక్కదిద్దవచ్చేమోనని నా భావన.
ప్రజాస్వామ్యంలో సంభాషణల ఆవశ్యకతని మీరైనా అప్పల్నాయుడుగారికి సూచించగలరని నా ఆశ. మీరన్నట్లు ప్రజాస్వామ్యం అవసరంలేదనుకుంటే అది వేరే చర్చ.
విద్వేషాలను పెంచే వాతావరణం ఎవ్వరూ కథల రూపంలో కూడా చేయగూడదని నా భావన.
ఈ వ్యాఖ్యలను యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాను. ఈ కథను ఒక మిషగా చేసుకుని సంభాషణల ఆవశ్యకతను మనం తెలియజేయవచ్చునేమోనని అప్పల్నాయుడుగారి ఆలోచనలకు స్పందించవలసినదిగా మనవి.
ఈ చిన్ని ప్రయత్నం ఫలించి సమాజం కొరకు పాటుపడేవారందరూ ద్వీపాల్లాగాక ఏకఖండంలా సాగే ప్రయాణం ప్రారంభమయితే అంతకంటే కావలసినదేమున్నది?
సారంగలోని ఎన్నెలో యెన్నెలా కథ గురించిన మా ఇద్దరి వ్యాఖ్యలు
********************
శ్రీనివాసుడు
May 23, 2016 at 8:34 pm
అట్టాడ అప్పల్నాయుడు గారూ!
మీరొక ఫ్రీ థింకర్ అని మీ రచనలు చదివిన తరువాత నాకు కలిగిన అభిప్రాయం. ఈ సంఘటన పూర్వాపరాలు, గత పదేళ్ళుగా అక్కడ జరుగుతున్న వ్యవహారాలు, సంఘటనలోని వివిధ పార్శ్వాలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన పిదప కూడా ఇది రకరకాల భావజాలాలతో కూడిన రాజకీయపు వికృత క్రీడ యొక్క పరాకాష్ఠగా మీరు గ్రహించక పోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ కథలో మీరు దునుమాడిన వైరిపక్షపు కోణాన్ని కూడా మీదైన తటస్థరీతిలో ప్రతిబింబిస్తే కథకు సమగ్రత చేకూరేదని నా భావన.
ముఠాతత్త్వం కేవలం ఆత్మరక్షణకై లేదా ఆత్మగౌరవాన్ని రక్షించుకోడానికే బయలుదేరి, అలాగే కొనసాగితే, లేదా, ఆ ఉద్దేశానికే పరిమితమయితే చరిత్రలో ఇంత హింస వుండేది కాదు.
**********************************************************
attada applnaidu
May 24, 2016 at 1:34 am
శ్రీనివాసుడు గారూ …నా కధ మీద మీ అభిప్రాయం రాసినందుకు ధన్యవాదాలు. అలాగే మిగతా మిత్రులకూ క్రుతగ్యతలు వారి స్పందన తెలిపినందుకు.
ఇక స్రీనివాసుదుగారూ .. నీను సాధారణంగా నా కధల మీద జరిగే చర్చలో పాల్గొను. కధయే చర్చకు సంబంధించిన విషయాలను చెపుతుంది,చెప్పాలి,అంతే. ఈ కధ కూడా మీ ప్రశ్నలు కాదు సూచనలకు జవాబు చెపుతుంది…కధలో ఉన్నావి.
నేను ఫ్రీ థింకర్ ననీ,తటస్త వాదిననీ ఎలా భావించారో నాకర్ధం కావడం లేదు.నేను ప్రజా పక్షపాతిని.ప్రజంటే…శ్రమ చేసి జీవించే వారనీ నా భావన అది శారీరక శ్రమ గానీ బౌధిక స్రమగానీ. అంతేగాక మహిళా,దళిత,మైనారిటీ వర్గాల పక్షపాతిని.ఇవి అణచబడ్డ వర్గాలు..
అలాగే నేను మార్క్షిస్త్ ,లెనినిస్ట్ ని .ఆధిపత్య వర్గాల హింసకు ప్రజలు ప్రతి హింస చేస్తారు…ఇది నా అవగాహనా. చివర్లో మీరు రాసిన హింస గురిచే నా సమాధానమిది.
ఇంకా కధలో వైరి పక్ష కోణం కూడా రాస్తే బాగున్నని మీరు సూచించారు…రాసాను కదండీ…భగవాన్ నహీ చోదేఘే..అన్న మంత్రిని, ముద్దొస్తారు ముండాకొడుకులు అన్న వీసీ పాత్ర గానీ వైరి పక్షాలే గదండీ…ఆత్మా గౌరవం రక్షించు కోవడానికే పరిమితమయితే చరిత్రలో ఇంత హింస జరిగేది కాదని రాసారు. అసలు రక్షించు కోవాల్సి రావడమనగా … ఆత్మ గౌరవాన్ని ఎవరో దెబ్బ తీస్తున్నట్టు కదా. హింస అది కదా….మీరు ప్రతి హింసని చూసి వ్యతిరేకించా వద్దు,,,
******************************************************
ReplyDeleteశ్రీనివాసుడు
May 24, 2016 at 4:34 am
అప్పల్నాయుడు గారూ!
‘‘నీను సాధారణంగా నా కధల మీద జరిగే చర్చలో పాల్గొను. కధయే చర్చకు సంబంధించిన విషయాలను చెపుతుంది,చెప్పాలి,అంతే’’
ముందుగా, మీకున్న నియమాన్ని ప్రక్కకుబెట్టి స్పందించినందుకు ధన్యవాదాలు!
****************
కార్యకారణ గొలుసులో మీరొక సంఘటన దగ్గర, నేనొక సంఘటన దగ్గర నిలబడి హింస, ప్రతిహింసల గురించి మాట్లాడుతున్నామని నాకు అనిపిస్తోంది. ఇందులో ఏది మొదలు, ఏది చివర అనేది తెగదు. అయితే, ఈ హింస, ప్రతిహింసల నిరంతర శృంఖలలతో సాధించేదానిని సంభాషణల ద్వారా సాధించడం వివేకవంతమయిన పని అని నా భావన. ఈ సంఘటనకి మాత్రమే మనం పరిమితమైతే, దానిని శాశ్వత పరిష్కారించడానికి ఇరు వైరి పక్షాల మధ్య సంభాషణలని ప్రారంభింపజేయడానికి సమాజంలోని మీలాంటి విజ్ఞులంతా ఉద్యుక్తులై ఒక ప్రయత్నాన్ని చేసేందుకు ఫ్రీథింకర్ గా, తటస్థంగా వుంటే బాగుంటుందేమోనన్న ఉద్దేశంతో మిమ్మల్ని నేను అలా సంబోధించడం జరిగింది.
మీలాంటి విజ్ఞులంతా చొరవదీసుకుని, ఆ విశ్వవిద్యాలయంలోని తాత్త్విక భావజాలాలను, పక్షపాతాలను, రాజకీయ ప్రయోజనాలను కొద్దిసేపయినా ప్రక్కకు బెట్టి సంభాషణలు ప్రారంభింపజేసే వాతావరణాన్ని కల్పిస్తే భవిష్యత్తులో మరిన్ని దుస్సంఘటనలు జరగవేమోనన్న ఆశ.
నాకయితే అదొక్కటే ఏకైక పరిష్కారంగా అనిపిస్తోంది.
Reply
p v vijay kumar
May 24, 2016 at 5:10 am
మొదటగా this is not a fight between two equal forces అటో ఇటో తేల్చుకుందాం అనే కొట్లాటలో తటస్థత అనే స్థానం ఉంటుంది.- ప్యూను నుండి వీ సీ నుండి మినిస్టర్ నుండి పీ ఎం వరకు కుమ్మక్కు అయిన గ్రూపుతో కొట్లాదుతున్నప్పుదు తటస్థత ఏది ? సంభాషణ ప్రారంభించాల్సింది ఎవరు ? …వీ సీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా , ఆరోపణలు ఎదుర్కుంటున్న విద్యార్థుల వాదన వినకుండా (this not only against process but against UGC Act ) ప్రవర్తిస్తే అందుకు అందరూ తలూపితే ..సంభాషణ ఎట్లా మొదలుతుంది ? ఇక్కడ ఇద్దరిదీ తప్పుంది సర్ది చెబ్దామనే పంచాయితీ కాదు కావాల్సింది… నిర్భయంగా ఆత్మ వంచన లేకుందా న్యాయం వేపు నిలబడి పోట్లాడ్డం. U need to gather more facts and need to serially organise ur thoughts. Probably , u must read more on what are actual socio -political conditions in a University
Reply
attada appalnaidu
May 24, 2016 at 6:24 am
sreenivaasudu గారు …సంతోషం .మీ సూచన బాగుంది.కానీ ఇవి అమలు కాని ఆదర్శాలు. సంభాషణల ద్వారానే శాంతి కుదిరితే ప్రపంచం ఎంతో బాగుణ్ణు. ఆధిపత్యం లో ఉన్న వాళ్ళు కుదరనివ్వరు.చరిత్ర చెప్పిన విషయం ఇది.హెసీయూ లో మాత్రమే కాదు ప్రపంచం అంతటా విభిన్న భావాల gharshaNa మాత్రమె కాదు వర్గాలుగా చీలిన సమూహాల మధ్య ఘర్షణలివి …
నా కదా మిమ్మల్ని శాంతి గురించి ఆలోచింప చేసినందుకు సంతోషం. మీరు కూడ ఆలోచించండి..
ధన్యవాదాలు…
శ్రీనివాసుడుగారూ...ధన్యవాదాలు. ఏ పరిస్థితుల్లో యుద్ధం, ఏ పరిస్థితుల్లో సంభాషణ అనే రెండు విషయాల మీదా సారంగలో జరిగిన వివిధ చర్చల్లో నా అభిప్రాయం చెప్పాను. మళ్ళీ ఆ చర్చను నేనుగా ప్రారంభించాల్సిన అవసరం కనిపించలేదు. చెప్పిందే మళ్ళీ చెప్పడం అవుతుంది. మీరు సందర్భానుసారంగా కోట్ చేస్తే అభ్యంతరం లేదు. నా ఉద్దేశంలో యుద్ధమూ, సంభాషణా అన్నవి ఒక నిరంతర క్రమం. పరస్పర ఆధారాలు. యుద్ధానికి ముందు, మధ్యలో, తర్వాతా సంభాషణ ఉంటూనే ఉంటుంది. ఏ ప్రసిద్ధ యుద్ధాన్ని తీసుకున్నా అలాగే జరిగింది. మహాభారతాన్నే తీసుకుంటే, సంభాషణ వల్ల ఉపయోగం లేదని అనుకున్నా "అయినను పోయి రావలె హస్తినకు" అని కృష్ణుడు అనడం తెలిసిందే. యుద్ధ మధ్యంలోనూ సంభాషణ అవసరాన్ని పలువురు నొక్కి చెప్పడమూ కనిపిస్తుంది. యుద్ధంలో, సంభాషణలో సమానులు, అసమానులు అన్న తేడా రాదు. యుద్ధాలు, సంభాషణలు అన్నీ సమానుల మధ్యే జరిగలేదు. సమానాత్వానికి ఉపయోగించే కొలమానాలలోనూ తేడా ఉంటుంది. ఒక పక్షంలో ధనబలం, కండ బలం ఎక్కువ ఉండచ్చు. ఇంకో పక్షంలో ధర్మబలం, నైతికబలం ఎక్కువ ఉండచ్చు. ఒక్కోసారి ధర్మబలం, నైతికబలమే విజయం సాధించవచ్చు. కనుక సంభాషణ అవసరాన్ని నిరాకరించడానికి అది సమానుల మధ్య యుద్ధం కాకపోవడం కానక్కరలేదు యుద్ధ, సంభాషణల అన్యోన్య సంబంధాన్ని గుర్తించినప్పుడు పూర్తిగా యుద్ధాన్ని వ్యతిరేకించాడమూ, లేదా పూర్తిగా సంభాషణను వ్యతిరేకించాడమూ రెండూ సరికాదని నా ఉద్దేశం. అప్పల్నాయుడి గారి కథ మీద చర్చ ఆ సరళిలో వెడుతున్నట్టుంది.
Deleteనెనర్లు భాస్కరంగారూ!
ReplyDeleteమీ ఈ సమాధానాన్ని యథాతథంగా మీరు చెప్పినట్లే సారంగలో ప్రచురించడానికి మీకేమైనా అభ్యంతరమా?
రెండవ సందేహం - మీలాంటి విజ్ఞులంతా కలసి హెచ్ సి యూలో సంభాషణలను ఆరంభించే ప్రయత్నం చేస్తే, ఈ జటిల సమస్యకు పరిష్కారాన్ని సూచించే దిశలో పౌరసమాజం తనవంతు బాధ్యతగా ఒక నూతన ఆరంభాన్నిచ్చినట్లు అవుతుందేమో!
సార్!
ReplyDeleteఅప్పల్నాయుడుగారి స్పందనలకు నా సమాధానం ఈ క్రింది విధంగా ఇవ్వాలనుకుంటున్నాను. చివరిలో మీరు చెప్పిన విషయాన్ని మీకు అభ్యంతరం లేకపోతే జోడిద్దామనుకుంటున్నాను.
**************************************************
అప్పల్నాయుడు గారూ!
అన్ని రకాల ఇజాలూ ఆదర్శాలేనేమోనని నా అనుమానం. ఇజాలు ఆదర్శాలుగా బయలుదేరి జీవితం యొక్క ప్రవాహతత్త్వాన్ని ఘనీభవింపజేస్తున్నాయేమో?
మీ కథ నన్ను శాంతి గురించి ఆలోచింపజేయడానికి కారణమేమంటే,
Hatred + Idealism = Negation అని ఎక్కడో ఒక నకారాత్మకమైన కోణాన్ని గురించి చదివేను.
కానీ, అభావం ప్రతి కీలక మలుపు దగ్గరా అభావం చెందుతుందని గతి తర్కం. కానీ, అలా అభావం చెందేటప్పుడు తనలోని సకారాత్మక అంశాలను నిలబెట్టుకునే అభావం చెందుతుంది. అది లేకుండా కేవలం ద్వేషాన్ని ద్వేషంతోనే జయించాలి అని మీ కథ చెబుతుందేమోనని, దానికి విరుద్ధమయిన శాంతిని గురించి మెదిలింది.
ఇక పోతే సంభాషణ యొక్క తీరుతెన్నుల గురించి కల్లూరి భాస్కరం గారి స్పందనను యథాతథంగా తెలియజేస్తున్నాను.
శ్రీనివాసుడుగారూ...నా అభిప్రాయాన్ని సారంగలో పోస్ట్ చేయడానికి నేనే ప్రయత్నిస్తాను.
Deleteబాస్కరం గారూ!
ReplyDeleteఅబ్బూరి వరదరాజేశ్వరరావుగారి మరికొన్ని పుస్తకాల లంకెలు
కవన కుతూహలం
http://dli.serc.iisc.ernet.in:8080/handle/2015/491484
వరద స్మృతి
http://dli.serc.iisc.ernet.in:8080/handle/2015/396113
అబ్బూరి సంస్మరణ
http://dli.serc.iisc.ernet.in:8080/handle/2015/492346
నా స్పందనను సారంగలో వ్రాసేసేను.