Monday, June 8, 2015

తెలుగు రాజకీయాలు కంపరం పుట్టిస్తున్నాయి

ఆంధ్ర, తెలంగాణ రాజకీయనాయకత్వాల మధ్య కలహాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది?

నాకైతే చాలా కంపరం కలుగుతోంది. మొత్తం తెలుగు ప్రజల బాగోగుల గురించి భయం కలుగుతోంది. అసలు నష్టం విభజన వల్ల కాక ఈ రెండు రాష్ట్రాల రాజకీయనాయకత్వాల కలహాల వల్లనే ననిపిస్తోంది. కలహాలు ఉండచ్చు. ఉండడం సహజమే. కానీ అవి ఉండవలసిన స్థాయిలో ఉండాలి. వాటికి ప్రజాప్రయోజనం ప్రాతిపదిక కావాలి. అవి క్రమంగా సమన్వయానికి రాజీకీ దారి తీసేలా ఉండాలి.  కానీ ఇప్పుడు చూస్తున్న కలహాలు అలా లేవు. అవి మరీ నేలబారుగా అసహ్యంగా ఉన్నాయి. పూర్తిగా రాజకీయ కశ్మలంతో నిండి ఉన్నాయి. ఇవి అంతమయ్యేలా లేవు. సమన్వయానికి, ప్రజాహితమే లక్ష్యంగా రాజీకి అవకాశం ఉన్నట్టే కనిపించడం లేదు.

విభజనకు బాధపడని వారు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. నిన్నటి పెద్ద రాష్ట్రం రెండుగా చీలి పరిమాణంలో చిన్న ముక్కలు అయినట్టే, రాజకీయాలలో కూడా మరుగుజ్జు అయిందా అనిపిస్తోంది. ఈ పతనం ఇక్కడితో ఆగదనిపిస్తోంది. మిగతా రాష్ట్రాల దృష్టిలో తెలుగువాళ్లు అందరూ సామూహికంగా చులకన అవుతున్నారు. ఈ అధోగతిని ఆపె శక్తులు ఏవైపునా కనిపించకపోవడం మరుగుజ్జు తనానికి మరో దాఖలా!

2 comments:

  1. Read this: http://blog.marxistleninist.in/2015/06/blog-post_9.html

    ReplyDelete
  2. శ్రీ భాస్కరం గారూ,
    ఇది ఒక రాజకీయాలకే కాదు మిగిలిన అన్ని విషయాలకూ వర్తిస్తుంది. ముఖ్యంగా మనలో ఉన్న, రోజు రోజుకూ పెరుగుతూ ఉన్న "లోపాయికారీ తనం", ' అక్రమ మార్గ 'త్వరితగతి' సంపాదన చేయాలనే ఆకాంక్ష. ఇదివరలో 'బీమారూ' అని పిలిచే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి ఎక్కువ ప్రమాదకరంగా ఉందని అనేక విశ్లేషణలు చెబుతున్నాయి. అవినీతి అనేది కేవలం పై స్థాయిలో మాత్రమే కాదు, అట్టడుగు స్థాయి నుండీ 'ఎదో' ఒక 'వ్యక్తిగత' ప్రయోజనం పొందాలనే ఆశ. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా దుర్వినియోగం ఔతున్నాయో ప్రతి ఒక్కరికీ తెలుసు , అయినా వాటిని మనం చూస్తూ, మనం కూడా భాగస్వామ్యం కావడం విచారించతగ్గ విషయం.
    రాజకీయ నాయకులు వేరు కాదు, ప్రజా ప్రతినిధులు వచ్చేది ప్రజలలోంచే కదా కాబట్టి అన్నీ ఒక తానులో ముక్కలే.
    మనలోంచే మనకు మంచైనా, చెడైనా చేసే నాయకులు పుడతారు. ప్రతి ఒఖ్హరూ 'వ్యక్తిగతం' గా మారితే అప్పుడు 'వ్యవస్థాగతం' గా మనం మంచి సమాజం సాధించవచ్చు.

    ReplyDelete