ఇలా
‘స్వామ్యా’లు తలకిందులవడంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ‘షాకింగ్’ గా కూడా ఉండచ్చు. నీకు మానభంగం జరగచ్చు
కనుక, పెళ్లి కానుకల రూపంలో ‘నీ మొహమంత
వెడల్పున బంగారం’తో సహా అందుకు పరిహారాన్ని ముందే చెల్లించి, నీ మానాన్ని నేను కొనేసుకున్నానని మీవే మొగుడితో అంటుంది. బ్రిటిష్
దీవులకు చెందిన కెల్టులలో ఒక ఆచారం ఉండేదట. రోజూ రాత్రివేళ భార్య ‘మానాన్ని హరిస్తారు’ కనుక అందుకు పరిహారంగా ‘ప్రభాత కానుక’ (morning gift) ఇచ్చేవారట. ఇటువంటి కానుకే ఇక్కడ మీవే మొగుడికి ఇచ్చిందన్న మాట. ‘స్వామ్యా’లు ఎలా తలకిందులయ్యాయో చూడండి. కెల్టిక్
తెగలు పాటించిన ఆచారమూలాలు వాస్తవంగా మీవేకు చెందిన మాతృస్వామ్యంలోనే ఉండి ఉండచ్చు
కూడా.
No comments:
Post a Comment