గిరికకు ఉద్దేశించిన వసురాజు వీర్యాన్ని యమునానదిలో
చేపరూపంలో ఉన్న ఒక అప్సరస తాగింది. గర్భం ధరించి మత్స్యరాజును, మత్స్యగంధిని ప్రసవించింది! ఇప్పటి భాషలో చెప్పుకుంటే, అప్సరస తన గర్భాన్ని వసురాజుకు
అద్దెకిచ్చి Surrogate Mother పాత్రను
నిర్వహించిందన్నమాట. ఈవిధంగా వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశాన్ని గిరిక
కోల్పోయింది.
ఇక్కడే
తమాషా ఉంది. కథకుడు అసలు రహస్యాన్ని తన పిడికిట్లో ఉంచుకుని దానిని మూయడానికి ఎంత
ప్రయత్నించినా అతని వేళ్ళ సందుల్లోంచి అది జారిపోతూనే ఉంది. వసురాజు పిల్లలకు
తల్లి అయ్యే అవకాశం నిజంగా గిరిక కోల్పోయిందా? లేదు...ఆమే వసురాజు పిల్లల్ని కన్నది. కావాలంటే, గిరిక అనే పేరునూ, అప్సరసకు గల అద్రిక అనే పేరునూ
పక్క పక్కన పెట్టి చూడండి...రహస్యం తెలిసిపోవడం లేదా?!
No comments:
Post a Comment