మహాభారతంలో భీముడు, ద్రౌపది, కృష్ణుడు
హింసావాదంవైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తారు. చావు ఎప్పటికైనా తప్పదు, చచ్చేలోపల శత్రువుపై పగతీర్చుకోని జన్మ వృథా అనేది భీముని సిద్ధాంతం. ఆ
విషయంలో అతనికి ఎలాంటి సందిగ్ధతా లేదు. అలాగే, శత్రువును ఎంత
క్రూరంగానైనా చంపడం రాజధర్మమని కృష్ణుని సూత్రీకరణ. ధర్మరాజుకు అహింస వైపు మొగ్గు ఉన్నా హింసను
నివారించలేకపోయిన నిస్సహాయత అతనిది. అర్జునుడి పాత్ర మరింత విలక్షణం. అతను హింస-అహింసల
మధ్య సందిగ్ధాన్ని ఎదుర్కొంటాడు. అతనిపై ఇటు ధర్మరాజు ప్రభావమూ, అటు కృష్ణుడి ప్రభావమూ రెండూ ఉంటాయి. తండ్రి,
తాతలను, అన్నదమ్ములను ఎలా చంపనని యుద్ధప్రారంభంలో ప్రశ్నించిన అర్జునుడే; సముచిత హింస అహింసే అవుతుందని ఆ తర్వాత ధర్మరాజుతో వాదిస్తాడు. శత్రువులనుంచి
సంపదను గుంజుకుని బంధుమిత్రసహితంగా అనుభవించడమే రాజధర్మమంటాడు. హింస-అహింసల మధ్య
సంఘర్షణను ఎదుర్కొన్న మరో పాత్ర అశ్వత్థామ. ‘నేను
విప్రకులంలో జన్మించి కూడా దురదృష్టం కొద్దీ రాజోచిత ధర్మాన్ని అనుసరించాను, ఇప్పుడు మధ్యలో విప్రధర్మానికి మళ్ళలేను’ అని
ఉపపాండవులను చంపడానికి వెళ్లబోయేముందు కృప, కృతవర్మలతో అంటాడు.
(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)
మహాభారతకాలంలోనేగాక ఇప్పటికీ యుద్ధము,శాంతి,హింస,అహింస,ధర్మము,అధర్మము, మధ్య సందిగ్ధము,సంఘర్షణ ప్రపంచాన్ని కలత పెడుతూనేఉన్నాయి.మానవులు ఎటూతేల్చుకోలేకపోతున్నారు.
శత్రువులనుంచి సంపదను గుంజుకుని బంధుమిత్రసహితంగా అనుభవించడమే రాజధర్మమంటాడు - is that true? where was it mentioned i never read it in bharatha.
ReplyDeleteశాంతిపర్వం, ప్రథమాశ్వాసం, 48వ పద్యంనుంచి 54 వ పద్యం దాకా చూడండి.
Delete