ఈ ‘గుర్తింపు’ల విషయంలో
చాలా గందరగోళమే ఉన్నట్టుంది. నిజంగా కూడా
కురుని పరంపరకు చెందినవారుగా పాండవులు కూడా కౌరవులే కావాలి. కానీ కౌరవుల నుంచి
వారిని విడదీసి పాండవులుగానే ఎందుకు చెబుతున్నట్టు? దుర్యోధనుడికీ, అతని తమ్ముళ్ళకీ కౌరవులనే గుర్తింపుకు తోడు ధృతరాష్ట్రుని సంతానంగా ధార్తరాష్ట్రులు
అనే గుర్తింపు కూడా ఉంది. అలాగే, పాండురాజు
కొడుకులుగా ధర్మరాజు, అతని సోదరులకు పాండవులు అనే
గుర్తింపు ఉంది. ఈ విషయంలో ఇరువురికీ సామ్యం కుదిరింది కనుక పేచీలేదు. మహాభారతంలో
ఆ ఉభయులనూ ఇలా తండ్రివైపునుంచి చెప్పడం చాలా చోట్లే కనిపిస్తుంది కూడా. అయితే, తేడా ఎక్కడుందంటే, తల్లి వైపునుంచి చెప్పడంలో. ధర్మరాజును, అతని సోదరులను
తల్లి వైపునుంచి కౌంతేయులు గా చెప్పడం మహాభారతంలో చాలా చోట్ల
కనిపిస్తుండగా; దుర్యోధనాదులను తల్లి వైపు నుంచి, గాంధారేయులుగా నొక్కి చెప్పడం, నేను
గమనించినంతవరకు అంతగా కనిపించదు. ఇక, పాండవులకు కౌరవులన్న
గుర్తింపు లేని సంగతి స్పష్టమే.
chivari kouravudu "Bheeshmudu"maatrame!!!
ReplyDelete