శర్మిష్ట మితభాషిత్వం నిగమశర్మ మితభాషిత్వం లాంటిది కాదు. అది
సమాజం ఆమెపై రుద్దిన
మితభాషిత్వం. నిజానికి స్త్రీ అతిభాషిత్వమూ, మితభాషిత్వమూ రెండూ ఒకలాంటివే. ఆమె మాటకీ మౌనానికీ ఒకే విలువ ఉంటుంది.
రేకు డబ్బాలో గులకరాళ్ళు చప్పుడు చేసినా ఒకటే, చేయకపోయినా
ఒకటే, విలువ మారదు.
స్త్రీకి తనదైన భాష లేదు. పురుషుడి భాష మాట్లాడుతుంది,
పురుషుడిలా ఆలోచిస్తుంది, పురుషుడి హృదయంతో స్పందిస్తుంది.
ఈ మాటలు అంటున్నప్పుడు, నాకు ఎంతో ఇష్టుడైన
ఒక కథకుడూ, ఆయన రాసిన ఒక కథా గుర్తుకొస్తున్నా(రు-యి). ఆ
కథకుడు, చెఖోవ్...ఆ కథ పేరు, The Lady.
స్త్రీకి సొంత గొంతు లేదు,
సొంత సమస్యలు లేవు; ఆమె పురుషుడి గొంతునూ, పురుషుడి సమస్యలనూ వినిపించే సౌండ్ బాక్స్ మాత్రమే నన్న సత్యాన్ని ఇంత
గొప్పగా చెప్పిన మరో రచన ప్రపంచసాహిత్యంలో ఉందని నేను అనుకోను. ఆ కథ ఇదీ:
(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)
No comments:
Post a Comment