‘నహుషుడు’ అనే మాట మ్లేచ్ఛభాషాపదమని , ‘వేదకాలపు
ఆయగార్లు’ వ్యాసంలో ‘ రాంభట్ల గారు
అంటారు. ఇంకా చెప్పాలంటే అది సుమేరు పదం. సుమేరు భాషలో ఆ మాటకు ‘అజగరం’, అంటే కొండచిలువ అని అర్థం. నహుషుడు, యయాతి అనే
పేర్లే కాక; యయాతి కొడుకుల పేర్లు కూడా (యదు,తుర్వసు, అను, దృహ్యు, పురు) వారు సుమేరులు కావచ్చునని సూచిస్తాయని
రాంభట్ల అంటారు. ఆ రకంగా చూస్తే; యతి, సంయాతి, ఆయాతి, అయతి అనే యయాతి సోదరుల పేర్లే కాక; పురూరవుని పేరు కూడా
అలాంటిదే అనిపిస్తుంది. నేను ఇంకొకటి కూడా గమనించాను. ఈ రాజుల పేర్లు కొత్తగా
ధ్వనించినా, వారి భార్యల పేర్లు కొత్తగా కనిపించకపోవడం.
ఉదాహరణకు, నహుషుని భార్య ప్రియంవద. యయాతి భార్యలు దేవయాని, శర్మిష్ట; పురూరవుని ప్రేయసి ఊర్వశి. ఇందులోని మర్మ
మేమిటన్నది మరో ఆసక్తికరమైన ప్రశ్న.
దీనినిబట్టి తేలుతున్న దేమిటంటే, వేదభాషకు
మ్లేచ్ఛభాష అయిన సుమేరుతో సంబంధం ఉండడమే కాక; వైదికార్యులకు
సుమేరు ప్రాంతమైన పశ్చిమాసియాతో సంబంధం ఉంది. పశ్చిమాసియా ఉత్తర ప్రాంతంలో, అంటే నేటి టర్కీలో పురాణ ప్రసిద్ధులు, క్షత్రియులు
అయిన కుశులు, మైతాణులు(మితానీలు),
భృగులు రాజ్యాలను స్థాపించి పశుపాలనను, వ్యవసాయాన్ని
సమన్వయపరిచారని రాంభట్ల అంటారు
(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2013/12/18/%E0%B0%AF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95-%E0%B0%AA%E0%B0%B6%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8/ లో చదవండి. మీ స్పందనను అందులోనే పోస్ట్ చేయండి)
నహుషుడు సూర్య వంశము వాడు.. శ్రీరామచంద్రునికి పూర్వీకుడు.
ReplyDelete