స్త్రీవధ విషయానికి వస్తే, తాటకను చంపిన రాముడు, పూతనను లొంగదీసుకున్న/చంపిన కృష్ణుడి పక్కనే హనుమంతుడు కూడా చేరుతున్నాడు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోయడం కూడా ఇలాంటిదే. ఒక బాబిలోనియా పురాణకథలో తియామత్ అనే జగజ్జనని లాంటి దేవతను మర్దుక్ అనే దేవుడు చంపుతాడు. సిర్సేను చంపడానికి ఓడిసస్ కత్తి దూస్తాడు. స్త్రీవధను ‘వీరత్వా’నికి సూచనగానే ఇవన్నీ చెబుతున్నాయి. ఈ ఉదాహరణలు ఏదో ఒక ప్రాంతానికి చెందినవి కాక, భిన్నప్రాంతాలకు చెందినవన్న సంగతిని దృష్టిలో ఉంచుకున్నప్పుడు, వీటిమధ్య ఉన్న పోలికలు కేవలం యాదృచ్చికాలని కాకుండా, వీటి వెనుక ఒక కచ్చితమైన సరళి ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఒక పరిణామాన్ని ఇవి చెబుతున్నాయి.
(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2015/03/18/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9C%E0%B0%AF%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%95%E0%B1%87-%E0%B0%B8%E0%B1%80%E0%B0%A4/ లో చదవండి)

No comments:
Post a Comment