Sunday, October 19, 2014

ఎన్సీపీ ముక్త్ మహారాష్ట్ర నినాదం ఎందుకు ఇవ్వలేదో?!

ఎగ్జిట్ పోల్స్ వచ్చాక , అందులోనూ అవి ఫలితాలను చాలావరకూ accurateగా  అంచనా వేయడం మొదలెట్టాక ఎన్నికల అసలు ఫలితాల మీద ఆసక్తి తగ్గిపొతోంది. ఎలక్ట్రానిక్ మీడియా దీనిని ఎందుకు గమనించడం లేదో తెలియదు. అసలు ఫలితాల రోజున రోజంతా టివి చానెళ్ళ ముందు జనాన్ని కదలకుండా కూర్చోబెట్టాలన్న  దాని లక్ష్యానికి ఇది   పనికొచ్చేది కాదు. అయినా ఎగ్జిట్ ఫలితాల పేరుతొ ఒకసారి , అసలు ఫలితాల పేరుతో  రోజంతా మరోసారి అవి ఎందుకు హడావుడి చేస్తున్నాయో అర్థం కాదు .

మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎగ్జిట్ ఫలితాలు ముందే చెప్పేశాయి. అన్ని సర్వేలు ఇంచుమించు ఒకే ఫలితాన్ని ఇచ్చాయి కనుక అసలు ఫలితాల సరళి కూదా అలాగే ఉండబోతున్నట్టు  మొదట్లోనే తెలిసిపోయింది కనుక బిజెపీ రెండు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. 

నాకైతే నిజంగా ఆశ్చర్యాన్ని మించి అసహ్యాన్ని కలిగించినది ఎన్సీపీ బిజెపీకి ఏకపక్షంగా బేషరతుగా బయటినుంచి మద్దతు ప్రకటించడం! ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ అభివృద్ధిని, మహారాష్ట్ర ప్రయోజనాలను కోరి సింగల్ లార్జెస్ట్ పార్టీగా గెలుపొందిన బీజెపీకి బయటి నుంచి మద్దతు ప్రకటిస్తున్నామని-ఒక పక్క ఫలితాలు వెలువడుతుండగానే హడావిడిగా ప్రకటించారు. ఆ హడావిడి ఆ పార్టీ నిజంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలా ప్రకటించిందన్న అభిప్రాయాన్ని కలిగించలేదు సరి కదా,  స్వప్రయోజనాల కోసమన్న అభిప్రాయాన్ని కలిగించింది. ఎందుకంటే అజిత్ పవార్ లాంటివారు చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బిజెపి ప్రభుత్వం వాటిని తిరగదోడుతుందన్న భయమే ఆ ప్రకటన వెనుక కనిపించింది. అలాంటి భయమే లేకపోతే ఆ ప్రకటన అంత అత్యవసరంగా చేయవలసిన అవసరం లేదు. అందులో రాజకీయమైన విజ్ఞత అసలే లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే, అటునుంచి అభ్యర్థన వచ్చే వరకూ ఆగవచ్చు. అంతలో కొంప లేమీ మునిగిపొవు. అభ్యర్థన రాకపోతే తన మానాన తను ప్రతిపక్ష పాత్ర నిర్వహించవచ్చు. 

ఆ తర్వాత  ఎండి టివి లో మాట్లాడుతూ ప్రఫుల్ పటేల్ సమర్థించుకున్న తీరు కూదా అంతే పేలవంగానూ, చీదరింపుగానూ అనిపించింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు తెరచాటున ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వదంతులు వినిపించాయి కనుక, ఆ అనైతిక ప్రయత్నాల వదంతులకు తెరదించడానికి, జనంలో అయోమయం ఏర్పడకుండా నివారించడానికే ముందస్తు మద్దతును ప్రకటించామని ఆయన ఇచ్చుకున్న ఒక సమర్థన. నేటి రాజకీయ ప్రమాణాలలో ఎన్సీపీ లాంటి పార్టీలో అలాంటి రాజకీయాలకు అతీతమైన సద్భావన హఠాత్తుగా మేలుకుందంటే రాజకీయాలు బొత్తిగా తెలియని అమాయకులు కూదా నమ్మరు. నమ్మరని తెలిసినా అలా సమర్థించుకున్నారంటే, తమ అవినీతిపై బిజెపి ప్రభుత్వం చర్య తీసుకుంటుందన్న భయం తప్ప ఇంకో కారణం కనిపించదు. 

బిజెపి సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది కనుక, ఏదో ఒక పార్టీ మద్దతు ఇవ్వనిదే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందనీ, అందుకే తాము ముందుకు వచ్చామని ఆయన చెప్పుకున్నారు. ఇది కూదా అతి తెలివి వాదనె. బిజెపికి సహజ మిత్రమైన శివసేన ఎలాగూ ఉండనే ఉంది. ఒకవేళ శివసేన కాదంటే అప్పుడే తాము మద్దతు ప్రకటించవచ్చు. ఇంతలోనే ఎందుకు తొందర? ఎందుకంటే, అందుకే!

బిజెపి కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని ఇచ్చింది కానీ, ఎన్సిపీ ముక్త మహారాష్ట్ర అని ఎందుకు నినాదం ఇవ్వలేదో!

6 comments:

  1. TMC...HJC...NCP etc have Congress roots so Congress mukht bharath means including that big package.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. అది వచ్చే ఎన్నికల నినాదమండి. నమో, అమిత్ షా కాంబినేషన్ ఊహించని అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. గత సంవత్సరం బిజెపి కి ఈ దశ పడుతుందని తలపండిన రాజకీయ మేధావులు అనుకోనుండరు. ఒక్క సంవత్సరం లో ఎన్నో మార్పులు. ముఖ్యంగా బి.జె.పి కి ఒ.బి.సి, యస్.సి, యస్.టి ఓటర్ల మద్దతు విపరీతంగా లభిస్తున్నాది. అగ్రవర్ణ భూస్వామ్య కులాల పార్టిలు ఇవన్ని నేడు కుటుంబ పార్టిలు, ఆదరణ లభించటంలేదు. రానున్న రోజులలో యన్.సి.పి. ఒక్కటే కాదు, పెద్ద పార్టిలైన డి.యం.కె, అన్నా డి.యం.కె, ములాయం, దేవే గౌడ, కె.సి.ఆర్, చంద్రబాబు, నితిష్, మమత అందరి స్థానాలను బిజెపి పార్టి ఆక్రమించాలనే ఆలోచన లో ఉన్నట్లున్నాది. డి.యం.కె,అన్నా డి.యం.కె. పార్టిలలోని లీడర్లందరి పైన సి.బి.ఐ. విచారణ, కోర్టు కేసులు నడుస్తున్నాయి. రానున్న రోజులలో లీడర్లు లేని పార్టిలు గా మారుతాయి. రానున్న రోజులలో బెంగాల్, తమిళ నాడు పైనే అమిత్ షా ఫోకస్ చేస్తున్నాడు.

    ReplyDelete
  4. BJP MEASN BOGUS JANATA PARTY,,,,,,,,WHICH IS DECEIVING PEOPLE TO BENEFIT TOP BUSINESS FAMILIES FROM GUJARAT

    ReplyDelete
    Replies
    1. అలా ఎందుకనుకోవాలీ?, Business Jivula Party అనుకోరాదా బీదజీవులపార్టీ అనుకోలేక పోతే?
      బోగస్ విషయానికొస్తే, బోగస్ కానిది రాజకీయపార్టీ ఎక్కడుందండీ?

      Delete
  5. మరి మొఢీ అబ్బ కూడా గెలవలేడన్న శివసేనతో దోస్తీకి సై అంటున్న బిజెపిని ఎమనాలి? వ్యభిచారం చట్టవ్యతిరేకం అన్నదెవరు?

    ReplyDelete