Friday, August 14, 2015

స్లీమాన్ కథ-5: పెళ్లి కూతురి వేటలో...

ఎకెతేరీనా అతనికి నచ్చకపోలేదు. ఆమెది కట్టి పడేసే అందమే. కానీ ఎటూ తేల్చుకోలేకపోయాడు. మెక్లంబర్గ్ లో ఉన్న సోదరికి ఉత్తరం రాశాడు. ఒకసారి రష్యా వచ్చి సెయింట్ పీటర్స్ బర్గ్ లో తన దగ్గర కొన్ని వారాలు ఉండమనీ; ఆ తర్వాత నిన్ను మాస్కో తీసుకెడతాననీ, ఎకెతెరీనాను దగ్గరగా చూసి ఆమె ఎలాంటిదో, ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో, ఆమెకు వంట చేయడం వచ్చో రాదో తెలుసుకుని తనకు చెప్పాలనీ కోరాడు. “పెళ్లికూతుళ్ల కేం చాలామంది ఉన్నారు. వందలమందిలో తగిన అమ్మాయిని ఎంచుకోవడమే అసలు సమస్య. ఈ విషయంలో నీ సహాయం కావాలి. నాకు ఆడవాళ్ళలో గుణాలే కానీ లోపాలు కనిపించవు” అన్నాడు.

(పూర్తి రచన 'వ్యాపార శిఖరంపై...ఒంటరితనం లోయలో...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/08/14/%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%96%E0%B0%B0%E0%B0%82%E0%B0%AA%E0%B1%88-%E0%B0%92%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B0%A8/ లో చదవండి)

2 comments:

  1. భాస్కరంగారూ, నమస్తే, ఈ కథ ఆసక్తికరంగా ఉంది. ఈ టపా శీర్షికను "పెళ్లి కూతురు వేటలో.." అని కాక "పెళ్లి కూతురి వేటలో.." అని ఉంచాలనుకుంటాను. ఒక వేళ నేనే పొరబడి ఉంటే మన్నించండి.

    ReplyDelete
    Replies
    1. అవును శ్యామలరావుగారూ, మీరు చెప్పిందే సరైనది. "పెళ్లి కూతురి వేటలో..." అనే ఉండాలి. ధన్యవాదాలు. నమస్తే.

      Delete