భార్య ఎకతెరీనాతో అన్యోన్యక్షణాలు మళ్ళీ వెనకబెట్టాయి. ఎప్పటిలా ఎడమొహం, పెడమొహం. వాళ్ళ కాపురం చాలావరకూ భోజనం బల్లకు, ముక్తసరి మాటలకు పరిమితమవుతోంది. అయినా 1858లో రెండో సంతానం కలిగింది. ఈసారి ఆడపిల్ల, పేరు నతాల్య. భార్యనుంచి దూరంగా పారిపోవాలన్న తహతహ ఆ ఏడాది వేసవిలో అతన్ని మరీ ఊపిరాడనివ్వకుండా చేసింది. మళ్ళీ సంచారానికి సిద్ధమయ్యాడు. ఈసారి తను చూడాలనుకున్న దేశాలన్నీ చూసిరావాలనుకున్నాడు.
( పూర్తి రచన 'భారత్ ను చూసి భయపడ్డాడు...' శీర్షికతో http://magazine.saarangabooks.com/2015/09/18/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%81-%E0%B0%9A%E0%B1%82%E0%B0%B8%E0%B0%BF-%E0%B0%AD%E0%B0%AF%E0%B0%AA%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81-%E0%B0%9A/ లో చదవండి)
No comments:
Post a Comment