Wednesday, February 5, 2014

మరి పీవీ నరసింహారావు సంగతేమిటి?

నరేంద్ర మోడి కోల్ కతా ర్యాలీలో మాట్లాడుతూ ఇందిరా గాంధీ తర్వాత ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసి ఉండాల్సింది అన్నారు. మరి పీవీ నరసింహారావు సంగతేమిటి? తన మాట తెలుగువాళ్లను నొప్పిస్తుందని మోడీకి తోచకపోవడం ఆశ్చర్యం. ప్రణబ్ ముఖర్జీ నిస్సందేహంగా ప్రధాని కావడానికి అర్హులే. అయితే, మన్మోహన్ సింగ్ స్థానంలో ప్రణబ్ ప్రధాని కావలసింది అని అన్నా అర్థవంతంగా ఉండేది. తను రాష్ట్రపతి అయ్యేవరకు, యూపీయేలో ప్రధాని నిర్వహించవలసిన పోలిటికల్ మేనేజ్ మెంట్ ను చాలావరకు నిర్వహించింది ప్రణబ్ ముఖర్జీయే. 

10 comments:

  1. అలా అన్నందుకు నమో ను తప్పు పట్టవలసిన అవసరం లేదు. పి.వి. ప్రధాని పదవిని ప్రణబ్ లాగా కావాలని కోరుకోలేదు. కాంగ్రెస్ పార్టిలో అర్హత కలవారు బహిరంగంగా తమకు దక్కాల్సిన పదవిని కోరితే, వారికి ఇవ్వకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పదవిని అంటగడుతారు. ఉదా: ప్రతిభా పాటిల్, పి.వి. నరసిం హా రావు

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్య అసలు విషయం నుంచి పక్కకు వెడుతున్నట్టుంది. ప్రణబ్ ముఖర్జీ కన్నా పీవీ సీనియర్ కూడా అనుకుంటాను. ఇందిరాగాంధీ తర్వాత ప్రణబ్ ప్రధాని అయుండాల్సింది అంటే, పీవీకి ప్రధాని అయ్యే అవకాశం వచ్చేది కాదు. ప్రధానిగా పీవీ రికార్డ్ నిస్సందేహంగా మన్మోహన్ రికార్డ్ కన్నా మెరుగైనది. అలాంటి పీవీని మోడీ వ్యాఖ్య పక్కన పెట్టేస్తోంది. ఇది తెలుగువాళ్ళకే కాక, పీవీ రికార్డ్ ను గుర్తించిన ప్రతివారినీ గుచ్చుకునే మాటే. మోడీ ఇవన్నీ ఆలోచించకుండానే ఆ మాట అన్నారని ఇప్పటికీ నా అభిప్రాయం. మన్మోహన్ సింగ్ స్థానంలో ప్రణబ్ ను ప్రధానిని చేసి ఉండాల్సిందని ఆయన అంటే సరిపోయేది.

      Delete
    2. ఇంధిరా గాంధి హత్య సమయంలో పి వి హోం మంత్రి, డిల్లి సిక్కు అల్లర్ల విషయం తెలిసిందె గదా! అటువంటి సమయంలో నేను సీనియర్ ని కనుక నన్ను ప్రధాని చేయండి అని అడగ గలరా? అసలికి ఆ ఉద్దేశం ఆయనకు ఎప్పుడు ఉన్నట్లే కనపడదు. మీరు పి.వి. సీనియర్ కాబట్టి ప్రధాని అయ్యాడు అని సీనియర్టి కిపెద్ద ఓటు వేస్తున్నారు. ఆయన ప్రధాని కావటానికి కారణలలో అది ఒక అంశం. బహుశా ఆ రోజుల్లో మీడియా సీనియరిటి వలన పి.వి. గారు ప్రధాని అయ్యారు అని ప్రజలకు చెప్పి ఉండవచ్చు. దేశ అత్యుతమ ప్రధానుల్లో పి.వి. ఒకరు. పి వి నిజాయితి గుర్తించి, గౌరవించిన వారిలో వాజ్ పాయ్ గారు ఒకరు. అణు పరిక్ష క్రెడిట్ ను వాజ్ పాయ్ పి.వి. గారికి ఇచ్చారు. ఈ సారి నమో ప్రధాని అయితె, పివి కి భారత రత్న తెలుగు వారు అడగనవసరం లేదు. నమో నే మొదట పి.వి. కిచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు. వి.పి. సింగ్ కి ప్రణబ్, పి.వి. ల తో పోటి పడేంత సీన్ లేదు. ఇప్పు డాలోచిస్తే ఆయన ఇమేజ్ అంత మీడియా క్రియేట్ చేసి, చాలా హైప్ చెసింది. ఇప్పుడు కేజ్రివాల్ కి చేసినట్లు.

      Delete
    3. పీవీ సీనియర్ అనడంలో ఉద్దేశం సీనియర్ కనుక ఆయనే ప్రధాని అవాలన్నది కాదు. ప్రణబ్ కన్నా పీవీ సీనియర్ కనుక ప్రణబ్ ప్రధాని అయితే పీవీకి ప్రధాని అయ్యే అవకాశం రాదు అన్నదే.

      Delete
  2. ఇందిరా గాంధి తరువాత ప్రధానమంత్రి అయ్యింది రాజీవ్ గాంధి కాని పి వి నరసింహారావు కాదు కదా.

    ReplyDelete
    Replies
    1. నిజమే. ప్రశ్న ఏమిటంటే, ఇందిరాగాంధీ తర్వాత ప్రణబ్ ప్రధాని అయితే, పీవీ ఎప్పుడు ప్రధాని కావాలన్నదే,

      Delete
  3. పీవీతోపాటు మరో సీనియర్ వీ.పీ. సింగ్ కూడా అప్పుడు ప్రణభ్ కంటే సీనియర్, అర్హత కలవాడు.

    ReplyDelete
  4. మీరు పి వి గారిని ఈ విషయంలోకి అనవసరంగా లాగారు. మోది 1984, 2004 గురించి మాత్రమే మాట్లాడారు. అదీ కోల్‌కతాలో కాబట్టి ప్రణబ్ గురించి మాట్లాడారు.

    వికిలో ఉన్న ఈ రెండు లైన్లు చూడండి.

    Mukherjee was removed from his position as Finance Minister by Rajiv Gandhi in 1984. Gandhi had wished to bring in his own team of staff to govern India. Mukherjee was removed from his position even though he was rated as the best Finance Minister in the World that year according to a survey of Euromoney magazine.

    Mukherjee returned to handling the finance of India during the premiership of Narasimha Rao. He was appointed the Deputy Chairman of the Planning Commission. During Mukherjee's tenure 1991–96, Dr. Manmohan Singh as Finance Minister oversaw many economic reforms to end the Licence Raj system and help open the Indian economy.

    ReplyDelete
  5. నా ప్రశ్న సూటిగా ఉంది. ఇందిరాగాంధీ తర్వాత ప్రణబ్ ముఖర్జీ ప్రధాని అయుండాలని అన్నప్పుడు పీవీ ఎప్పుడు అవుతారని నా ప్రశ్న. అలా అనడంలో మోడీ ఉద్దేశించినా ఉద్దేశించకపోయినా పీవీ ని పక్కన పెట్టేయడం ఉంది. అది పొరపాటు అని మాత్రమే నేను అన్నాను. ఇంకా చెప్పాలంటే politically incorrect. మన్మోహన్ సింగ్ స్థానంలో ప్రణబ్ ను ప్రధానిని చేసి ఉండాల్సిందని అన్నా మీరు అన్న కోల్ కతా సందర్భానికి తగినట్టే ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. వాళ్ళ కుటుంబంలో వ్యక్తి రెడీగా ఉన్నప్పుడు, బయటివాళ్ళగురించి ఆలోచించవలసిన అవసరం ఏముంది?

      Delete