గోవా దగ్గరనుంచీ '2014' ఊపందుకుంటోంది. ఎప్పుడో కానీ టీవీలో కనిపించని ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ హఠాత్తుగా టీవీ తెర ముందుకు వచ్చారు. యూపీఏ, ఎన్డీయే లకు తమ పార్టీ(బీజేడీ) సమానదూరం పాటిస్తుందంటూ థర్డ్ ఫ్రంట్ కే తమ మొగ్గు అని స్పష్టం చేశారు. అద్వానీ రాజీనామా తర్వాత ఎన్డీయేతో తెగతెంపులు తప్ప గత్యంతరం లేదన్న జేడీయూ అద్వానీ రాజీపడిన తర్వాత కూడా తెగతెంపులవైపు అడుగేయడం విచిత్రం. నితీశ్ కుమార్ జేడీయూ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశం కాబోతున్నారు. బీజేపీతో తెంచుకున్నా తన ప్రభుత్వానికి ముప్పు లేకుండా చూసుకోడానికి స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంకోవైపు బీజేపీకి చెందిన ఉపముఖ్యమంత్రి సుశీల్ మోడి కూడా తమ ఎమ్మెల్యేలను సమావేశ పరుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రంగప్రవేశం చేసి థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడడం మరింత ఆసక్తికరం. జేడీయూ ఆమెతో మాట్లాడడానికి తన ప్రతినిధిని పంపింది, గోవాలో ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నియమితుడైన నరేంద్ర మోడీ శుభాకాంక్షలు అందించిన జయలలిత తాజాగా కేంద్రంలో friendly ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని వ్యాఖ్యానించారు. మోడీతోనే కాక నవీన్ పట్నాయిక్ తో కూడా స్నేహ సంబంధాలున్న జయలలిత ఆ వ్యాఖ్య ద్వారా ఏం సూచిస్తున్నారో తెలియక రాజకీయ వ్యాఖ్యాతలు తికమక పడుతున్నారు.
వామపక్షాలు, సమాజ్ వాది పార్టీ, తెలుగు దేశం చాలారోజులుగానే థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నాయి. నిజానికి భారత రాజకీయాలలో మొదటినుంచీ థర్డ్ ఫ్రంట్ కు పేటెంట్ పొందిన ప్రముఖ పార్టీలు ఇవే. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా థర్డ్ ఫ్రంట్ అనడం; జేడీయూ, బీజేడీలు ఇందుకు కలసివస్తాయని చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే మమతా బెనర్జీ కూడా థర్డ్ ఫ్రంట్ అంటే, అది థర్డ్ ఫ్రంట్ అవదు; ఫోర్త్ ఫ్రంట్ అవుతుంది. కారణం, ఇంకో థర్డ్ ఫ్రంట్ లో ఉన్న వామపక్షాలతో కలసి ఆమె ఫ్రంట్ కట్టే అవకాశం లేదు. కనుక, వామపక్షాలు, సమాజ్ వాది, తెలుగు దేశం పార్టీలు తమ థర్డ్ ఫ్రంట్ ను తాము విడిగా ఏర్పాటు చేసుకుంటాయి. ఒకవేళ సమాజ వాది, తెలుగు దేశం లు మమత ఫ్రంట్ లో చేరితే వామపక్షాలు ఒంటరిగా మిగిలిపోతాయి.
ఇలా థర్డ్ ఫ్రంట్ గుడారం వేస్తున్న పార్టీలు అన్నీ రేపు యూపీఏ, ఎన్డీయేలలో ఏదో ఒక వైపు చేరిపోయి గుడారం ఎత్తివేసే అవకాశాన్ని ఇప్పుడే తోసి పుచ్చలేం. ఈ క్షణానికి పరిమితమై చెప్పుకుంటే, థర్డ్ ఫ్రంట్ ఫోర్త్ ఫ్రంట్ కీ దారితీసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

No comments:
Post a Comment