Thursday, January 23, 2014

రామాయణ, భారతాలలో ఏది ముందు?

 మహాభారత, రామాయణాల కాలం ఎప్పుడు?  వీటి గురించి వేర్వేరు లెక్కల మీదే కాక, విశ్వాసం మీద కూడా ఆధారపడిన కాలనిర్ణయాలు చాలా కనిపిస్తాయి. శ్రీ రామ్ సాఠె అనే పండితుడు రామాయణ కాలం గురించి రాస్తూ, ప్రస్తుతం నడుస్తున్నది వైవస్వత మన్వంతరం కాగా, ఇంతకుముందు అనేక మన్వంతరాలు గడిచాయనీ; ప్రతిమన్వంతరంలోనూ నాలుగు యుగాలు వస్తుంటాయనీ, రామాయణం జరిగింది వేరొక మన్వంతరంలోని త్రేతాయుగంలోననీ అంటూ రామాయణ కథను లక్షల సంవత్సరాల వెనక్కి జరిపిన సంగతి ఎప్పుడో చదివిన గుర్తు.

మహాభారతకాలం మీద కూడా రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. మరీ మన్వంతరాలలోకి వెళ్లకుండా మన సాధారణ బుద్ధికి అందేమేరకు చూస్తే, కోశాంబీ అనుసరించిన కాలనిర్ణయం ప్రకారం, మహాభారతం జరిగి ఉంటే అది క్రీ.పూ. 1000లో జరిగింది. అలాగే, భాతం ముందా, రామాయణం ముందా అనే ప్రశ్న కూడా వస్తుంది.  రాముడు కోసలకు చెందిన కౌసల్య కొడుకు కనుక; వాయవ్య, పశ్చిమాలనుంచి తూర్పు దిశగా, హస్తినాపురం మీదుగా వలసలు జరిగాయనుకుంటే, కోసల తూర్పున చాలా చివర ఉంది కనుక మహాభారతం తర్వాతే రామాయణం అనిపిస్తుంది.


ఇంకో కోణం నుంచి చూసినా మహాభారతం తర్వాతే రామాయణం అనే అభిప్రాయం కలుగుతుంది. అది; చంద్ర, సూర్యవంశ రాజులకు సంబంధించిన కోణం. మహాభారత రాజులు చాలావరకూ చంద్రవంశీయులు. రాముడు సూర్యవంశీకుడైన ఇక్ష్వాకు రాజు.  జోసెఫ్ క్యాంప్ బెల్  రాసిన Occidental Mythology లో ఈ చంద్ర, సూర్యవంశాలకు సంబంధించి ఆసక్తికరమైన వివరణ ఉంది. అది ప్రత్యేకంగా, చాలా వివరంగా చెప్పుకోవలసిన అంశం కనుక వాయిదా వేయక తప్పదు.

(పూర్తివ్యాసంhttp://magazine.saarangabooks.com/2014/01/23/%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%82-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%97%E0%B0%A7%E0%B0%95%E0%B1%81/లో చదవండి. మీ స్పందన అందులో పోస్ట్ చేయండి)

5 comments:

  1. please read shodasi ramayana rahasyalu by gunturu seshendra sarma. he proved that ramayan is much more older than mahabharat from many evidences

    ReplyDelete

  2. ఈ అంశం మీద చాలా వ్రాయవచ్చును.కాని ఒకటే వ్రాస్తున్నాను.మీరు భాగవతం,విష్ణుపురాణం ,చదవండి.అందులో మనువు నుంచి శ్రీరామునికి 30 తరాలు గడవగా.పాండవుల నాటికి 50 తరాలు గడిచాయి .చరిత్రకారులు తరం అంటే సగటున 30 సంవత్సరాలుగా లెక్కిస్తారు.అదీగాక రాముని వంశంలో ఆఖరి రాజు మహాభారత యుద్ధంలో మరణించినట్లు కూడా రాయబడింది. వీటిని బట్టి మీరే ఆలోచించండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కమనీయం గారు...

      Delete
    2. కమనీయం గారూ...ఇంకోమాట. మీరు చెప్పినవి నేను ఆలోచిస్తాను. దయచేసి నేను చెప్పినవాటి గురించి కూడా మీరు ఆలోచిస్తారా?

      Delete