ఓ రోజున టీవీలో అలెగ్జాండర్ సినిమా వస్తోంది. ఆ సినిమా చూస్తుంటే, అలెగ్జాండర్-పురురాజుల యుద్ధం గురించి ప్లూటార్క్ ను ఉటంకిస్తూ కొశాంబీ రాసిన వివరాలు గుర్తొచ్చాయి. వాటిని సినిమాలో వాడుకుని ఉంటారనిపించి ఆసక్తిగా చూశాను. అయితే, నిరాశే మిగిలింది. ఆ యుద్ధాన్ని ఒకటి రెండు దృశ్యాలతోనే తేల్చేశారు. గడ్డంతో ఉన్న పురురాజు ఏనుగు మీద యుద్ధానికి వస్తున్నట్టు మాత్రం చూపించారు.
మిగతావాళ్ళ సంగతి ఎలా ఉన్నా మనకు మాత్రం చరిత్ర కిటికీ తెరచుకున్నది అలెగ్జాండర్ తోనే. అలెగ్జాండర్ ప్రధానంగా కాకపోయినా ఆ పాత్రతో కొన్ని చారిత్రక సినిమాలు మనవాళ్లు తీశారు. అవి చరిత్రకు ఎంత దగ్గరగా ఉన్నాయనేది వేరే విషయం. అలాగే, బుద్ధుడి కథతో తీసిన కొన్నింటిని వదిలేస్తే, నేను గమనించినంతవరకు మన చారిత్రక సినిమా మగధను, చాణక్యుని, చంద్రగుప్తుని, అశోకుని దాటి ఎప్పుడూ వెనక్కి వెళ్లలేదు. ఒకవేళ నా అభిప్రాయం తప్పని విజ్ఞులెవరైనా సోదాహరణంగా చెబితే సవరించుకోడానికి సిద్ధమే. కనీసం, మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించడానికి పూర్వరంగంలో ఏం జరిగిందో చెప్పే సినిమాలు మాత్రం రాలేదు. మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించడానికి ముందు కోసల అనే రాజ్యంతో పోటీ పడిన సంగతిని చెప్పే సినిమా రాలేదు.
నాకు సినిమా పరిజ్ఞానం తక్కువ. అయినాసరే, మగధ ఒక మహాసామ్రాజ్యం కావడానికి పూర్వరంగంలో సినిమాకు పనికొచ్చే కథ ఒకటి ఉందని నాకు అనిపించింది. పైగా నా సొమ్మేం పోయింది, అది హాలీవుడ్ స్థాయిలో భారీవ్యయంతో తీయదగిన సినిమా అని కూడా అనిపించింది. ఒక సినిమా విజయవంతం కావాలంటే కథకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో, అందులో ఎలాంటి దినుసులు ఉండాలో నాకు తెలియవన్న సంగతిని ఒప్పుకుంటూనే ఆ కథను ఒక సినిమా కథగా మలచే ప్రయత్నం చేశాను.
(పూర్తి వ్యాసం http://magazine.saarangabooks.com/ లో చదవండి)
can you include proper hyperlink not combined with telugu letters?
ReplyDeleteI am trying. But somehow the direct linkage to the web magazine is missing. Earlier it was directly linked. I donot know how to rectify this.Will you plz find the link going to a couple articles back?
ReplyDeleteభాస్కరం గారూ,
ReplyDeleteమీరు పేస్టు చేసిన లింక్ బానే పని చేస్తుంది , కాకపొతే సమస్య ఏంటి అంటే మీరు టైపు చేసేటప్పుడు
పూర్తివ్యాసంhttp://magazine.saarangabooks.com/2014/01/30/%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%97%E0%B0%A7-%E0%B0%93-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%95%E0%B0%A5/లో చదవండి
ఇలా పోస్ట్ చేస్తున్నారు , (పూర్తివ్యాసం ,లో చదవండి) వీటికి అసలు లింక్ కి మీరు స్పేస్ ఇవ్వకపోవటంతో ఆ లింక్ సరిగా పని చేయటం లేదు .
ఉదాహరణం కి ఇలా పోస్ట్ చేయండి
పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2014/01/30/%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%97%E0%B0%A7-%E0%B0%93-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%95%E0%B0%A5/ లో చదవండి
ఇప్పుడు సరిగా పని చేస్తుంది .
ఇంకా మీ పోస్ట్ నీట్ గా కనిపించాలి అంటే , మీరు ఇలా లింక్ మాములుగా పోస్ట్ చేయకుండా , పోస్ట్ టైపు చేసేటప్పుడు ఎడిటర్ లో మీకు పైన టూల్ బార్ కనిపిస్తుంది కదా ? అంటే 'Compose ' , 'Html ' ఇలా కనిపిస్తాయి లైన్ గా, అక్కడ మీకు 'Link ' అని కనపడుతుంది చూడండి . మీరు ఎక్కడ అయితే లింక్ ఇవ్వాలి అనుకుంటున్నారో అక్కడ cursor పెట్టి అప్పుడు ఆ 'link ' మీద క్లిక్ చేయండి . అది మీకొక కొత్త కొత్త బుల్లి విండో ఒపెంచెసి చూపిస్తుంది . ఆ విండో లో
'web address ' దగ్గర ఈ లింక్ పేస్టు చేయండి , ఇక 'Text to Display ' దగ్గర మీ ఇష్టం opt గా ఉన్న టెక్స్ట్ టైపు చేయండి . అలాగే 'Ok ' బటన్ పైన ఉన్న 'Open in a new window ' అన్నది సెలెక్ట్ చేసుకుని 'OK ' క్లిక్ చేయండి .
దీనితో అంత పొడుగు లింక్ లేకుండా మీ పోస్ట్ నీట్ గా కనిపిస్తుంది, పైగా లింక్ చక్కగా కరెక్ట్ ప్లేస్ కి తీసుకెళ్ళి వదులుతుంది క్లిక్ చేసిన వాళ్ళని .
థాంక్స్ శ్రావ్య గారూ...మీరు చెప్పినట్టే చేశాను. ఇప్పుడు నో ప్రాబ్లం.
Delete