నలదమయంతుల
కథ ఇదీ...
దమయంతి
గురించి నలుడూ, నలుడి గురించి దమయంతీ విన్నారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. ఓ రోజు దమయంతి
గురించే తలపోస్తూ నలుడు ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. అంతలో ఒక హంసల గుంపు ఎగురుతూ
వచ్చి అతని ముందు వాలింది. వాటిలో ఒక హంసను అతను పట్టుకున్నాడు. ‘నన్ను విడిచిపెడితే నీ గుణగణాలను దమయంతికి చెప్పి నీ మీదే ఆమెకు ప్రేమ
కలిగేలా చేస్తా’నని హంస అంది. నలుడు దానిని విడిచి పెట్టాడు.
గుంపుతో
కలసి హంస విదర్భపురానికి వెళ్ళి ఉద్యానవనంలో చెలికత్తెలతోపాటు విహరిస్తున్న దమయంతి
ముందు వాలి, కావాలని ఆమె చేతికి చిక్కింది. ‘నీ ప్రియతముడైన నలుడి దగ్గరనుంచి వచ్చాను. నేను ఎంతోమంది రాజుల్ని చూశాను.
సకలగుణసౌందర్యంలో నలుడికి ఎవరూ సాటి రారు. నువ్వు నారీరత్నం,
అతను పురుషరత్నం. మీ కలయిక ఇద్దరికీ మరింత శోభనిస్తుంది’
అంది.
చక్కని వివరణ నిచ్చారు. బాగుంది. నలుని స్పర్శకు వాడిన పూవులు వికసిస్తాయని కూడా అంటారుకదా... దమయంతి ఆ పరీక్షకూడా పెట్టిందని విన్నానే... అది కూడా వివరిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు..
ReplyDeleteధన్యవాదాలు. నేను చూసిన తెలుగు భారతం కథలో ఆ వివరం లేదు. బహుశా శ్రీహర్ష/శ్రీనాథ నైషధ కావ్యంలో ఉందేమో!
Delete