చాలా రోజులైంది బ్లాగ్ రాసి. పాఠకులు మన్నించాలి. అందరికీ పండుగ శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంలో ప్రైమ్ పోస్ట్ ప్రచురించిన నా వ్యాసం లింకు ఇస్తున్నాను. చూడగలరు.
“అమ్మలగన్న
యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ…”
అన్న పోతనగారి పద్యం ప్రసిద్ధం. అలాగే, ప్రపంచ పౌరాణికతపై మూడు బృహత్ సంపుటాలు రచించిన
క్యాంప్ బెల్ అనే పండితుడు డిమీటర్ అనే గ్రీకుదేవతగురించి The Great Goddess of the Universe అంటాడు. ఆ మాట సూచిస్తున్నది కూడా
పోతనగారు పేర్కొన్న అమ్మలగన్న అమ్మనూ, మూలపుటమ్మనే!
ఆమె జగజ్జనని, లోకమాత. ఆదిశక్తి.
ప్రపంచమంతటా జగజ్జననిగా కొలుపు
లందుకున్న ఆదిమదైవం, స్త్రీ దేవతే.
ఈ చిత్రం చూడండి. చూడగానే ఈమె మన అమ్మవారే నని మీకు
అనిపించి తీరుతుంది. సూక్ష్మంగా చూసినప్పుడు వివరాలలో తేడాలు ఉంటే ఉండవచ్చు.
నిజానికి ఈమె హెకటే (Hekate) అనే గ్రీకు దేవత. ఈమె చంద్ర సంబంధి, చంద్రునికి ప్రతీక. మాంత్రిక దేవత, ప్రసూతి
దేవత
కూడా. ఈమె లాంటిదే అర్తెమిస్ అనే
మరో దేవత.
హెకటేను, అర్తెమిస్ ను
త్రియోదితిస్ (trioditis), అంటే మూడు మార్గాల
కూడలిలో ఉండే దేవతగానూ; త్రిప్రోసొపొస్
(triprosopos), అంటే మూడు ముఖాలు
కలిగిన దేవతగానూ కూడా పిలుస్తారు.
**ఈ పరిణామం కారణంగా ఈ వ్యాసపరంపర ఇక్కడ అర్థాంతరంగా ఆగిపోక తప్పడంలేదు. మరోచోట పునః ప్రారంభమవు తుందేమో నన్నది ప్రస్తుతానికి ఆశాభావం. -కల్లూరి భాస్కరం)**
ReplyDeleteభాస్కరం గారూ!
మీకు తెలిసిన విషయాన్నే మరలా మనవి చేస్తున్నాను. *వాకిలి*, *ఈమాట* అనే రెండు అంతర్జాల మాసప్రతికలలో మీరు ఈ వ్యాసపరంపరని కొనసాగించవచ్చేమో ఆలోచించండి. ఆ పత్రికలనే ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళకి మీ వ్యాసాల గురించి ఈ విధమైన స్పందనలనే ప్రచురించాలని ఒక పాలసీ అని ప్రత్యేకంగా వుండదు. వాళ్ళు తమ పత్రికలలో ప్రచురించిన వ్యాసాలకు వచ్చిన స్పందనలను ఇప్పుడు ఆగిపోయిన ప్రతికవారిలాగా, వారే చెప్పుకున్నట్లుగా ప్రచురించకుండా ఆపరు.
http://vaakili.com/patrika/
http://eemaata.com/em/
ఈమాట ఈ నెలనుండీ మాసపత్రికగా మారింది.
ధన్యవాదాలతో
....శ్రీనివాసుడు.
...
భాస్కరం గారూ, నేడు ఆంధ్రజ్యోతిలో తరుణ్ విజయ్ గురించిన మీ వ్యాసం చదివాను. తరుణ్ విజయ్ లో ఇంకోొ కోణం కూడా వుంది. పురాణపండ ఫణీంద్ర వ్రాసిన ఆ వ్యాసాన్నిస్తున్నాను. వీలుంటే చదవగలరు.
ReplyDeletehttps://puranapandaphani.wordpress.com/2017/04/09/%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%b9%e0%b0%82%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a6%e0%b1%8a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%95%e0%b1%81/#comment-642
జాత్యహంకారి దొరికాడు… కుమ్మేద్దాం పదండి
09 Apr 2017 25 Comments
by ఫణీన్ద్ర పురాణపణ్డ in ఉద్దేశాలు, రాజకీయాలు
వెయ్యి మంచిపనులు చేసి ఉండవచ్చు గాక… ఒక్క హత్య చేస్తే చాలు… అంతా పోయినట్టే..!
తరుణ్ విజయ్ జాత్యహంకారి అంటూ జరుగుతున్న రచ్చలో కనబడిన ఓ వ్యాఖ్య అది.
నిజానికి ఈ వ్యవహారంలో ఒక సామెత వాడవచ్చునా లేదా అని ఆలోచిస్తున్నాను. ‘వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిపోయింది’ అన్న సామెత అది. పోలికలో తేడా గురించి కాదు, ఆ సామెతను వాడితే అది అపసవ్యమైన ఇంటర్‌ప్రిటేషన్స్‌కు దారి తీస్తుందన్నది భయం. సరే, ఇప్పుడు ఆ మొదటి వ్యాఖ్యను తీసుకోవచ్చు.
తరుణ్ విజయ్ జాత్యహంకారి, మనువాది, ఆరెస్సెస్ ఫాసిస్టు, బ్లా బ్లా బ్లా… అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా రాసేస్తున్న వారిలో అందరూ మాటల శూరులే అని అర్ధమవుతోంది కానీ చేతల వీరులు ఎవరైనా ఉన్నారా అంటే అనుమానమే.
తరుణ్ విజయ్ వ్యాఖ్యలు సరైనవి అని సమర్ధించబోవడం లేదు. ఆ మాట అతనే ఒప్పుకున్నాడు, క్షమాపణలు చెప్పుకున్నాడు. అసలు సందర్భం ఏంటి, అతనేం మాట్లాడాడు, ఎందుకలా మాట్లాడాడు అన్నది ఒకసారి ఆలోచించాలి కదా. ఆ మాటలు స్లిప్ ఆఫ్ టంగా, లేక అతనికి మాలాఫైడ్ ఇంటెన్షన్ ఉందా, అసలు అతని ట్రాక్ రికార్డ్ ఏంటి… అన్నవి చూడాలి కదా.
భారతదేశంలోని ఆఫ్రికా ఖండవాసులు అందరిపైనా దాడులు జరుగుతున్నాయి… అవన్నీ జాత్యహంకార దాడులే… అన్న పాయింట్ మీద అల్‌జజీరా ఛానెల్ చర్చాగోష్టి నిర్వహించింది. ఓ భారతీయ ఫొటోగ్రాఫర్, కొందరు ఆఫ్రికన్ విద్యార్థులతో పాటు బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ (ఇండియా ఆఫ్రికా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ ఛైర్మన్) పాల్గొన్నాడు. ఆఫ్రికన్లపై జరిగే అన్ని దాడులనూ రేసిస్టు దాడులుగా పరిగణించడం సరికాదని ఆయన చెప్పాడు. భారతీయులు దేవుడిగా కొలిచే కృష్ణుడి పేరుకు అర్ధమే నల్లనయ్య అయినప్పుడు రంగు ఆధారంగా వ్యక్తులను అంచనా వేయడం సరికాదన్నాడు. ఐతే… భారతదేశం మొత్తం రేసిస్టుల మయం అన్న సాధారణీకరించేసిన ఇతర ప్యానెలిస్టులతో మాట్లాడే సందర్భంలో నోరు జారాడు. భారతీయులు జాత్యహంకారులైతే దక్షిణాది రాష్ట్రాలతో ఎలా కలిసుంటారని వ్యాఖ్యానించాడు. అక్కడే తరుణ్ విజయ్ అడుసులో కాలేశాడు. తర్వాత ట్విట్టర్ ద్వారా తను సరిగ్గా మాట్లాడలేదని ఒప్పుకున్నారు. తన భావానికీ పదప్రయోగానికీ పొంతన లేకుండా పోయిందంటూ క్షమాపణలు చెప్పుకున్నాడు. ఇంకేం, గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రతిపక్షాల వారందరూ తరుణ్‌ను ఏకిపారేశారు. సోషల్ మీడియా ట్రాలింగూ పెరిగిపోయింది.
ఇంతకీ దక్షిణాది అంటే తరుణ్‌విజయ్‌కి నిజంగా చిన్నచూపేనా? అతని వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే కొన్ని ఘటనలు చూద్దాం…
— తమిళనాడు హైకోర్టులో తమిళాన్ని వాడుకభాష చేయాలంటూ ఉద్యమించాడు.
— తమిళం, తిరుక్కురళ్ లేకుండా భారతదేశమే లేదని వ్యాఖ్యానించాడు.
TV 2
— తిరువళ్ళువర్ జీవిత చరిత్రను విద్యార్ధులకు పాఠ్యాంశంగా పెట్టాలని డిమాండ్ చేశాడు.
— తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో తిరువళ్ళువర్ విగ్రహం కట్టించాడు.
TV 1
— అగ్ర, నిమ్న వర్ణాల సమన్వయం కోసం కృషి చేశాడు, ఆ క్రమంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు.
— దళితులకు ఆలయ ప్రవేశం చేయిస్తూ సోకాల్డ్ అగ్రవర్ణస్తుల చేత రాళ్ళదెబ్బలు తిన్నాడు.
— కర్ణాటక కోలార్ జిల్లా కగ్గనహళ్ళి గ్రామంలో సాంఘిక బహిష్కరణ ఎదుర్కొన్న ఎస్సీ మహిళ రాధమ్మకు అండగా నిలబడ్డాడు. మూడురోజులు ఆ గ్రామంలో ఉండి ఆమె చేతి వంట తిన్నాడు. ఆమె బాధను పార్లమెంటులో వినిపించాడు.
ఉత్తరాఖండ్‌కు చెందిన తరుణ్ విజయ్‌కి తమిళ భాష గురించో, కన్నడ ఎస్సీ మహిళ గురించో కష్టపడాల్సిన పనేంటి? తరుణ్ విజయ్‌ను మీడియాలో, సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వారిలో ఎవరైనా అతని ఆచరణలో వెయ్యోవంతైనా ఆచరించగలరా? కానీ మనకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందిగా. వాడేసుకుంటే పోలా. పైగా తప్పు చేశాడు, చేశానని ఒప్పుకున్నాడు, అడ్డంగా దొరికిపోయాడు. అలాంటి జాత్యహంకారిని కుమ్మేద్దాం పదండి.