Monday, September 22, 2014

మోడీ అమెరికా పర్యటనను మీడియా అతి చేయాలా?

ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ సందర్శించారు. అయినా మీడియా ఆ పర్యటనకు ముందు అంత హడావిడి చేయలేదు. పోనీ నేపాల్ చిన్నదేశం అనుకుందాం.

మోడీ జపాన్ సందర్శించారు. ఆ సందర్శనకు ముందు మీడియా అంత హడావుడి చేయలేదు.

ప్రస్తుతం ఆ అవకాశం లేదుకానీ, మోడి పాకిస్తాన్ సందర్శనకే వెడతారనుకుందాం. దానికి ముందు మీడియా అంత హడావుడి చేయదు.

మోడీ అమెరికా సందర్శనకు ముందే ఎందుకు అంత హడావుడి చేస్తోంది?

ఈ అమెరికా సెంట్రిక్ గ్లోరిఫికేషన్ ఎందుకు? అవసరమా? జనానికి ఉందో లేదో కానీ మీడియాకు ఈ అమెరికా పిచ్చి ఇంత ఉండాలా? ఇది ఒకవిధమైన దాస్యం కాదా?

మోడీ అమెరికా సందర్శనను మీడియా అతి చేయడంలో నాకైతే ఎలాంటి ఔచిత్యం కనిపించడం లేదు. మరి మీకు?

4 comments:

  1. మీ రన్నది నిజమే. ఈ‌ అమెరికాపిచ్చి రోగం మనదేశంలో అన్ని వ్యవస్థలమీదా ఉంది.

    ReplyDelete
  2. చేయాలా ? చేయాలి ! మోడీ మాటల్లో చెప్పా లంటే , ఉన్ కా రోటీ బీ టికానా హై నా !!

    జిలేబి

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. http://sriramugk.blogspot.com/2014/09/modi-visit-to-us.html

    ReplyDelete