Thursday, December 26, 2013

యూరపు వరకూ ఆర్యావర్తమే!

మధ్య ఆసియాలో రష్యా, అజర్బైజాన్, ఇరాన్, కజక్ స్తాన్, తుర్క్ మెనిస్తాన్ లను ఆనుకుని ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక జలాశయం ఉంది. అది ఎంత పెద్ద దంటే, దానిని సముద్రంగానే చెప్పుకున్నారు. అదే- కాస్పియన్ సీ. దీనిని మన పూర్వులు కాశ్యపీ సముద్రం అన్నారు. ఆ పేరునుబట్టి ఆ జలాశయం పరిసర ప్రాంతాన్ని కూడా కాశ్యపి అంటూ వచ్చారు. కాశ్యపి అన్నా భూమే. 

విశేషమేమిటంటే, కాశ్యపి ఒకప్పుడు  యూరోపియన్లు, నిగ్రాయిడ్లు, మంగోలాయిడ్లు వంటి అనేక జాతులవారికి, భాషల వారికి ఆవాసం. ఆనాడు జాతులంటే వర్ణాలే. యూరోపియన్లది తెలుపు రంగు, నిగ్రాయిడ్లది నలుపు రంగు, మంగోలాయిడ్లది పసుపు రంగు. సంస్కృతం తోబుట్టువులైన ఇండో-యూరోపియన్ భాషలు; మ్లేచ్ఛ భాషలైన హిబ్రూ, అరబ్బీ, అరమాయిక్, ఆగద, అసుర, ఈజిప్టు భాషలు; చీనా, జపాన్, మంగోలు, కాకస పర్వత భాషలు మాట్లాడేవారు కాశ్యపిలో ఉండేవారని రాంభట్ల జనకథలో అంటారు. 

అందుకే ఈ మూడు రకాల భాషల్లోనూ కొన్ని సామాన్య పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, భూమిని అరబ్బులు అర్దున్ అంటారు. జెర్మన్లు ఎర్దీ అంటారు. ఇంగ్లీష్ వారు ఎర్త్ అంటారు. వేదభాష రజ అంది. 

(పూర్తివ్యాసంhttp://magazine.saarangabooks.com/2013/12/26/%E0%B0%AF%E0%B1%82%E0%B0%B0%E0%B0%AA%E0%B1%81-%E0%B0%B5%E0%B0%B0%E0%B0%95%E0%B1%82-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AE%E0%B1%87/ లో చదవండి. మీ స్పందనను అందులోనే పోస్ట్ చేయండి)

Wednesday, December 18, 2013

యయాతి కథ ఈ దేశంలో జరిగినది కాదా?!

 నహుషుడు అనే మాట మ్లేచ్ఛభాషాపదమని , వేదకాలపు ఆయగార్లు వ్యాసంలో రాంభట్ల గారు అంటారు. ఇంకా చెప్పాలంటే అది సుమేరు పదం. సుమేరు భాషలో  ఆ మాటకు అజగరం’, అంటే కొండచిలువ అని అర్థం. నహుషుడు, యయాతి అనే పేర్లే కాక; యయాతి కొడుకుల పేర్లు కూడా (యదు,తుర్వసు, అను, దృహ్యు, పురు) వారు సుమేరులు కావచ్చునని సూచిస్తాయని రాంభట్ల అంటారు. ఆ రకంగా చూస్తే; యతి, సంయాతి, ఆయాతి, అయతి అనే యయాతి సోదరుల పేర్లే కాక; పురూరవుని పేరు కూడా అలాంటిదే అనిపిస్తుంది. నేను ఇంకొకటి కూడా గమనించాను. ఈ రాజుల పేర్లు కొత్తగా ధ్వనించినా, వారి భార్యల పేర్లు కొత్తగా కనిపించకపోవడం. ఉదాహరణకు, నహుషుని భార్య ప్రియంవద. యయాతి భార్యలు దేవయాని, శర్మిష్ట; పురూరవుని ప్రేయసి ఊర్వశి. ఇందులోని మర్మ మేమిటన్నది మరో ఆసక్తికరమైన ప్రశ్న.

దీనినిబట్టి తేలుతున్న దేమిటంటే, వేదభాషకు మ్లేచ్ఛభాష అయిన సుమేరుతో సంబంధం ఉండడమే కాక; వైదికార్యులకు సుమేరు ప్రాంతమైన పశ్చిమాసియాతో సంబంధం ఉంది. పశ్చిమాసియా ఉత్తర ప్రాంతంలో, అంటే నేటి టర్కీలో పురాణ ప్రసిద్ధులు, క్షత్రియులు అయిన కుశులు, మైతాణులు(మితానీలు), భృగులు రాజ్యాలను స్థాపించి పశుపాలనను, వ్యవసాయాన్ని సమన్వయపరిచారని రాంభట్ల అంటారు 

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2013/12/18/%E0%B0%AF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95-%E0%B0%AA%E0%B0%B6%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8/ లో చదవండి. మీ స్పందనను అందులోనే పోస్ట్ చేయండి)

Thursday, December 12, 2013

'రాక్షసులు' ఎవరు"!

రాక్షసులు, అసురులు, దానవులు, దైత్యులు అనే మాటలు మనకు బాగా తెలుసు. వీటి మధ్య స్వల్పంగా అర్థభేదాలు ఉండచ్చు కానీ వీటన్నిటినీ మనం రాక్షసులు అనే ప్రసిద్ధ అర్థంలోనే తీసుకుంటూ ఉంటాం. మన పురాణ, ఇతిహాస కథలు; వాటి ఆధారంగా తీసే సినిమాల పుణ్యమా అని  రాక్షసుల గురించి మనలో కొన్ని ఊహలు స్థిరపడిపోయాయి. వారు భారీ ఆకారంతో చాలా వికృతంగా భయంకరంగా ఉంటారు. వాళ్ళకు కొమ్ములు, కోరలు ఉంటాయి. వాళ్ళు మనుషుల్ని తినేస్తారు. వాళ్ళ దగ్గర ఏవో మాయలు ఉంటాయి. రాక్షసులను ఇలా ఊహించుకోవడంలో మనలో పెద్దవాళ్ళు, పండితులూ కూడా పసివాళ్లు అయిపోతూ ఉంటారు. ఇటువంటి రాక్షసులు నిజంగానే ఉండేవారని వారు నమ్మడమే కాక మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మహాభారతంలో నరమాంసభక్షణ చేసే రాక్షసజాతికి చెందినదిగా చెప్పే హిడింబ నరుడైన భీముని వరించడమే కాక అతనివల్ల కొడుకుని కూడా కంటుంది. అయినాసరే, ఆమె రాక్షసియే!

వేల సంవత్సరాలుగా సంస్కృతి, సారస్వతం, మతం వగైరాలు మన ఆలోచనలపై ముద్రించే నమ్మకాలు ఎంత బలీయంగా ఉంటాయో తెలుసుకోడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఇలాంటి నమ్మకాల చరిత్రను తవ్వుకుంటూ కాస్త లోపలికి వెడితే వాటి వెనుక ఉన్న హేతుత్వం అర్థమవుతుంది. కుక్కను చంపాలంటే మొదట దానిమీద పిచ్చికుక్క అనే ముద్ర వేయాలని నానుడి. అలాగే ఒకప్పుడు(బహుశా ఇప్పుడు కూడా) శత్రువు మీద; లేదా భిన్న ఆచారవ్యవహారాలు పాటించేవారి మీద  అలాంటి ముద్రలే వేసేవారు. ఆ విధంగా జాతి వాచకాలు ఎన్నో తిట్టుపదాలుగా, అవహేళన పదాలుగా మారిపోయాయి. అప్రాచ్యులు అనే మాటనే తీసుకోండి. తూర్పుదేశానికి చెందినవారు కారనే దాని సామాన్యార్థం. కానీ అదిప్పుడు తిట్టుపదంగా, అవహేళన వాచకంగా మారిపోవడం మనకు తెలుసు. అలాంటివే మ్లేచ్ఛుడు, పిండారీ లేదా పింజారీ వగైరా మాటలు.

(పూర్తివ్యాసం‘http://magazine.saarangabooks.com/2013/12/11/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%8E%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81/లో చదవండి. మీ స్పందన సారంగలోనే నమోదు చేయండి)

Wednesday, December 4, 2013

యయాతి కథ: సమాధానం దొరకని ప్రశ్నలు మరికొన్ని...

యయాతికి శర్మిష్ట భార్య ఎలా అవుతుందన్న సందేహానికి నేటి సంప్రదాయ పండితులనుంచి సమాధానం దొరకదని కిందటిసారి చెప్పుకున్నాం. అటువంటివే ఈ కథలో మరో మూడు ఉన్నాయి...

మొదటిది, యయాతికి శుక్రుడు ఇచ్చిన శాపం. శర్మిష్టతో సంబంధం పెట్టుకోవద్దన్న తన ఆదేశాన్ని యయాతి ఉల్లంఘించాడు కనుక, అతనికి అకాల వృద్ధాప్యం విధించి శుక్రుడు శిక్షించాడని అనుకుంటాం. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే, శుక్రుని శాపం యయాతికి ఏవిధంగానూ శిక్ష కాలేదు. అతడు యవ్వన సుఖాలు అన్నీ అనుభవించిన తర్వాతే సహజగతిలో వృద్ధుడయ్యాడు. శాపాలనే నమ్మవలసివస్తే, నిజంగా శిక్ష అనుభవించింది, అతని వృద్ధాప్యాన్ని మోసిన అతని కొడుకుల్లో ఒకడు. యయాతికి ఎలాంటి శిక్షా లేకపోగా మొదటినుంచి చివరివరకూ ప్రతీదీ అతనికి అనుకూలించాయి.  తను తొలిచూపులోనే శర్మిష్ట పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆమెను కోరుకున్నాడు. ఆమెను పొందాడు. ఆమెతో సంతానం కన్నాడు. చివరికి ఆమెకు కలిగిన పూరునే తన రాజ్యానికి వారసుని చేశాడు. ఈవిధంగా అన్నీ అతని ప్రణాళిక ప్రకారం, లేదా అతనికి అనుకూలించే ప్రణాళిక ప్రకారమే జరిగాయి.

దేవయాని కథ ఇందుకు భిన్నం. ఆమెకు దాదాపు అన్నీ ప్రతికూలంగానే జరిగాయి. 

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2013/12/04/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE/ లో చదవండి)