కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీల మధ్య పోలికా?! ఆశ్చర్యంగా ఉందే అనుకుంటున్నారా? అదే తమాషా. ఒక్కొక్కసారి మనం ఊహించని వ్యక్తుల మధ్య, ఊహించని ఘట్టాల మధ్య పోలికలు కుదురుతూ ఉంటాయి. ఊహించని రీతిలో చరిత్ర పునరావృతమవుతూ ఉంటుంది.
సోనియా గాంధీ భారతీయుని వివాహమాడిన విదేశీయురాలైతే, నరేంద్ర మోడీ నూటికి నూరు పాళ్లూ భారతీయుడు, అందులోనూ హిందుత్వవాది. సోనియా 'లౌకికవాది' అయితే, మోడీ 'మతతత్వవాది'గా విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తి. ఏ రకంగా చూసినా ఒకరు ఉత్తరధ్రువం అయితే, ఇంకొకరు దక్షిణధ్రువం. అయినా సరే, సముద్రంలోని ఉప్పుకు, చెట్టుమీది కాయకూ సంబంధం ఉన్నట్లుగా వీరిద్దరి మధ్యా ఒక పోలిక కుదిరింది!
ఆ పోలిక ఏమిటో చూద్దాం.
సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షపదవిని స్వీకరించినప్పటినుంచీ ఆమె విదేశీయత చర్చలోకి రావడం ప్రారంభమైంది. ఒక విదేశీయురాలు, అందులోనూ తన ఇటలీ పౌరసత్వాన్ని వదలుకోని వ్యక్తి భారతదేశ ప్రధాని ఎలా అవుతారన్న ప్రశ్న బీజేపీ ఒక్కటే కాదు, కాంగ్రెస్ లోనే ఉన్న శరద్ పవార్, సంగ్మా, తారిక్ అన్వర్ లాంటివారు కూడా లేవనెత్తారు. అంతేకాదు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. సరే, అదే పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ కు మిత్రపక్షం కావడం, కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ అధికారం పంచుకోవడం వేరే విషయం. అలాగే, ఇతర కాంగ్రెసేతర పక్షాలు కూడా (ఒకటి రెండు మినహాయింపులు ఉంటే ఉండచ్చు)ఒక విదేశీయురాలిగా సోనియా గాంధీ ప్రధాని కావడానికి వీలు లేదన్న వైఖరి తీసుకున్నాయి.
ప్రధాని కావడానికి సోనియా అనర్హతా చర్చ 2004లో పతాకస్థాయికి వెళ్లింది. సోనియా గాంధీ ప్రధాని అవడమంటూ జరిగితే నేను శిరోముండనం(జుట్టు తీసేయడం) చేయించుకుంటానీ, ఒక్క పూట శనగలతో కడుపు నింపుకుంటాననీ, నేల మీద పడుకుంటాననీ నేటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అప్పట్లో చేసిన ప్రతిజ్ఞ సంచలనం సృష్టించింది. ప్రధాని కాగల అవకాశం ఉన్నప్పటికీ సోనియా వెనక్కి తగ్గి మన్మోహన్ సింగ్ ను ముందుకు తెచ్చారు. దానిని ఒక త్యాగంగా కాంగ్రెస్ వాదులు అప్పటినుంచీ చెప్పుకోవడం ప్రారంభించారు.
దాదాపు పదేళ్ళ తర్వాత, 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని కావడానికి గల 'అర్హతా'; లేదా ఆ మాట సరైనది కాదనుకుంటే, 'అభ్యంతరాలూ' ఒక వ్యక్తి విషయంలో చర్చలోకి వస్తున్నాయి. ఆ వ్యక్తి నరేంద్ర మోడీ. అప్పటి ఆ చర్చకు కాంగ్రెస్ సోనియా కేంద్రబిందువు అయితే, ఇప్పటి చర్చకు బీజేపీ మోడీ కేంద్రబిందువు. ఆ విధంగా ఈ చర్చ విషయంలో రెండు అఖిలభారత జాతీయ ప్రధాన పక్షాల మధ్యా ఒకవిధమైన 'సమతూకం' లేదా 'సమాన న్యాయం' ఏర్పడింది.
సోనియా గాంధీ ప్రధాని అయ్యే విషయంలో బీజేపీ నుంచి ఎక్కువ మోతాదులో ప్రతిఘటన ఎదురైతే, మోడీ విషయంలో ప్రస్తుతానికి ముస్లిం సంస్థలనుంచీ, 'లౌకికవాదులు'గా చెప్పుకునే ఇతరులనుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీని మోతాదు ముందు ముందు మరింత పెరుగుతుందా, రేపు ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయన్నది వేచి చూడవలసిందే కానీ ఇప్పటికిప్పుడు ఎలాంటి జోస్యమూ చెప్పలేం.
సోనియా విషయంలో కాంగ్రెస్ లోనే చీలిక వచ్చి శరద్ పవార్ తదితరులు వేరు కుంపటి పెట్టుకుంటే; మోడీ విషయంలో జేడీయూ భిన్న స్వరాలు వినిపిస్తున్న దృష్ట్యా , ఒకవేళ బీజేపీ మోడీ అభ్యర్ధిత్వాన్నే ఖరారు చేస్తే ఎన్డీయేలో కూడా చీలిక వస్తుందా అన్నది ప్రస్తుతానికి శేషప్రశ్న.
ఏదెలా ఉన్నా, నాకు తెలిసినంతవరకూ ప్రధాని కావడానికి గల అర్హతానర్హతల చర్చ స్వతంత్రభారతచరిత్ర మొత్తంలో సోనియా, మోడీ ఇద్దరి విషయంలోనే ముందుకు వచ్చింది. అది వారి మధ్య కుదిరిన ప్రధానమైన పోలిక.
సోనియా విదేశీయత ఆమె ప్రధాని కావడానికి ఒక అనర్హతగా జనం అంతా భావించారో లేదో మనకు తెలియదు. తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రధాని అయ్యే అవకాశాన్ని సోనియా స్వచ్ఛందంగా వదలుకున్నారు. అయితే, ఇప్పటికీ కాంగ్రెస్ లో వోట్లు ఆకర్షించగల ఏకైక నేత సోనియా గాంధీయే. ఈ వాస్తవంలో ఆమె ప్రధానికి కావడానికి అవసరమైన జనామోదం ఇమిడి ఉందా లేదా అన్నది కచ్చితంగా చెప్పలేం.
బహుశా రేపు మోడీకి కూడా ఇదే వర్తించవచ్చు. బీజేపీలో చాలామంది అనుకుంటున్నట్లు సోనియా లానే ఆయన వోట్లను విశేషంగా ఆకర్షించగల నాయకుడిగా రుజువు కావచ్చు. ఒకవేళ రేపటి ఎన్నికలలో ఎన్డీయే అధికారంలోకి రాగల సంఖ్యాబలాన్నే తెచ్చుకుంటే, ప్రధాని పదవికి మోడీ అభ్యర్థిత్వం చర్చ కాంగ్రెస్ లో మాదిరిగానే పతాకస్థాయికి చేరుకుంటుందా? చేరుకుంటే ఏం జరుగుతుందన్నవి మరికొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు.
ప్రస్తుతానికి ఇవి కూడా శేషప్రశ్నలు మాత్రమే.

మీ పోలిక సరిగా లేదని చెప్పడానికి చింతిస్తున్నా.
ReplyDeleteమీరు సంతోషించేలా నా పోస్ట్ లేనందుకు నన్ను కూడా చింతించమంటారా? ఏమైనా నా పోస్ట్ కు ఏకవాక్య స్పందన ఇచ్చినందుకు ధన్యవాదాలు.
Deleteబానిసత్వ పోకడ నుంచీ బయటకి రాక ఇలా పోకడలు తెస్తున్నందుకు చింతిస్తున్నాం.
ReplyDeleteఇక నేను సోనియా మన దేశ రాజకీయాలలో ఉన్నందుకు చింతిస్తున్నాను.
నాలాగా చాలా మంది ఉన్నారు అని నాకు తెలుసు కానీ బయటపడట్లేదు ఎందుకంటే డబ్బున్న వాడిని కొడితే డబ్బులన్నీ తీసుకుని పోయి వేరే చోట బ్రతుకుతాడు కాబట్టి.
ఒకరి అభిప్రాయంతో విభేదించే మీ హక్కును, మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించుకునే హక్కునూ నేను గౌరవిస్తాను. అయితే ఆ అభిప్రాయప్రకటన సభ్యంగా సంస్కారవంతంగా ఉంటేనే మీ అభిప్రాయాల గురించి ఎదుటివారు కనీసం ఆలోచించే అవకాశముంటుంది. మీరు బానిసత్వ పోకడ అంటే మీది అజ్ఞానం, మూర్ఖత్వం, బొత్తిగా చర్చకు పనికిరాని పిడి వాదం అని నేను అంటాను. ఇలాంటి మాటలు అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తాయి. ఈ అలవాటు మానుకోండి. సభ్యతగా, సంస్కారవంతంగా స్పందించడం అలవరచుకోండి. అప్పుడే మీ స్పందలకు గౌరవం ఉంటుంది.
Delete