కోసల-మగధ ‘సినిమా కథ’లో కథనమే నాది కానీ, కథ కోశాంబీదే. మల్లబంధులకు పెట్టిన పరీక్షా, పుష్కరిణిలో స్నానం చేయాలన్న మల్లిక కోరికను అతను తీర్చడం రాహుల్
సాంకృత్యాయన్ రచన ‘ఓల్గా
సే గంగ’ నుంచి తీసుకున్నవి.
ఇంతకీ సినిమా కథ అన్నాక ఒక హీరో ఉండాలి కదా?! ఈ కథలో హీరో ఎవరు? ఇది నాకు ముందుగా ఎదురైన ప్రశ్న.
నాకు వదలిపెడితే; పసనేది, మల్లబంధుల, అజాతశత్రు, విదూదభుడు,
దీర్ఘచరాయణుడు...వీరిలో ఎవరైనా హీరో కావచ్చునంటాను. వీళ్లలో
ఏ ఒక్కరి కోణం నుంచైనా ఈ కథ చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే, నా
ఉద్దేశంలో ఈ కథలో వీళ్ళెవరూ హీరోలు కారు, కోసల అదృశ్యమై మగధ
ఏకైక సామ్రాజ్యంగా అవతరించడం అనే చారిత్రక పరిణామం; అంటే
చరిత్ర, హీరో! లేదా విలన్! విలన్ ప్రధానంగా సినిమా ఎందుకు
ఉండకూడదు? అయితే, చరిత్ర హీరోగా (లేదా
విలన్ గా) తీసిన సినిమా చూడడానికి మన ప్రేక్షకులు అలవాటు పడకపోవడం ఒక సమస్య. పోనీ నేనే చరిత్రను హీరోను చేసి సినిమా తీద్దామంటే ఓ వందకోట్లు(హాలీవుడ్
స్థాయిలో అయితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది కాబోలు) నష్టపోవడానికి నా దగ్గర ఓ
వెయ్యికోట్లు లేవు.
(పూర్తి వ్యాసం
http://magazine.saarangabooks.com/2014/02/27/%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%A1%E0%B1%81/ లో చదవండి)
(పూర్తి వ్యాసం
http://magazine.saarangabooks.com/2014/02/27/%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%A1%E0%B1%81/ లో చదవండి)
No comments:
Post a Comment