కొన్నేళ్ళ
క్రితం ఖుష్బూ అనే సినీనటి చేసిన ఒక వ్యాఖ్య చాలామందికి గుర్తుండే ఉంటుంది...
‘ఈ రోజుల్లో వివాహానికి ముందు ఆడపిల్లలకు లైంగిక సంబంధముండడం ఏమంత పెద్ద
విషయం కాద’ని దాని సారాంశం. దానిపై జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు
వ్యక్తమయ్యాయి. నిరసన ప్రదర్శనలు జరిగాయి. టీవీ చానెళ్లలో చర్చలు జరిగాయి. నిజమే… ఆ వ్యాఖ్యను ‘దైవ దూషణ’ను
మించిన అపచారంగా భావించడం సహజమే!
వేరే
దేశాల అనుభవం ఎలా ఉన్నా, మన దేశంలో ఇప్పటికీ వివాహానికి ముందు ఆడపిల్లల లైంగిక సంబంధం, ఊహించడానికే దారుణమైన విషయం. దానిని ఏ రకంగా సమర్థించినా అది మనోభావాలను
గాయపరుస్తుంది. కారణం, వివాహం అనే చెలియలికట్ట మన మనస్సులలో ఒక బలమైన సెంటిమెంట్ గా, అచంచలమైన విశ్వాసంగా పాతుకు పోవడమే. లైంగిక సంబంధం విషయంలో ‘వివాహానికి
ముందు, తర్వాత’ అనేది ఏవిధంగానూ
చెరపడానికి వీల్లేని శిలారేఖ.
No comments:
Post a Comment