Thursday, April 10, 2014

మోడీ ప్రధాని అయితే బాధ్యత వహించవలసిన 120 కోట్లమందిలో యశోదా బెన్ ఒక్కరు తగ్గిపోయారు!

నరేంద్ర మోడీకి భార్య ఉందనీ, ఆమె పేరు యశోదా బెన్ అనీ రెండు నెలల క్రితమే వార్త వచ్చింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆమె ఇంటర్వ్యూ కూడా ప్రచురించింది. మోడీ తన నామినేషన్ పత్రంలో ఆమె పేరు పేర్కొనడం వల్ల ఇది మళ్ళీ వార్త అయింది.

ఇందులో ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు...

మోడీ ఇంతకాలం తనకు పెళ్లి అయిన సంగతిని ఎందుకు దాచినట్టు? అది ప్రపంచానికి తెలియవలసినంత ప్రధానమైన విషయం కాదు కనుక దాచి ఉంచారనుకుందాం. ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తికి పెళ్లయిందా లేదా అన్నది అప్రధానం అయినప్పుడు నామినేషన్ పత్రంలో marital status ను అడిగే కాలమ్ ను ఎందుకు చేర్చినట్టు? ఆ కాలమ్ ఉన్న తర్వాత కూడా గత ఎన్నికలలో మోడీ దానిని blank గా ఎందుకు ఉంచేసినట్టు? ఉంచారుపో, దానిని నింపమని సదరు అధికారి ఆయనను ఎందుకు అడగనట్టు? ఇప్పుడు మాత్రమే మోడీ భార్య ఉన్న సంగతిని ఎందుకు వెల్లడించినట్టు?

మన దేశంలో నిబంధనల తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. అదే మామూలు మనిషి అయితే, దానిని blank గా ఎందుకుంచావని అడుగుతారు. మన ఎన్నికల కమిషన్ ఇంత గొప్పదీ అంత గొప్పదీ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత ఎన్నికల ఘట్టంలోనే అదెంత దుర్బలమో తెలిసిపోతోంది. అభ్యర్థులను కట్టడి చేసే గొప్ప అధికారాలు అన్నీ ఈసీకి ఉన్నాయని అనడమే కానీ వాటిని వినియోగించిన సాక్ష్యం కనిపించడంలేదు, ఉత్తుత్తి నోటీసులు ఇవ్వడం తప్ప.

మోడీ పెళ్లి విషయానికి మళ్ళీ వెడదాం...

ఆయన అన్నదమ్ములు అది బాల్య వివాహం అంటున్నారు కానీ, అలా అని చెప్పలేం. అప్పటికి ఆయనకు 18 ఏళ్ళు, ఆమెకు 17 ఏళ్ళు ఉన్నాయి. అది పెళ్లి అంటే ఏమిటో తెలిసే వయసే.

వారిద్దరి మధ్యా ఎలాంటి కలతలూ లేవు. ఒకరికొకరు ఎందుకు దూరమైనట్టు? ఆయన దేశసేవకు ప్రాధాన్యం ఇచ్చి ఇంట్లోంచి వెళ్లిపోయారని ఒక సమాధానం. దేశసేవ కోసం పెళ్లి మానేస్తే అర్థముంది. కానీ తీరా పెళ్లి చేసుకున్న తర్వాత దేశ సేవకు భార్య అడ్డమని భావించడంలో న్యాయమేముంది? గాంధీ పెళ్లి చేసుకున్నాకే దేశసేవలోకి అడుగుపెట్టారు. భార్యను అడ్డమని భావించలేదు. పైగా ఆమెను కూడా దేశసేవలో పాల్గొనేలా ప్రోత్సహించారు. ఆవిధంగా ఆమె జీవితానికి చరితార్థతను కల్పించారు. మరి మోడీ యశోదాబెన్ కు అటువంటి అవకాశం ఎందుకు ఇవ్వలేదు? ఆమెను అనామకంగా ఎందుకు ఉంచేశారు?

భారతీయ సాంప్రదాయంలో అగ్నిసాక్షిగా జరిగే పెళ్ళికి ఉన్న ప్రతిపత్తి తెలిసినదే కదా! పెళ్లి రెండు జీవితాలకు ముడి. పెళ్లి భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు ఒక బాధ్యత. మోడీ ఆ బాధ్యతను ఎందుకు గుర్తించలేదు? ఇన్నేళ్లలోనూ భార్య ఉనికిని ఎందుకు పట్టించుకోలేదు? ఆమె గురించిన సమాచారం కూడా ఆయన వద్ద లేకపోవడమేమిటి? పోనీ తను దేశసేవలో ఉండడం అందుకు కారణం అనుకున్నా, తమ ఇంట్లో ఆమెకు కోడలి స్థానం కదా. ఆమె తన ఇంట్లో సభ్యురాలు కదా. తమ మధ్య భార్యాభర్తల సంబంధం లేకపోయినా వారు విడాకులైతే పుచ్చుకోలేదు. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.  వారి మధ్య గొడవలూ లేవు. అలాంటప్పుడు అత్తమామలకు కోడలిగా,  అన్నకు మరదలిగా, తమ్ముళ్ళకు వదినెగా ఆమె స్థానం ఆమెదే కదా. ఆ సంబంధం కూడా ఎందుకు లేకుండా పోయింది?

మొత్తానికి నరేంద్ర మోడీ తన భార్య పట్ల ఎలాంటి బాధ్యతా తీసుకోలేదు. తను దేశసేవ పేరుతో ఆమెను వదలి వెళ్ళేటప్పుడు తానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు కానీ, ఆమె అభిప్రాయం తెలుసుకోలేదని వార్త సూచిస్తోంది. ఆమెను చదువుకోమని చెప్పారు కానీ, ఆ తర్వాత ఆమె ఏం చదువుతోందో, ఏం చేస్తోందో కనుక్కోలేదు. ఆమెకు కూడా ఒక స్త్రీగా భర్తతో కాపురం చేయాలనీ, పిల్లల్ని కనాలనే కోర్కె ఉంటుందన్న సంగతిని ఆలోచించలేదు. విడాకులైనా ఇచ్చి ఆమెను పునర్వివాహానికి ప్రోత్సహించలేదు. అసలు ఆమె అంతరంగం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆమెను అలా విడిచిపెట్టేశారు, అంతే!

నరేంద్ర మోడీ రేపు ప్రధాని అయితే దేశంలోని 120 కోట్ల మందికీ న్యాయం చేయగల సమర్థులే అనుకున్నా, ఆయన ప్రధాని కాకముందే అన్ని కోట్లమందిలో యశోదా బెన్ అనే ఒక్కరు తగ్గిపోయారని మీకు అనిపించడం లేదా?! ఇక్కడే నేను ఒక విషయం చెప్పదలచుకున్నాను. ప్రపంచంలో ఎన్ని కోట్లమంది ఉన్నా ఒక్క జీవితం విలువ, మిగిలిన కోట్ల జీవితాల విలువతో సమానం. ఎలాగంటే ఒక తల్లికి పదిమంది పిల్లలు ఉంటే, ఒక్క కొడుకు లేదా కూతురు జీవితం విలువ పదిమంది విలువతో సమానం. తొమ్మిదిమంది జీవితానికి ఉమ్మడిగా ఎక్కువ విలువ ఇచ్చి ఒక్కరి జీవితానికి తక్కువ విలువ నివ్వదు. అలాగే ప్రకృతి అనే తల్లి కూడా తనకు ఎన్ని కోట్ల మంది సంతానం ఉన్నా వారందరికీ విడివిడిగానూ, కలిపీ ఒకే విలువ ఇస్తుంది.

ఈవిధంగా భార్యపట్ల మోడీ బాధ్యత చూపకపోవడం కూడా 120 కోట్లమందిపట్ల బాధ్యత చూపకపోవడంతో సమానమే కాదా?!

15 comments:

  1. Why do you think only Modi is wrong? Why can't his wife be wrong? She should have fought for justice if Modi did something wrong

    ReplyDelete
  2. నేను మోడీది తప్పని అనలేదు. కొన్ని ప్రశ్నలు, పోనీ అనుమానాలు మాత్రమే ముందుకు తెచ్చాను. ఎవరిది తప్పో ఒప్పో మనకు తెలియదు. మనకు తెలిసినవి పత్రికల్లో వచ్చినంతే. మీరన్నట్టు ఆమెదే తప్పు కావచ్చు. కానీ 17-18 ఏళ్ల వయసులో ఎంత పెద్ద తప్పు చేసి ఉంటుంది? అది జీవితాంతం కలసి ఉండలేనంత తప్పా? మోడీ ఆమెకు మరీ అంత పెద్ద శిక్ష వేస్తారా? ఆమె తప్పే చేస్తే అటూ ఇటూ పెద్దవాళ్ళు ఏం చేశారు? ఇవన్నీ కూడా ప్రశ్నలే. మన భారతీయ సామాజిక వ్యవస్థ రీత్యా, ఒక వేళ ఆమెదే తప్పు అయినా భర్తగా మోడీకి భార్యపట్ల బాధ్యత ఉండదంటారా? పిల్లలపట్ల పెద్దవాళ్ళకు ఉన్నట్లు.

    ReplyDelete
  3. ఇది అనవసరమైన చర్చ. వ్యక్తిగత విషయాల ఆధారంగా ఎవరెలాంటివారో తేల్చేసేది ఛాందసులేకానీ తార్కికులు కాదు. మోదీ దాచిన నిజాన్ని చర్చించడంతోనే ఆపాల్సిన విషయం ఎవరిది తప్పు అని gudge చేసే వరకూ వెళ్ళింది. ఎవరిది తప్పో తీర్పివ్వడానికి మనమెవరం? మనకా అవసరమేంటి? వాది, ప్రతివాది ఎవ్వరూలేకపోయినా తీర్పులెందుకు?

    తొంభైతొమ్మిదుల్లో అనుకుంటాను ఒక సైనికుడు కనబడకుండా పోతే, అతను చనిపోయాడేమోననుకొని ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం అతని భార్య 'గుడియా' వందరోజులు ఎదురుచూసి, వేరొకపెళ్ళిచేసుకొని, ఒకబాబునుకూడా కన్నది. తీరా ఆ సైనికుడు పాక్బందిగా మాత్రమే పట్టుబడి తరువాత దేశనికి తిరిగొచ్చాడు. ఇప్పుడా భార్య సంతేమిటన్న ప్రశ్నొకటివస్తే. వాళ్ళూవాళ్ళూ కుంటుంబం స్థాయిలో తేల్చుకోవలసిన విషయాన్ని 'యె కిస్కీ గుడియా హై' అంటు ఒక జాతీయ ఛానల్ వాళ్ళు చర్చిగోష్టినిర్వహించి తీర్పుకూడా చెప్పేశారు. ఇదే అత్యుత్సాహం నాకు ఈవిషయంలోనూ కనబడుతుంది.

    ReplyDelete
    Replies
    1. గుడియాను, మోడీని పోల్చగలమంటారా? మోడీ ప్రధాని పదవికి అభ్యర్థి.
      marital status వ్యక్తిగతం అయినప్పుడు నామినేషన్ పత్రంలో దానిని ఎందుకు పేర్కొనమన్నట్టు? రాజకీయనాయకుల పెళ్లి వ్యక్తిగత విషయం అయినప్పుడు, వాళ్ళ ఆస్తులు, చదువుల వివరాలు వ్యక్తిగతం కావా? ఏమిటి దీని వెనుక తర్కం?

      Delete
  4. ఆయన స్పష్టంగ చెప్పారు సమాజ సెవకోసం వైవహిక జీవితం వదిలెసాను అని.
    ఆమె ఖు కూడ ఎటువంటి షికాయత్ లేదు అయినా వె రోజు అంతా హంగమ చేస్తున్నరు కానీ జషొదా భెన్ గారి మొదటి ఇంటర్వ్యూ చాల యేళ్ళ కింద ఆంగ్ల పత్రికలో వచింది.
    జషొద గారి అన్న చెప్పినట్లు పెళ్ళప్పుడు ఇద్దరి వయసు 17...
    అయినా 17 సం.6 నెలలు ఉన్న బాలుడు ధారుణంగా రేప్ చేస్థె జువనైల్ అనొచ్చు అర్దే ఒక అపిఒసిషన్ లీడర్ 17 యేల్లప్పుడు పెల్లి చెస్కుని విరమించుకుంటే అంతా తెలుసా....
    సెక్యులరిజం కి మచ్చుతునజెమో ంఅరి!
    స్కాములు చేసింది కాంగిరేసు....భ్రష్ట్ పట్టంచింది యౌ.పి.ఏ గ్రూపు ఇప్పుడు అంతా కలిసి ప్రశ్నించేది మోడీ ని....విమర్శించేది మోడీని....ఇలాంటి ప్రశ్నలు సోనియా గ్రూపు ని అడగగలరా...
    అయినా రామ క్రిష్న పరమహన్స....అరబిందో వీరు భాద్యతలు వదిలెసి శిష్య బృందాలని ఉద్ధరించారా..
    అసలు మీరు సొనియా ఘంధి గారిని రెండొ పెల్లి ఎందుకు చేస్కోలేదని అడగ గలరా ....తను యూరపు లొ ఉందొ ఉంటే వితంతు వివహం చేస్కొనేది కాదా....
    ఒకరు తగ్గారట ఒకరు ......మీ కాంగిరేసు కుటుంబం సన్యసినులను కూడా వదలకుండా చేసిన ఉద్ధరింపు చాలు మహా ప్రభో .
    http://m.outlookindia.com/article.aspx/?223036&maneref=http%3A%2F%2Fm.facebook.com%2Fl.php%3Fu%3Dhttp%253A%252F%252Fwww.outlookindia.com%252Farticle.aspx%253F223036%26h%3DKAQGeybFP%26s%3D1%26enc%3DAZMxTEZ_iIQ4_5m79C_rnFqI7F04606IPB7ygaybWKAx7S9EBQ1qzN4sRR-q71M53H0mzpeio2QC2h5cVaOq2ncIcxbE3zX_zgb_R6ofc2Owsw

    ReplyDelete
    Replies
    1. సోనియా గాంధీ, యశోదా బెన్ లకు పోలిక కుదరదండీ. సోనియా గాంధీ భర్తతో కాపురం చేశారు. పిల్లల్ని కన్నారు. వైవాహిక జీవితాన్ని పూర్తిగా అనుభవించారు. యశోదా బెన్ కు ఇవేవీ వర్తించవు.

      Delete
    2. "వైవాహిక జీవితాన్ని పూర్తిగా అనుభవించారు!! "

      ఎలా చెప్పగలరు!! ఏ standards ప్రకారం? 46 ఏళ్లకు మొగుడు పోతే ఇంకే పెళ్ళి చేసుకోకపోతే అది పూర్తిగా అనుభవించినట్లా? ఆమె పుట్టింది, పెరిగింది Itaalian గా, ఆ standard ప్రకారం అది పూర్తిగా అనుభవించినట్లా?

      పిల్లలు కలిగితేనో, లేక ఇంకేదో చేసుకొంటెనే పూర్తిగా అనుభవించినట్లా? అశొదా బెన్ కావాలనే పూర్తిగా జీవితాన్ని అనుభవించటానికే ఆమె అనుకొన్నట్లుగా ఆనందం గా అలానే ఉందేమో అన్న అనుమానం మీకెందుకు రాదు?

      మోడీ ఆమెను పట్టించుకోలేదు అన్నారు, ఒకళ్ళను ఒకళ్ళు పట్టించుకోవద్దు అని వారిద్దరు అనుకొనే పట్టించుకోలేదేమో అన్న అనుమానం ఎందుకు రాదు మీకు?

      ఈకలు పీకటం చాలా వీజి సారూ, ఈ ఈకలు ఏదో, దేశానికి పట్టిన శనిగ్రహాల fake గాంధి కుటుంబం మీద పీకండి సారు!!

      Delete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. The Congress vice president should have taken his cue from senior party leader Shankarsinh Vaghela who denounced the proclivity to interfere in the personal lives of others and emphasised that as an old colleague of Narendra Modi, he had personal knowledge that the latter’s personal life was clean as a whistle.


    http://www.niticentral.com/2014/04/11/narendra-modis-non-secret-vs-rahul-gandhis-mysteries-210512.html

    ReplyDelete
    Replies
    1. మోడి వ్యక్తిగత జీవిత స్వచ్ఛత ఇక్కడ చర్చనీయం కానే కాదండీ. యశోదాబెన్ పట్ల మోడీ వ్యవహరణలో ఆయన వ్యక్తిగత స్వచ్చతను ప్రశ్నించవలసింది ఏమీ లేదు. ప్రశ్న ఆయన భార్య పట్ల బాధ్యత వహించారా లేదా అని మాత్రమే.

      Delete
    2. ఓ పదిహేడేళ్ళ కుర్రోడు, దాదాపు 50 ఏళ్ల క్రితం, తాను పెళ్ళిచేసుకొన్న ఇంకో పదిహేడేళ్ల అమ్మాయిని రెండు వారాలలో (ఆమెకి చెప్పో లేదో!!) తాను నమ్మిన సిద్దాంతాలకోసం వదిలి ఆ సిద్దాంతాలకోశం కట్టుబడి, అప్పటినుండి (ఒకటికి రెండు, మూడు సంబంధాలు పెట్టుకోనే రాజకీయనాయకుల ఉన్న తరం లో) బ్రహ్మచారిగా ఉంటే, దాని మీద కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్న తమరు,

      పెళ్ళి పెటాకులు లేకుండా ఎంతమందితో తిరిగాడో లెక్కలేని యువరాజు గారి మీదో, లేక ఒకటి రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకొంటున్న ఉన్న పెళ్లాలను వదలకుండానే ఉన్న నాయకుల మీద ఎన్ని ఈకలు పీకాలి?

      ఆ విషయము లో ఓ పౌరుడిగా బాధ్యత వహించారో లేదో, గురువింద గింజ సామెతలాగా మిమ్ములను మీరు ప్రశ్నించుకొని చూసుకోండి!!

      Delete
  7. కాంగ్రెస్ పార్టిని భుజాన కెత్తుకొనే వారికి పార్టిలో లోపాలు కనపడవు. మీకు మహిళల మీద అంత సానుభూతి ఊంటే ఈ పాటికి సునందా పుష్కర్ గురించి ఆవేదన చెంది ఉండే వారు. శశి తరూర్ కి సీట్ ఎలా ఇచ్చే వారని ప్రశ్నించి ఉండేవారు? ఆయన స్థానంలో ఎవరైనా మధ్య తరగతి వాడు ఉండి ఉంటె అనుమానస్పద స్థితిలో భార్య చనిపోయిందన్న కారణంగా జైలు ఊచలు లెక్కపేడుతూండేవాడు. మోడి మీద ఎంత అసహనం, కోపం ఉంటే సందు చిక్కింది గదా అని, ముందు వెనుక అలోచించకుండా ఇలారాస్తారు? రాసే ముందు ఒక్కసారి సునందా పుష్కర్ జరిగిన అన్యాయం గుర్తుకు రాలేదా? ప్రతి మేధావి మోడిని లెక్కలేనన్ని కోణాలలో విశ్లేషించే వాడే. మోది చేసిన పాపం ఎమిటి? దేశానికి సేవ చేయాలనుకోవటమా?

    ReplyDelete
    Replies
    1. శశిథరూర్ ను, మోడీనీ ఏవిధంగానూ పోల్చలేం. అలాగే శశిథరూర్-సునందా పుష్కర్; మోడీ-యశోదాబెన్ కేసులను కూడా. శశి థరూర్ కేసు కొంతవరకు క్రిమినల్ స్వభావం కలిగినది. మోడీ కేసు నైతికత, లేదా ధార్మికతకు సంబందించినది.

      Delete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. "ఆయన బాధ్యత వహించారనే అంటాను. భార్యను చదువుకోవటానికి ప్రోత్సహించి, ఆమే కాళ్ల మీద ఆమే నిలబడేటందుకు సహకరించాడని అర్థమైంది. భార్య వచ్చి అత్తామాma సేవలు చేసుకొంట్టూ తన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తుందనే అనుమానంతో ఆయన తన తల్లిదండృల ఇంటికి రావలసిన అవసరంలేదని చెప్పినట్లు తెలుస్తున్నాది."
      మీరు చెప్పినదాన్ని బట్టి మోడీ భార్యపట్ల కొంతవరకు బాధ్యతగానే వ్యవహరించినట్టు భావించవలసిందే. కానీ నేను చదివిన యశోదా బెన్ ఇంటర్వ్యూను బట్టి, మోడీ అన్నగారు చెప్పినదాన్ని బట్టి మోడీ భార్యను చదువుకోమని మాత్రమే చెప్పారనీ, ఆ తర్వాత వారి మధ్య సంబంధాలు, రాకపోకలు లేవనీ అర్థమైంది. ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడడానికి మోడీ సహకరించిన సంగతి నేను చదివిన వాటిలో లేదు. అందుకు సంబంధించిన లింక్ ఇవ్వగలరు.
      నేను విన్నంతవరకు భార్య అనుమతి, పెళ్లి కాకపోతే తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఎవరూ సన్యసించడానికి వీలులేదు. అది భారతీయ సన్యాసి సంప్రదాయం. శంకరాచార్యులు కూడా తల్లి ఆర్యాంబ అనుమతి తీసుకునే సన్యసించారు. భార్య పట్ల భర్తకు, తల్లిదండ్రుల పట్ల కొడుక్కి ఉండే బాధ్యత దృష్ట్యానే ఆ నిబంధన అన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఎవరైనా దానిని ఉల్లంఘిస్తే నిబంధనలకు విరుద్ధమే.
      మోడీ, దేశ సేవ మొదలైనవి కాసేపు పక్కన ఉంచుదాం. ఒక సాధారణ భార్యాభర్తలుగా చూస్తే, భార్య పట్ల భర్త బాధ్యతగా వ్యవహరించడమంటే, ఎలాంటి పరిస్థితులలోనూ ఆమెతో సాహచర్యం చేయడం; లేదా ఆమెకు విడాకులు ఇచ్చి తన నీడలోంచి ఆమెను పూర్తిగా తప్పించడం. మోడీ ఈ రెండూ చేయలేదు. మన దగ్గరి బంధువులలో ఏ మహిళ అయినా యశోదా బెన్ పరిస్థితిలో ఉంటే మనం ఎలా తీసుకుంటామో కూడా కాసేపు ఆలోచిద్దాం. మోడీ దేశసేవకు అంకితమైన ప్రత్యేక వ్యక్తి అనచ్చు. కానీ భార్యను విడిచిపెట్టే సమయానికి ఆయన కూడా మనలాంటి సాధారణ వ్యక్తే. కనుక మామూలు మనుషులకు వర్తించేదే ఆయనకు వర్తిస్తుంది.
      "ఈ కాలంలో ప్రజలు ఆయన నుంచి ఆశించేది మంచి పాలన. ధార్మికత కాదు" మంచి పాలనలో ధార్మికత ఉండదా? ఇది నాకు అర్థం కాలేదు.
      వినోద్ మెహతా జీవితంలోకి తొంగి చూడాల్సిన అవసరం నాకైతే కనిపించడం లేదు. వినోద్ మెహతా మోడీ కాదు.

      Delete