Monday, February 3, 2014

ఆ కుర్రాణ్ణి చంపిన పాపం ఏ గంగనీళ్లతో కడిగితే పోతుంది?!

ఆ కుర్రాడి హత్య గుర్తొచ్చినప్పుడల్లా గుండె కలుక్కుమంటుంది..అయ్యో, ఈ దేశం ఏమైపోతోందనిపిస్తుంది...ఈ దేశం గొప్పతనం గురించి చెప్పేవన్నీ అబద్ధాలనిపిస్తుంది...తీవ్రనైరాశ్యం కలుగుతుంది...

ఇరవై ఏళ్ల కుర్రాడు...అరుణాచల్ ప్రదేశ్ వాడు...పేరు నిడోమ్ తనియమ్...పేరు కొత్తగా ఉందా?...ఉంటే మాత్రం? ఈ దేశంలో ఎంతమంది పేర్లు ఇతర ప్రాంతాలవాళ్ళకు కొత్తగా ఉండవు? యూరప్ వాళ్ళకు, అమెరికన్లకు కొత్తగా వినిపించే, నోరు తిరగని పేర్లవాళ్లు ఎంతమంది మనదేశం నుంచి ఆ దేశాలకు వెళ్ళడంలేదు? చదువుకోవడం లేదు? ఉద్యోగాలు చేయడం లేదు? వాళ్ళను అక్కడి వాళ్ళు చంపేస్తున్నారా?

మనదేశం ఆ దేశాలకన్నా ఎందులో గొప్పండీ?

నిడోమ్ తనియమ్ వేరే దేశం వాడు కాదు. ఈ దేశం వాడు. దేశరాజధానికి చదువుకోడానికి వచ్చాడు. అతన్ని ఎందుకు చంపేశారు?? ఏ గంగ నీళ్ళతో కడిగితే ఆ పాపం పోతుంది??

అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే నంటూ చైనాతో పోరాడుతున్నాం. అరుణాచల్ ప్రదేశ్ మనుషులు మనవాళ్లు కారా?? 

3 comments:

  1. He quarreled with the shop keeper is what news says, Why do we end up in always a conclusion he is killed?
    Please do change your statement!

    ReplyDelete
  2. there might have been a quarrel between the boy and the shopkeepers.But how can we condone his killing? That is why a writer commented that Delhi is a city of savages.

    ReplyDelete
  3. వేరే దేశం వాడైనా అతడి పట్ల శతృత్వం వహించడానికి కారణాలేమీ లేవండీ!

    దేశంలో రోజూ జరుగుతున్న అసంఖ్యాక రాక్షస కార్యాల్లో ఇదొకటి. నేరాలు గంగ నీళ్లతో కడిగితే పోయేవి కాదు.

    అందుకే వాటికి తగిన శిక్షలు పడినా.. అవి జరిగిన ఘోరాన్ని మాపలేవు. శిక్షలు పడినా వాటి వల్ల పరివర్తన వచ్చే రోజులూ కావివి.

    చూస్తూ ఉండటమే ప్రస్తుతం పౌరుల చేతుల్లో ఉన్న పని. ఎన్నిటికని ఏడుస్తాం? ఎన్నిటికని స్పందిస్తాం? రక్త బీజుడి రక్తపు బొట్లలా ఒకటి ముగిసే లోపు, మరో పది సంఘటనలు జరుగుతున్నాయి.

    నాటకీయంగా ఉంటుందేమో గానీ ఈ మాట.. దేశం ఏమై పోతుందో అర్థం కావటం లేదు.

    ReplyDelete