రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. అది వివిధ ప్రాంతాలలో కలిగించే సంతాప, సంతోషాలు కొంతకాలం కొనసాగడం సహజమే. ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోడానికి కొంత సమయం పట్టే మాట నిజమే. అయితే, తర్వాత అయినా భవిష్యత్ కార్యాచరణ మీద అన్ని ప్రాంతాలూ దృష్టి పెట్టక తప్పదు. ఈ నిర్ణయం నుంచి వీలైనన్ని సానుకూల ఫలితాలను పిండుకోడానికి ప్రయత్నించవలసి ఉంటుంది. ఆ మేరకు రాజకీయనాయకత్వంలో సరికొత్త విజ్ఞత, బాధ్యత అంకురిస్తాయని ఆశించాలి.
ఈ సందర్భంలో ఆయా ప్రాంతాల అభివృద్ధికి కొత్త బ్లూ ప్రింట్ అందించి రాజకీయనాయకత్వానికి సహకరించవలసిన నూతన బాధ్యత తెలుగు మేధావులపై ఉంది. అలా నిగ్గు తేలిన బ్లూ ప్రింట్ అమలుకు రాజకీయనాయకత్వంపై ఒత్తిడి తేవలసిన బాధ్యత ప్రజలపై ఉంది.
అభివృద్ధి అంశాలపై ఎంతో కాలంగా రాస్తున్న అరుదైన తెలుగు మేధావులలో జాన్సన్ చోరగుడి ఒకరు. రాష్ట్ర విభజన అంటూ జరిగితే తీరాంధ్ర అభివృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చర్చిస్తూ 2010లో ఆయన 'సాక్షి' దినపత్రికలో ఒక ఆలోచనాత్మకమైన వ్యాసం రాశారు. ఆ వ్యాసం లింకు కింద ఇస్తున్నాను.
నిర్మాణాత్మకంగా ఆలోచించి కొత్త blue print తో కొత్త రాజధానిని అత్యాధునికంగా సాధ్యమైనంత త్వరలో పూర్తిచేసుకోవాలి!శుభస్య శీఘ్రం!!!
ReplyDeleteధన్యవాదాలు సూర్యప్రకాశ్ గారు
ReplyDeleteఈ రొజె మీ ఆగస్ట్ 1 ఆర్టికల్ చదువుతూ క్రింద కనబరచిన లింక్ జాన్సన్ చోరగుడి గారి రేపటి తీరాంధ్ర అభివృద్ధి ఎలా అనె వ్యాసం కూడ ఇప్పుడె చదవటం జరిగింది చాలా బాగుంది.. మీ రన్నట్లు భవిష్యత్ కార్యాచరణ మీద అన్ని ప్రాంతాలూ దృష్టి పెట్టక తప్పదు. ఈ నిర్ణయం నుంచి వీలైనన్ని సానుకూల ఫలితాలను కెంద్రం నుండి పిండుకోడానికి ప్రయత్నించవలసి ఉంటుంది. ఆ మేరకు ఇప్పటికైనా అందరు కలసి 13 జిల్లాల ఆభివ్రుద్దికి, కొత్త రాజధాని యెర్పాటు, అందుకు కావలసిన నిదులు కొత్త బ్లూ ప్రింట్ అమలుకు రాజకీయనాయకత్వంపై ఒత్తిడి తేవలసిన బాధ్యత ప్రజలపై ఉంది. గతంలొ లాగ కాకుండా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు రెండు కలసి సరికొత్త నగరాలని ( అన్ని జిల్లాలు ) అభివ్రుద్ది చెందు లాగున నిర్మించి భావి తరాలు గర్వించె విధంగా తీర్చి దిద్దె సమయం ఆసన్నమైంది దీన్ని సద్వినియోగం చెసెందుకు ప్రజలు, మెధావులు, అన్ని రాజకీయనాయకులు (పార్టీలకతీతంగా) క్రుషి చెసి కెంద్రం నుండి సరిపడ నిదులు పొందెందుకు సమయము ఇదె. ఈ అవకాశాన్ని పొగొట్టుకొంటె ఇక ఎప్పటికి రాదు. మనం ఎంతసెపు, జపాన్, సంగపూర్, మలెషియా, గుర్చి మాట్లాడుతాం, కాని మన ప్రాంతాల్ని ఎలా అభివ్రుద్ది చెసుకొవాలొ ఇప్పటికైనా గ్రహించి పాటుపడాల్సిన సమయం ఇదె.
ReplyDeleteధన్యవాదాలు కాటంరెడ్డి గారూ, మీరన్నది నిజం.
ReplyDeleteunable to open the link. It is pointing to some random URL instead of to sakshi. can you post the actual link instead of sending us through intermittent advertisements.
ReplyDeleteసూర్యగారూ, ఇది మూడేళ్ళ క్రితం సాక్షిలో ప్రచురితమైన వ్యాసం. నేరుగా సాక్షి నుంచి తీసుకున్నది కాదు. రచయిత నాకు పిడిఎఫ్ లో పంపించారు. చదివి లింక్ ఇవ్వమని అడిగితే ఈ లింక్ ఇచ్చారు. మీ సమస్యను రచయిత దృష్టికి తెస్తాను.
ReplyDeleteఆంధ్రసీమ,తెలంగాణా వేగిరముగా జోడెద్దుల లాగా అభివృద్ధి చెంది తెలుగు బావుటా వినువీధుల్లో ఎగురవేయాలి!
ReplyDelete