యజ్ఞం, దానం, అధ్యయనం, దస్యుహింస, జనరంజకపాలన,
యుద్ధంలో శౌర్యం రాజధర్మాలు. వీటన్నిటిలోనూ యుద్ధం మరింత ఉత్తమధర్మం
(శ్రీమదాంధ్రమహాభారతం, శాంతిపర్వం,
ద్వితీయాశ్వాసం)
ధర్మరాజుకు రాజనీతిని బోధిస్తూ భీష్ముడు ఏమంటున్నాడో
చూడండి... యజ్ఞం, దానం, జనరంజకపాలన, యుద్ధంలానే ‘దస్యు హింస’ కూడా
రాజు(లేదా యజమాని) నిర్వర్తించవలసిన ధర్మాలలో ఒకటి అంటున్నాడు. దస్యులు-దాసులు అనే
రెండు మాటలకు ఏదో సంబంధం ఉన్నట్టు కనిపిస్తుందని రాంభట్ల(జనకథ) అంటారు. దస్యులు
ఆలమందలను, వాటిని కాచుకునే మనుషులను అపహరించేవారనీ; మందలను, మనుషులనూ కూడా వ్యవసాయదారులకు అమ్మేసేవారనీ, అలా కొనుక్కున్న మనుషులను దాసులు అనేవారనీ ఆయన వివరణ. వ్యవసాయం పనులకు
మంద-మంది ఎప్పుడూ అవసరమే. ఆవిధంగా
వ్యవసాయం పనులకు సహకరించే పశువుకూ, మనిషికీ పోలిక కుదిరింది.
అందుకే పని చేసిన తర్వాత వారికి ‘కూలి’ రూపంలో ఇచ్చే తిండికీ పోలిక కుదిరింది. దాని పేరు: గ్రాసం. గ్రాసం
అంటే గడ్డి, లేదా తృణసంబంధమైన ఆహారం. విశేషమేమిటంటే, ‘గ్రాసం’ అనే మాట
నిన్నమొన్నటి వరకు ‘జీతం’ అనే అర్థంలో వాడుకలో
ఉంది.
(పూర్తివ్యాసంhttp://magazine.saarangabooks.com/2014/01/16/%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%9A%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A5 చదవండి. మీ స్పందనను అందులోనే పోస్ట్ చేయండి)
No comments:
Post a Comment