కొన్ని
ప్రాంతాలలో ఎగువ పాతరాతియుగా(క్రీ.పూ. 50,000-10,000)నికి చెందిన చిన్న చిన్న నగ్నస్త్రీ
మూర్తులు దొరికాయి. చరిత్రకు తెలిసినంతవరకు ఇవే అతి పురాతనమైనవి. ఈ ప్రాంతాలలో ఆస్ట్రియా
దిగువ ప్రాంతం ఒకటి. సన్నని రేణువులతో కూడిన మెత్తని సున్నపురాయితో తయారుచేసిన ఈ
మూర్తులు పదకొండు సెంటీమీటర్లు ఎత్తుంటాయి. ఈ స్త్రీమూర్తి రొమ్ములపై రెండుచేతులూ ముడుచుకుని ఉంటుంది. ఈ మూర్తిని విల్లెన్ డార్ఫ్ వీనస్ (Venus
of Willendorf) అంటారు. అయితే, వీనస్ అన్నారు కదా అని, ఈ
మూర్తి ఫ్రాన్స్ లోని లౌరే మ్యూజియంలో
ఉన్న Venus of Milo లా అందంగా,
ఆకర్షణీయంగా ఉండదనీ, స్థూల కాయంతో, బలిష్టమైన
కటిప్రదేశంతో ఉంటుందనీ జార్జి థాంప్సన్ అంటారు.
(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2015/03/05/%E0%B0%85%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D/లో చదవండి)

No comments:
Post a Comment