Tuesday, February 5, 2013

రాహుల్ ప్రధాని పదవికి ఏవిధంగా అర్హుడు?

రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ సహా ఆయా పార్టీల థింక్ ట్యాంక్ సక్రమంగానే పనిచేస్తోందా?!

ఆయనకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్నను అది ముందుకు తేకపోవడం గమనిస్తే ఈ అనుమానం కలుగుతోంది.

రాహుల్ గాంధీ ప్రధాని పదవికి ఏవిధంగా అర్హుడన్నదే ఆ ప్రశ్న.

రాహుల్ ప్రధాని పదవికి అభ్యర్థి అని కాంగ్రెస్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించకపోవచ్చు.  కానీ ఆ ఊహ చాలాకాలంగా ప్రచారంలో ఉంది. ఇటీవల ఆయనకు పదోన్నతి కల్పించిన తర్వాత ఆ ప్రచారం మరింత ఊపును అందుకునే అవకాశముంది. విచిత్రం ఏమిటంటే, 'రాహుల్ ప్రధాని పదవికి ఒక అభ్యర్థి' అన్న ఊహతో బీజేపీతోపాటు అనేక పార్టీలు కూడా రాజీ పడిపోయినట్టు కనిపించడం!  ఈ పార్టీల  థింక్ ట్యాంక్ సక్రమంగానే పనిచేస్తోందా అన్న అనుమానం అందుకే కలుగుతోంది.

ఎందుకంటే,  రాహుల్ 'అర్థ భారతీయుడు' మాత్రమే. మిగతా సగం ఆయన ఇటాలియన్. భారతదేశంలో ప్రధాని పదవికి అర్హతగల 'సంపూర్ణ భారతీయులు' ఎంతోమంది ఉండగా ఈ అర్థ భారతీయుడి అభ్యర్థిత్వాన్ని ఎందుకు ఆమోదించాలి? ఆమోదించడం వెనుక హేతుబద్ధత ఏమిటి?

ఈ ప్రశ్నలకు జవాబు చెప్పవలసిన బాధ్యత కాంగ్రెసేతర పార్టీలకు ఉంది.

రాజీవ్ గాంధీ అనే ఒక భారతీయుడి కుమారుడిగా రాహుల్ గాంధీ సంపూర్ణ భారతీయుడేననీ,  కనుక భారత ప్రధాని పదవికి అర్హుడేననీ అంటారా? ఏ ప్రాతిపదిక మీద అలా అంటారు? రాజీవ్ గాంధీ కుమారుడిగా ఆయన భారతీయుడే అయినప్పుడు సోనియా గాంధీ కుమారుడిగా ఇటాలియన్ మాత్రం ఎందుకు కారు? జాతీయతను రాజీవ్ గాంధీ అనే పురుషుడి వైపు నుంచి నిర్ణయించి, సోనియా గాంధీ అనే స్త్రీ వైపునుంచి ఎలా నిరాకరిస్తారు? ఇది  స్త్రీ-పురుషుల మధ్య వివక్ష చూపడం కాదా? ఈ వివక్షను  ఎందుకు ఒప్పుకోవాలి?  ఎవరు ఒప్పుకున్నప్పటికీ  స్త్రీవాదులు, మహిళా సంస్థలవారు ఎలా ఒప్పుకుంటారు?

ఇంకాస్త లోతుకు వెడితే ఇది 'బీజ-క్షేత్రా'ల గురించిన ప్రశ్న. పురుషాధిపత్యవ్యవస్థలో బీజానికే ప్రాధాన్యం ఇస్తారు. ఆవిధంగా రాజీవ్ గాంధీ కుమారుడిగా రాహుల్ భారతీయుడే అవుతారు కనుక ప్రధాని పదవికి ఆయన అర్హుడే నన్నది ఆయా పార్టీల అప్రకటిత భావనగా కనిపిస్తోంది. అంటే బీజ ప్రాధాన్య పురుషాధిపత్యవ్యవస్థను పరోక్షంగా అంగీకరించడమే. పైన చెప్పుకున్నట్టు ఎవరు అంగీకరించినా స్త్రీవాదులు, మహిళా హక్కుల సంఘాలు ఎందుకు ఒప్పుకోవాలి? క్షేత్రప్రాధాన్య కోణాన్ని వారు ముందుకు తేవచ్చుకదా? అప్పుడు రాహుల్ సంపూర్ణ ఇటాలియనే అవుతారు. ఆవిధంగా రాహుల్ ప్రధాని పదవికి అర్హుడు కారన్న వాదానికి ఈ వర్గం వాదాన్ని ప్రధాన ఆయుధంగా చేసుకోవచ్చు.

పోనీ పురుషాధిపత్యవాదులూ, స్త్రీవాదులూ రాజీపడి రాహుల్ ను అర్థ భారతీయుడిగా, అర్థ ఇటాలియన్ గా గుర్తించారనే అనుకుందాం. అప్పుడు కూడా రాహుల్ అభ్యర్థిత్వం ప్రశ్నించదగినదే అవుతుంది. మొదటే చెప్పినట్టు ప్రధాని పదవికి అర్హతగల సంపూర్ణ భారతీయులు ఎందరో ఉండగా అర్థ భారతీయుని అభ్యర్థిత్వాన్ని ఎందుకు అంగీకరించాలి? 

15 comments:

  1. మొదటగా నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. ఇక విషయంలోకి వస్తే... ఒక్క భారత దేశమే కాదు.. ప్రపంచంలో కూడా ఒక రూల్ అమలులో ఉంది. అదేమంటే... ఒక వ్యక్తి ఎక్కడ పుట్టాడు అనే విషయం అతని జాతీయతను నిర్దేశిస్తుంది. రాహుల్ గాంధీ ఢిల్లీ లో పుట్టాడు కనక అతడు సంపూర్ణ భారతీయుడు. ఇక్కడ క్షేత్రానికీ ప్రాధాన్యత లేదు, బీజానికీ ప్రాధాన్యత లేదు. ఆ మాటకు వస్తే అమెరికా లో నివాసముంటున్న ప్రవాస భారతీయులకు పుట్టిన సంతానం డీఫాల్ట్ గా ఎలా అమెరికన్స్ గా ఉంటారో ఇదీ అంతే. ఇందులో స్త్రీ పురుషుల ప్రస్తావనే లేదు.

    మీ ప్రశ్నను మాత్రం నేను కూడా సమర్థిస్తాను. రాహుల్ గాంధీ ఎందువల్ల ప్రధాని పదవికి అర్హుడు అని.. ( కానీ అతడు భారతీయుడు కాదు కనక అర్హుడు కాదు అనే వాదన మాత్రమే నేను తిరస్కరిస్తున్నా ).

    ReplyDelete
  2. " ఒక్క భారతదేశమే కాదు...ప్రపంచంలో కూడా ఒక రూల్ అమలులో ఉంది. అదేమంటే...ఒక వ్యక్తి ఎక్కడ పుట్టాడు అనే విషయం అతని జాతీయతను నిర్దేశిస్తుంది. రాహుల్ గాంధీ ఢిల్లీలో పుట్టాడు కనుక అతడు సంపూర్ణ భారతీయుడు. ఇక్కడ క్షేత్రానికీ ప్రాధాన్యత లేదు. బీజానికీ ప్రాధాన్యత లేదు." జాతీయతకు, పౌరసత్వానికీ తేడా ఉంది. అందులోకి వెళ్లకుండా పౌరసత్వం గురించే చూద్దాం. పౌరసత్వానికి పుట్టుక ఒక్కటే అర్హత కాదు. మరికొన్ని అర్హతలూ ఉన్నాయి. ఒక విశ్లేషణను ప్రస్తావించుకుందాం.
    "It is to the credit of the Indian Constitution that it does not distinguish the rights of citizens on the basis of how they acquired citizenship-by birth, descent, registration, naturalization or incorporation of territory. It does not create different classes or categories of citizens. Vitally, unlike its United States counterpart, the Indian Constitution does not restrict eligibility to the top constitutional offices of President, and Vice-President to natural-born citizens. There is also no question of placing any such restriction on eligibility to became Minister, or Prime Minister, or Chief Minister. It was certainly a conscious decision of the Constitution makers, as any such distinction between natural-born and naturalized citizens would militate against equality before the law ensured by the Constitution. (Frontline, June, 5-18,1999. by V.Venkatesan)

    ReplyDelete
    Replies
    1. సోనియా గాంధీ భారత పౌరసత్వం naturalization అనే వర్గీకరణ కిందికి వస్తుంది. భారత రాజ్యాంగం ఇలా వివిధ వర్గీకరణల కిందికి వచ్చే పౌరులు ఉన్నతపదవులు పొందే అవకాశాన్ని నిషేధించడం లేదనీ, అమెరికాలో అలాంటి నిషేధం ఉందనీ పై విశ్లేషణ చెబుతోంది. అయినాసరే, ప్రధాని కావడానికి ఒక 'విదేశీయురాలిగా' సోనియా అర్హతను అనేక కాంగ్రెసేతర పార్టీలు ప్రశ్నించాయి. కనుక, రాజకీయమైన డిమాండ్ కు రూలుతో పనిలేదు. కావాలంటే రూలునే మార్చేసుకోవచ్చు.
      ఇదే రాహుల్ గాంధీకీ వర్తిస్తుంది. సాంకేతికంగా ఆయన భారతీయుడు అయితే మాత్రం? వాస్తవంలో అర్థ భారతీయుడు మాత్రమే. సోనియా విషయంలో అడ్డురాని రూలు రాహుల్ విషయంలో ఎందుకు రావాలి? ఆయనకు అంత ఉదారంగా కన్సెషన్ ఎందుకు ఇవ్వాలి?

      Delete
    2. ఇక బీజ-క్షేత్ర కోణం. చాలా దేశాలలో ఈ తేడా ఇప్పటికీ ఉంది. మనదేశంలో అధికారికంగా లేకపోవచ్చు కానీ, అనధికారికంగా ఉంది. ప్రధాని పదవికి రాహుల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించకపోవడం వెనుక అప్రకటితంగా ఉన్నది బీజప్రాధాన్య పితృస్వామ్య భావజాలమే. రాహుల్ మైనో అనకుండా రాహుల్ గాంధీ అనడమే పితృస్వామ్య సూచన.
      ఇంకొకటి కూడా గమనించాలి. పుట్టుక మాత్రమే జాతీయతను నిర్ణయిస్తుందంటే భారతపౌరసత్వం ఉన్న విదేశీ జంటకు కలిగిన సంతానానికి కూడా ఉన్నతపదవులకు అవకాశాన్ని అంగీకరించాలి. అదే పరిస్థితి వస్తే తప్పకుండా దానికి ప్రతిఘటన ఉంటుంది. అప్పుడు రూలునే సవరించాలన్న డిమాండ్ వస్తుంది. రాహుల్ విషయంలో ఆ ప్రశ్న రాలేదంటే, కారణం ఆయన తండ్రి భారతీయుడు అన్న పితృస్వామ్య ఆమోదమే.

      Delete
  3. రాహుల్ నెహ్రూ-గాంధీ కుటుంబంలోని వ్యక్తి.
    ఈ దేశంలో అది రాజకుటుంబం.
    ప్రజాస్వామయబధ్దంగా రాజకుటుంబంలోని వ్యక్తికీ అవకాశం ఉండి తీరాలి.
    కాబట్టి రాహుల్ పూర్తిగా అర్హుడు.
    ఇకపోతే యిత్యరులకు అర్హత లేదా అంటే, యెందుకు లేదు?
    అటువంటి అవకాశాలు దొరికినప్పుడు ఇతరులూ ప్రధాని అవుతున్నారు, ఇంతకు ముందు అయ్యారు కూడ.
    ఒక్కొక సారి రాజకుటుంబం వారే తమ అవసరాలకోసం ఇతరులనూ ప్రధాని కుర్చీలో కూర్చోబెడుతుంటారు, దానికి ప్రస్తుత ప్రధాని ఒక ఉదాహరణ అనికూడా అప్పుడప్పుడు కొందరు ఆక్షేపిస్తుంటారు.
    ఒక్క విషయం గురుంచు కోవాలి.
    'All are equal before law, but some are more equal'

    ReplyDelete
  4. రాహుల్ గాంధీ అర్ధభారతీయుడైతే, రాహుల్ గాంధీ సంతానం ముప్పాతిక భారతీయులు మాత్రమే అవుతారు. కాబట్టి వారికీ అర్హత ఉండదు. ఇలాగు వాళ్ళింట్లో ఎవ్వరూ ఎవ్వటికీ 'సంపూర్ణ భారతీయులు' కాదుకాబట్టి ఇంకెవ్వరూ ప్రధాని అయ్యేఅవకాశంలేదు. అర్హతలు సామర్ధ్యాలపై ఆధారపడుంటే బాగుంటుందేకానీ, ఇలా 'భారతీయతపాళ్ళు'పై కాదు . వరుణుడు గారి "మీ ప్రశ్నను మాత్రం నేను కూడా సమర్థిస్తాను. రాహుల్ గాంధీ ఎందువల్ల ప్రధాని పదవికి అర్హుడు అని. ( కానీ అతడు భారతీయుడు కాదు కనక అర్హుడు కాదు అనే వాదన మాత్రమే నేను తిరస్కరిస్తున్నా )."తో ఏకీభవిస్తున్నాను.


    సోనియా గాంధీ విషయంలోకూడా అభ్యంతరం పురుషాధిక్య కోణంలోంచి కాదనుకుంటాను. ఆమె మతం మార్చుకొని, హిందువుగా మారి, వీలైతే బీజేపీవారి భావజాలంతో సరిపడే ఒక పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నట్లైతే, అప్పుడు ఆమె విషయంలోకూడ ఈ భారతీయత ప్రశ్న ఉదయించేదికాదు. కేవలం సమర్ధత గురించి మాత్రమే మాట్లాడుకొంటుండేవారం. (సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పురసత్వ విషయాలనుకూడా పరిగణలోకి తీసుకొనేంత సీరియస్గా ఈ భారతీయత వ్యాఖ్యలులేకపోవడంచేతనూ, కేవలం appeal to emotion తరహాలో ఉండటంవల్లనూ ఆవిషయాలని పరిగణలోకి తీసుకోవడంలేదు).

    ReplyDelete
  5. (సోనియా గాంధీ, రాహుల్ గాంధీల వారసత్వ విషయాలనుకూడా పరిగణలోకి తీసుకొనేంత సీరియస్గా ఈ భారతీయత వ్యాఖ్యలులేకపోవడంచేతనూ, కేవలం appeal to emotion తరహాలో ఉండటంవల్లనూ ఆవిషయాలని పరిగణలోకి తీసుకోవడంలేదు).

    ReplyDelete
    Replies
    1. Damn! మీరు మళ్ళీ క్షమించాలి. అది "పౌరసత్వ", "వారసత్వ" కాదు, "పురుసత్వ" కాదు.

      Delete
    2. "అర్హతలు సామర్థ్యాలపై ఆధారపడుంటే బాగుంటుందేకానీ, ఇలా 'భారతీయతపాళ్ళు'పై కాదు".
      మీరన్నది బాగానే ఉంది. మరి సోనియా గాంధీ విషయంలో సామర్థ్యాన్ని కాక ఆమె విదేశీయతను ఎందుకు ప్రశ్నించారు? సోనియా విషయంలో చర్చలోకి వచ్చిన 'ఇటాలియన్ కనెక్షన్' రాహుల్ విషయంలో ఎందుకు రావడం లేదు? తల్లికి ఉన్న 'ఇటాలియన్ కనెక్షన్' కొడుకుకి ఉండదా? ఏమిటి దీని వెనుక రీజనింగ్? రాహుల్ విషయంలో ఎందుకు ఆ చర్చ రావడం లేదంటే ఆయన రాజీవ్ గాంధీ అనే భారతీయుడి కొడుకు కనుక. అందులో పితృస్వామ్య మనస్తత్వం నిగూఢంగా ఉంది కనుక.
      "సోనియా గాంధీ విషయంలో కూడా అభ్యంతరం పురుషాధిక్యకోణం లోంచి కాదనుకుంటాను". పురుషాధిక్య కోణం లోంచి అని నేను కూడా ఎక్కడా అనలేదు. ప్రధాని పదవికి రాహుల్ అభ్యర్థిత్వాన్నీ వ్యతిరేకించకపోవడం వెనుక ఆ కోణం ఉందని మాత్రమే అన్నాను.
      "ఆమె మతం మార్చుకుని, హిందువుగా మారి, వీలైతే బీజేపీ వారి భావజాలంతో సరిపడే ఒక పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నట్లైతే అప్పుడు ఆమె విషయంలో కూడా ఈ భారతీయత ప్రశ్న ఉదయించేది కాదు"
      ఈ వాక్యంలో ఏం చెప్పదలచుకున్నారో నాకు అర్థం కాలేదు. అర్హతలు సామర్థ్యాలపై ఆధారపడితే బాగుంటుందని ఒక చోట అన్నారు. ఇక్కడ ఆమె హిందువుగా మారి ఉంటే ఆమె భారతీయత ప్రశ్న ఉదయించేది కాదంటున్నారు. హిందువుగా మారితే లేని సామర్థ్యాలు వస్తాయని మీ ఉద్దేశమా? స్పష్టత లేదు.

      Delete
    3. అర్హతకీ, సామర్ధ్యానికీ, మతానికీ ఏమాత్రం సంబంధంలేదండి.

      సోనియా గాంధీ గురించైనా, రాహుల్ గాంధీ గురించైనా (ఆమాటకొస్తే ఎవరి గురించైనా) ప్రధాని పదవికి వారు అర్హులా అన్నచర్చ జరగాల్సివస్తే, అది వారి సామర్ధ్యాలను ఆధారంగాచేసుకొని జరగాలి. అలా చర్చించి, జనాలను convince చేయగల సామర్ధ్యం, ఓపికా విదేశీ వాదనలు చేసేవారికి లేవు. They are simply arguing the right thing through a wrong cause. To them this entire 'విదేశీయత' is mere short cut to evade such a discussion. They are against Sonia's candidature for the PM post on the religious grounds and this 'విదేశీయత' is a mere euphemism for that. మతం మార్చుకొనడం ద్వారా 'Other things' equal ఐనట్లైతేగనుక అమె సామర్ధ్యాలపై చర్చజరిగుండేది. అలా జరగలేదుకాబట్టే ఈ filterద్వారా ఆమెను seperate చేస్తున్నారు.

      Delete
    4. "They are simply arguing the right thing through a wrong cause. To them this entire 'విదేశీయత' is mere short cut to evade such a discussion. They are against Soniya's candidature for the PM post on the religious grounds and this 'విదేశీయత'is a mere euphemism for that".
      సామర్థ్యాల ఆధారంగా చర్చించి జనాన్ని ఒప్పించే సామర్థ్యం, ఓపికా'విదేశీయతా'వాదులకు లేక, ఆ చర్చను తప్పించుకోడానికి విదేశీయత అనే అడ్డదారిని ఆశ్రయించారని మీరు అంటున్నారు. అలాగే మత కారణాలపై ప్రధాని పదవికి సోనియా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారంటున్నారు. కానీ సామర్థ్యం గురించి విదేశీయతావాదులకు అంత పట్టింపు ఉందని నేను అనుకోను. కేవలం విదేశీయత కారణంగానే వ్యతిరేకించారని అనుకుంటున్నాను. సోనియా ప్రధాని పదవికి అభ్యర్థి కావడాన్ని వ్యతిరేకించడానికే ఆమె మతం మారకపోవడాన్నీ, ఆమె విదేశీయతను ముందుకు తెచ్చారన్న అభిప్రాయాన్ని కూడా మీ మాటలు ధ్వనింపజేస్తున్నాయి. వాస్తవం ఏమిటంటే, సోనియా రాజకీయాలలోకి రాకముందే, ఆమె ఒక గృహిణిగా ఇంటికే పరిమితమై ఉన్నప్పుడే ఆమెను వార్తలలోకి తెచ్చేవారు. 'ఇటాలియన్ కనెక్షన్' గురించి మాట్లాడేవారు. కనుక నా అభిప్రాయంలో మొదటి నుంచీ విదేశీవాదుల దృష్టిలో విదేశీయతే ఉంది తప్ప సామర్థ్యాల గురించిన ఆలోచన లేదు. అది ఏమాత్రం కల్తీ లేని వాదం.

      Delete
    5. ఇంకో విషయం. మత కారణాలపై సోనియా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారంటే, రాష్ట్రపతి, ఉప-రాష్ట్రపతి పదవులలో కూడా హైందవేతరులు ఉండడానికి వీలులేదు. పోనీ ప్రధాని పదవి మేరకే ఆ అభ్యంతరం అంటే, భవిష్యత్తులో ఎప్పుడూ ఒక హైందవేతరుడు ప్రధాని అయ్యే అవకాశం ఉండదని చెప్పడమే అవుతుంది. నా ఉద్దేశంలో విదేశీయతే సోనియాను వ్యతిరేకించడానికి అసలు సీసాలు కారణం.

      Delete
    6. సారీ. నా పై స్పందనలో చివరి వాక్యాన్ని ఇలా చదువుకోవాలి:
      'నా ఉద్దేశంలో విదేశీయతే సోనియాను వ్యతిరేకించడానికి అసలు సిసలు కారణం.'

      Delete
    7. 'ఇటాలియన్ కనెక్షన్'అన్నప్పుడు ఒక విషయం చెప్పాలనుకుని మరచిపోయాను. రాజీవ్ గాంధీ ప్రెస్ బిల్లు తెచ్చినప్పుడు పత్రికలు దానికి వ్యతిరేకంగా పోరాడిన సంగతి తెలిసే ఉంటుంది. ఆ సందర్భంలో, అప్పట్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ గా ఉన్న అరుణ్ సౌరీ హైదరాబాద్ వచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రసంగించారు. మధ్య మధ్య 'ఇటాలియన్ కనెక్షన్' అంటూ చలోక్తులు విసిరారు. అప్పటికి సోనియా గాంధీ ప్రజాజీవితంలో లేరు. సాధారణ గృహిణి మాత్రమే. ప్రజాజీవితంలో లేని ఒక గృహిణిపై ఆక్షేపణ చేయడం భారతీయసంస్కారమా అనిపించింది. భారతప్రధాని నట్టింట్లో ఒక విదేశీయురాలు ఉండడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారన్న వాస్తవాన్నే ఆయన మాటలు వెల్లడించాయి. ప్రధాని వంటి అత్యున్నత పదవికి అభ్యర్థి కాదలచుకున్నవారు విదేశీ వనితను పెళ్లి చేసుకోకూడదన్న డిమాండ్ ను అప్పుడే ఎందుకు తేలేదో ఆశ్చర్యం.

      Delete
  6. "అర్హతలు సామర్థ్యాలపై ఆధారపడుంటే బాగుంటుందేకానీ, ఇలా 'భారతీయతపాళ్ళు'పై కాదు".


    అంటే భయ్యా మన బ్రిటన్ రాజు గారు చాలా సమర్దు డట మరి సామర్థ్యం అనె మాట ని ఆధారం చెసుకుని బ్రిటన్ రాజు గారిని ప్రధానిని చెస్తె సరిపోదు అప్పుడు ఎంచక్కా చెక్క భజన చెసుకొవచ్చు మన పూర్వీకులు చేసిన పొరాటాన్ని క్యామెడీ గా చెప్పుకొవచ్చు,(సామర్థ్యం అంట సామర్థ్యం ఇదెమన్నా సంసారమా...మగాడే మొగుడు కావాలనడానికి కనీస అర్హత జన్మతహ భారతీయుడవ్వాలి కల్తీ పుట్టుకలు మాకొద్దు అనే.... రాజ్యాంగం లొ "పార్లమెంట్ లొ ఆంగ్లొ ఇండియన్ లు ఉండవచ్చు కాని వారు ప్రధాని పదవికి అర్హులు కారు" అని ఉంది! )
    సొ.....సామర్ధ్యం మాత్రమె కాదు అర్హత అనెప్పటికి జన్మతహ కూడా భార్తీయుడు కావాలి.అంతె.

    ReplyDelete