ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తూ ఉంటాయి. కానీ చట్టాలను ఉల్లంఘించేవారు ఎంత పటిష్టమైన చట్టాలనైనా ఉల్లంఘించే మార్గాలు వెతుకుతూనే ఉంటారు. ఒక్కోసారి ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తూనే ఉంటారు. చట్టాలను డ్రాఫ్ట్ చేసే వారే వాటిలో తప్పించుకునే మార్గాలు చొప్పిస్తూ ఉంటారన్న విమర్శ కూడా ఉంది. నిజం దేవుడికే ఎరుక.
ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు, ఫలానా పని చేస్తే ఆ సమస్య ఇట్టే పరిష్కారమై పోతుందని ఆ సమస్యకు సంబంధించిన నిపుణులు, లేదా నిపుణులు కానివారూ కూడా సలహా ఇస్తుంటారు. ఈ రోగానికి ఇదే మందు అని ఘంటాపథంగా చెబుతుంటారు. క్రమంగా ఆ పరిష్కారం ఒక నినాదం అయిపోతుంది. ఆ పరిష్కారాన్ని అమలులోకి తేవడమే జరిగిందనుకోండి. సమస్య మాయమైపోతుందా?! అవుతుందని చెప్పలేం. కొత్త రూపంలో అది ముందుకు రావచ్చు.
సీబీఐకి అటానమీ లేదా స్వేచ్ఛ ఇవ్వడం గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. కోల్ గేట్ వ్యవహారంతో ఆ చర్చ ఇప్పుడు కీలకమైన మలుపు తిరిగింది. సీబీఐకి స్వేచ్చ ఇచ్చే విషయమై ప్రభుత్వంతో మాట్లాడి అఫిడవిట్ దాఖలు చేయమని సుప్రీం కోర్టు అటార్నీ జనరల్ ను ఆదేశించింది. బహుశా ఇప్పుడిక ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. సీబీఐ కి ఏమేరకు స్వేచ్ఛ ఇవ్వాలన్న విషయంలో ప్రభుత్వం వివిధ రాజకీయపక్షాలతో మాట్లాడి ఏకాభిప్రాయానికి రావడానికి ప్రయత్నించచ్చు. ఆ ఏకాభిప్రాయం నూటికి నూరుపాళ్లూ స్వేచ్చ ఇవ్వడంపై మొగ్గు చూపుతుందో, చూపదో చెప్పలేం. సీబీఐ పూర్తిగా ప్రభుత్వంతో సంబంధంలేని సర్వస్వతంత్ర సంస్థ గా మారడానికి రాజకీయ పక్షాలు అన్నీ అంగీకరించకపోవచ్చు. ప్రభుత్వానికీ, ప్రతిపక్షాలకు మధ్య ఒకవిధమైన ప్రతిష్టంభన ఏర్పడిన ప్రస్తుత వాతావరణంలో ఈ ఏకాభిప్రాయ సాధన కూడా ఇప్పట్లో సాధ్యమవుతుందని చెప్పలేం. ప్రభుత్వమూ, రాజకీయపక్షాలూ సమస్యను సీరియెస్ గా తీసుకుని పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి ఆరంభించడమంటూ జరిగితే నేడు కాకపోతే రేపైనా అది ఒక ముగింపుకు వస్తుందన్న ఆశకు అవకాశముంటుంది.
సీబీఐ ప్రభుత్వం చెప్పుచేతల్లో పని చేస్తున్న కీలుబొమ్మ అనడంలో సందేహం లేదు. అశ్వినీ కుమార్ ఉందంతంలో ప్రభుత్వంతో సమానంగా సీబీఐ అల్లరిపాలైంది. దానికి స్వతంత్రంగా పనిచేసే స్వేచ్ఛ, అవకాశం ఉండి తీరవలసిందే. అయితే ఇక్కడ ఎదురయ్యే మరో ప్రశ్న ఏమిటంటే సీబీఐకి స్వేచ్చ ఇచ్చెస్తే అదింక ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ ఆహా అనిపించే పనితీరును ప్రదర్శిస్తుందా అన్నది.
స్వేచ్చా ప్రతిపత్తి ఉన్న సంస్థలు ఎటువంటి ప్రలోభాలకూ, ఒత్తిడులకూ లొంగకుండా; నిర్భయంగా, నిష్పాక్షికంగా, నిజాయితీగా పనిచేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తాయనుకుంటే, ఇప్పటికే ఉన్న అటానమస్ వ్యవస్థలు కూడా అలాగే పనిచేస్తూ ఉండాలి. మరి అలా పనిచేస్తున్నాయా అన్నది పరిశీలించవలసిన ఓ ప్రశ్న.
సీబీఐకి స్వేచ్చ కల్పిస్తే, అది ప్రభుత్వం అదుపాజ్ఞలలో పనిచేయవలసిన అవసరం తప్పుతుందనుకుందాం. సీబీఐ డైరెక్టర్ పదవీ కాలాన్ని రెండేళ్ల మేరకు స్థిరపరిస్తే, ఉద్యోగానంతర లాభాలు పొందకుండా నిషేధిస్తే ప్రభుత్వం నేరుగా ఆయనకు ప్రలోభాలు చూపే అవకాశం ఉండదనుకుందాం. అయితే, ఆయన బినామీలకో, సంతానానికో ఇతరేతర పద్ధతుల్లో ప్రలోభాలు చూపే అవకాశం ఉండదా? ఇంకో సినేరియో చూడండి. యూపీలో రాజూ భయ్యాపై హత్యారోపణ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సీబీఐ ఆ కేసును డైల్యూట్ చేయడానికి ఆయన ఆర్థిక ప్రలోభాలు ఎర వేస్తే? కనుక, అటానమీ ఉన్నంతమాత్రాన దేశానికి సీబీఐ వల్ల కొత్తగా ఏదో ఒరుగుతుందని చెప్పడానికీ లేదు. చివరికి, అంతా సీబీఐ డైరెక్టర్ వ్యక్తిగత నీతి నిజాయితీల మీద ఆధారపడి ఉంటుంది.
సీబీఐ ఇప్పటిలానే ప్రభుత్వం కింద పనిచేస్తోందనుకుందాం. అప్పుడు కూడా సీబీఐ డైరెక్టర్ వ్యక్తిగత నీతి నిజాయితీలది పై చేయి అయితే, అతడు తన విధులలో స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. అలా వ్యవహరించినందువల్ల పోయేవల్లా ఉద్యోగ సంబంధమైన కొన్ని ప్రయోజనాలు, ముఖ్యంగా ఉద్యోగానంతర పదవీ లాభాలు. అంతే తప్ప ఉద్యోగం పోదు. నిజానికి అలా ముక్కుసూటిగా పనిచేసిన అధికారులు కొందరి గురించైనా మనం వింటుంటాం.
అంటే, నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తి సీబీఐ డైరెక్టర్ గా ఉంటే అతడు ప్రభుత్వం కింద ఉన్నా స్వతంత్రంగా పనిచేయచ్చు. అవి లోపించినప్పుడు స్వతంత్ర వ్యవస్థలో పనిచేస్తున్నా ప్రలోభాలకు లొంగచ్చు. దీనినే తిరగేసి ఇలా కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి నీతి, నిజాయితీ, నిబద్ధత ఉనవాడైతే సీబీఐ తన అధికారపరిధిలో ఉన్నా దాని వ్యవహరణలో జోక్యం చేసుకోకపోవచ్చు. నీతి, నిజాయితీ, నిబద్ధత లేనప్పుడు సీబీఐ తన అధికార పరిధిలో లేకపోయినా లోపాయికారీగా ప్రలోభాలు ఎర వేసి తనకు అనుకూలంగా పనిచేయించుకోవచ్చు.
అంటే, చివరికి అంతా వచ్చి వ్యక్తిగత శీలం దగ్గరే వచ్చి ఆగుతోంది. అదీ అసలు సమస్య!

చివరి వాక్యం నూరు శాతం సత్యం!
ReplyDeleteHi Bhaskaram garu,
ReplyDeleteCAG (Comptroller and Auditing General) ane constitutional body kooda... chaala varaku swachanda system kadaa... i mean independent body e kadaa... mari adi mareee inta CBI anta corrupt kaadu anipistundi.. kadaa.... Issue emitante... ippudu CBI ni independent body cheste.... vaaru ippati kante koncham takkuva corrupt gaa vundachu... ani nenu anukuntunnanu.
Lekapothe simple gaa clean chits panchipette system gaa migilipotunnadi..
Regards,
MSK Kishore
ధన్యవాదాలు msk గారూ... సీఏజీకీ సీబీఐకీ తేడా ఉంది. సీఏజీ ఆయవ్యయాలకు సంబంధించిన పరిమిత అంశాన్నే డీల్ చేస్తుంది. సీబీఐ అలాకాదు. రాజకీయ పరిధిలోకి వస్తూ రాజకీయనాయకత్వం జవాబుదారీతో ముడిపడిన అనేక అంశాలను డీల్ చేస్తుంది. అటువంటి సీబీఐ స్వతంత్రప్రతిపత్తితో సీఏజీ స్వతంత్రప్రతిపత్తిని పోల్చలేము. రాజకీయస్వభావం కలిగిన సీబీఐకి పూర్తి స్వేచ్ఛను ఇస్తే ఏం జరగడానికి అవకాశముంది? అది ఒక సమాంతర రాజకీయవ్యవస్థగా పరిణమించే ప్రమాదముంది. ప్రజాస్వామ్య విధివిధానాలకు అది వ్యతిరేకం. కనుక సీబీఐ ఒక వ్యవస్థకు జవాబుదారీగా ఉండక తప్పదు. ఆ వ్యవస్థ లోక్ పాలో లేక న్యాయవ్యవస్థో అయినా పై ప్రమాదమే ఉంటుంది. రాజకీయస్వభావం కలిగిన కార్యనిర్వాహక అధికారాలను రాజకీయేతర వ్యవస్థలకు ఇచ్చినా అవి సమాంతర అధికారకేంద్రాలుగా పరిణమించే ప్రమాదముంది. ప్రభుత్వాలు కూడా సర్వస్వతంత్రాలు కావని మనకు తెలుసు. అవి లెజిస్లేచర్ కు జవాబుదారీ. కనుక అంతిమంగా సమస్య ఎక్కడికి వస్తోంది? ఆ యా వ్యవస్థలకు నాయకత్వం వహించే వ్యక్తుల నీతినిజాయితీలు, నిబద్ధతల దగ్గరకే వస్తోంది. నేను అన్నది అదే. సీబీఐ పనిలో జోక్యం చేసుకోరాదన్న వివేకం ప్రభుత్వనాయకత్వాలలో కలగడం ఒక్కటే పరిష్కారం. ఆమేరకు ప్రభుత్వాలపై అంకుశం ఉంచవలసిన బాధ్యత ప్రజలది. ఏ పరిష్కారమైనా కన్నే పోయాలా కాటుక పెట్టుకునే విధంగా ఉండకూడదు. ప్రభుత్వాలు సీబీఐనీ దుర్వినియోగం చేస్తుంటే దాన్ని సరిదిద్దే అవకాశం న్యాయవ్యవస్థకు ఎలాగూ ఉంది.
Delete