Thursday, June 11, 2015

మన వ్యాసుడు, గ్రీకుల హోమర్...కొన్ని పోలికలు

తూర్పు, పడమరల మధ్య ఆశ్చర్యకరమైన అనేక పోలికల గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే…
భాగవతం ప్రకారం; అపారమైన రక్తపాతం, విధ్వంసం నిండిన మహాభారతాన్ని చెప్పిన తర్వాత వ్యాసుడు తీవ్ర మానసిక అశాంతికి లోనయ్యాడు. అప్పుడు నారదుడు ఆయన దగ్గరకు వచ్చి విష్ణుభక్తి ప్రధానమైన భాగవతాన్ని చెప్పమనీ, అప్పుడు నీ మనసుకు శాంతి కలుగుతుందనీ చెప్పాడు. వ్యాసుడు అలాగే చేసి శాంతి పొందాడు.
గ్రీకుల హోమర్ కూడా మొదట యుద్ధ ప్రధానమైన ‘ఇలియడ్’ ఇతిహాసాన్ని చెప్పాడు. ఆ తర్వాత తత్వ ప్రధానమైన ‘ఒడిస్సే’ చెప్పాడు.

('రాముడు, ఒడిసస్... ఇద్దరూ సౌరవీరులే' అనే శీర్షికతో పూర్తి వ్యాసం  http://magazine.saarangabooks.com/2015/06/11/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%93%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B8%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%B0%E0%B1%82-%E0%B0%B8%E0%B1%8C%E0%B0%B0/ లో చదవండి)

1 comment:

  1. కేవలం పదుల వయసు లో ఉన్న ప్రస్తుత సమాజం- కొన్ని వందల సంవత్సరాల క్రితమే మొదలైన 'ఆధునిక చరిత్రకారుల' అధ్యయనాలను చదువుతూ, వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన మన పూర్వ చరిత్ర ను పాశ్యాత్య దేశాల చరిత్రకారుల 'రంగుటద్దాలతో' చూసినట్లుగా ఉన్న కొన్ని వ్యాసాలు తప్పితే, మొత్తంమీద మీ 'పురాగమనం' మమ్మల్ని ఒక అలౌకిక జగత్తులో విహరింపచేసిందనడంలో అతిశయోక్తి లేదు. పురా సమాజాల్లో ఉన్నచాలా విషయాలను, ఆచారాలను 'వాస్తవిక దృష్టి' తో విశ్లేషించి వాటిలో ఉన్న అనేక అబ్బురపరచే పోలికలు మీరు విశదీకరించిన తీరు అద్భుతం.
    ఇలా 'పురా-ప్రస్తుత' లోకాల్లో మమ్మల్ని ఊయలలూపుతున్న మీ 'వ్యాస పరంపర' ఇక చివరి అంకానికి వస్తోందన్న విషయాన్ని మాత్రం 'జీర్ణం' చేసుకోలేకపోతున్నాము. కానీ 'కాలోహి దురతిక్రమహ' అన్నట్లుగా ఎన్ని 'విశెషాలు' జరిగినా అవి చరిత్ర పుటల్లో 'నిక్షిప్తం' కావడం, వాటినుండి ముందుకు పోవడం అనేది ప్రకృతి సహజం. అయినా ఈ మీ 'వ్యాస పరంపర' కేవలం చిన్న విరామం తీసుకొని 'సశేషం' గా మాత్రమే అయి మళ్లీ త్వరలో మరిన్ని కొత్త విషయాలను మాకు తెలుపుతారని ఆశిస్తూ...
    ధన్యవాదములతో
    సుందరం

    ReplyDelete