పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు-కొవ్వూరు
రైలుమార్గంలో బ్రాహ్మణగూడెం అనే ఊరు.
నిజానికి బాపన్నగూడెం
అనే పేరుకు అది సంస్కృతీకరణ. ఓ శీతాకాలం సాయంత్రం కొవ్వూరు
వెళ్ళడం కోసం బ్రాహ్మణగూడెం స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్నాను. అదో చిన్న స్టేషన్. రైలు లేటు.
క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి. చలి ప్రారంభమైంది.
అంతలో స్టేషన్ ను ఆనుకునే ఉన్న
ఓ విశాల ప్రదేశంలో కొంతమంది చెరుకు పిప్పి పోగేసి మంట పెట్టారు. బతుకు జీవుడా
అనుకుంటూ నేను కూడా ఆ మంట దగ్గరికి
చేరాను. చూస్తూ ఉండగానే ఆ పరిసరాలలో ఉన్న ఆడా, మగా; చిన్నా పెద్దా అంతా వచ్చి వాలిపోయారు. ఆ వెచ్చదనం ఉల్లాసం నింపినట్టుంది, కబుర్లు ప్రారంభమయ్యాయి. మాటలు ఒకరినుంచి ఒకరికి అంత్యాక్షరిలా
ప్రవహించసాగాయి. అవి క్రమంగా సరసాలుగా మారాయి. సరసాలు ఒకరి ‘పరిచయాలు’ ఒకరు కెలుక్కునే వరకూ వెళ్ళాయి.
ఆ సమయంలో వాళ్ళ ముఖాలలో విరబూసిన తుళ్లింతలు, ఇకిలింతలు, చిరునవ్వులు, సిగ్గు దొంతరల కాంతులు ఆ చలిమంటతో
పోటీ పడ్డాయి. పోటాపోటీగా మాటలు రువ్వడంలో ఆడా, మగా ఎవరూ
ఎవరూ ఎవరికీ తీసిపోవడం లేదు...
(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. దయచేసి మీ స్పందనను సారంగలో పోస్ట్ చేయండి)
No comments:
Post a Comment