Wednesday, December 4, 2013

యయాతి కథ: సమాధానం దొరకని ప్రశ్నలు మరికొన్ని...

యయాతికి శర్మిష్ట భార్య ఎలా అవుతుందన్న సందేహానికి నేటి సంప్రదాయ పండితులనుంచి సమాధానం దొరకదని కిందటిసారి చెప్పుకున్నాం. అటువంటివే ఈ కథలో మరో మూడు ఉన్నాయి...

మొదటిది, యయాతికి శుక్రుడు ఇచ్చిన శాపం. శర్మిష్టతో సంబంధం పెట్టుకోవద్దన్న తన ఆదేశాన్ని యయాతి ఉల్లంఘించాడు కనుక, అతనికి అకాల వృద్ధాప్యం విధించి శుక్రుడు శిక్షించాడని అనుకుంటాం. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే, శుక్రుని శాపం యయాతికి ఏవిధంగానూ శిక్ష కాలేదు. అతడు యవ్వన సుఖాలు అన్నీ అనుభవించిన తర్వాతే సహజగతిలో వృద్ధుడయ్యాడు. శాపాలనే నమ్మవలసివస్తే, నిజంగా శిక్ష అనుభవించింది, అతని వృద్ధాప్యాన్ని మోసిన అతని కొడుకుల్లో ఒకడు. యయాతికి ఎలాంటి శిక్షా లేకపోగా మొదటినుంచి చివరివరకూ ప్రతీదీ అతనికి అనుకూలించాయి.  తను తొలిచూపులోనే శర్మిష్ట పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆమెను కోరుకున్నాడు. ఆమెను పొందాడు. ఆమెతో సంతానం కన్నాడు. చివరికి ఆమెకు కలిగిన పూరునే తన రాజ్యానికి వారసుని చేశాడు. ఈవిధంగా అన్నీ అతని ప్రణాళిక ప్రకారం, లేదా అతనికి అనుకూలించే ప్రణాళిక ప్రకారమే జరిగాయి.

దేవయాని కథ ఇందుకు భిన్నం. ఆమెకు దాదాపు అన్నీ ప్రతికూలంగానే జరిగాయి. 

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2013/12/04/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE/ లో చదవండి)

4 comments:

  1. భాస్కరంగారూ,

    మీరు సారంగలో వ్రాసిన కొన్ని టపాలకు నేను నా అభిప్రాయాలను తెలియజేయటం జరిగింది.
    మీరు నా అభిప్రాయాలను ప్రకటించటానికి తిరస్కరించటాన్ని నేను గమనిస్తున్నాను.
    మీరిలా ఎందుకు చేస్తున్నారో నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
    మీ అభిప్రాయాలూ, మీ వ్యాసాలూ, అలాగే మీకు నచ్చిన వ్యాఖ్యలూ అనుకోవలసి వస్తున్నది.
    అలాగే ఈ వ్యాఖ్య కూడా ప్రకటించబడుతుందో లేదో తెలియదు!
    స్వస్తిరస్తు.

    ReplyDelete
  2. శ్యామలరావుగారూ, మీ లాంటి పెద్దలు కూడా ఇటువంటి నిరాధారమైన ఆరోపణ చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. కలియుగంలో ధర్మం ఒంటి కాలుతో కాబోలు నడుస్తుందంటారు. మీ ఆరోపణ చూస్తుంటే ధర్మానికి ఒంటి కాలు కూడా మిగలలేదనిపిస్తోంది. సారంగలో మీ అభిప్రాయాల ప్రకటనను తిరస్కరించే అవసరం సంగతి అలా ఉంచి అవకాశం కూడా నాకు లేదు. కారణం వెరీ సింపుల్. సారంగ నేను నిర్వహించడం లేదు. కనుక మీరు సారంగ నిర్వాహకులకు రాయవచ్చు. ఇలా అన్నానని నా నిర్వహణలో ఉన్న నా బ్లాగులో మీ అభిప్రాయాలను కేరీ చేయననే అపార్థాన్ని తీసుకోవద్దు. కారణం, నాకు తెలిసినంతవరకు మీ అభిప్రాయాలు అన్ పార్లమెంటరీ భాషలో ఏమీ ఉండవు.

    ReplyDelete
    Replies
    1. మరచిపోయాను...సారంగలో నా 'ఋతుకాలోచితం...' అనే వ్యాసం మీద మీ స్పందన మాత్రం చూశాను. దానికి జవాబిచ్చాను.

      Delete
  3. యయాతికి శర్మిష్ట భార్య ఎలా అవుతుందన్న సందేహానికి ...బహుశా యయాతి శర్మిష్ఠను గాంధర్వ వివాహం చేసుకుని ఉండవచ్చుననిపిస్తోందండి.
    శుక్రుని శాపం యయాతికి మాత్రమే కాదు శర్మిష్ఠకూ శాపమే. శర్మిష్ఠ కుమారుడు పురు తండ్రి యొక్క వృద్దాప్యాన్ని స్వీకరించాడు.
    కుమారుడు వృద్దాప్యంతో బాధపడుతుంటే అతని యవ్వనాన్ని స్వీకరించినా సరే ....తల్లితండ్రి ఏ విధంగా సుఖపడగలరు ?
    ఆ విధంగా శుక్రుని శాపం వల్ల శర్మిష్ఠ యయాతి ఇద్దరూ మనశ్శాంతిని కోల్పోవటమే జరిగింది.

    ReplyDelete