మనం సమాచారయుగంలో ఉన్నామంటారు...ప్రపంచంలోని ఏమూల సమాచారమైనా ఇప్పుడు కేవలం ఒక్క క్లిక్ దూరంలో ఉందంటారు. 24 X 7 న్యూస్ చానెళ్ల సంగతి సరేసరి. కానీ నిజంగానే మనకు అందవలసినంత సమాచారం అందుతోందా???
లేదనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. నల్లధనం గురించిన విషయాలే తాజా ఉదాహరణ.
1. విదేశాలనుంచి అందిన ఖాతాదారుల పేర్లు బయటపెట్టడానికి ఆ దేశాలతో చేసుకున్న ఒప్పందాలు అడ్డు వస్తాయని కేంద్రం సుప్రీం కోర్టుకు చెప్పింది.
2. దాంతో సుప్రీం కోర్టు కోప్పడింది. సరే నని ప్రభుత్వం మూడుపేర్లు బయటపెట్టింది.
3. మూడు పేర్లేమిటి, మొత్తం పేర్లన్నీ మాకు ఇవ్వండని అంటూ సుప్రీం కోర్టు మళ్ళీ అంది. సరేనని కేంద్రం ఈసారి 627 పేర్లతో ఒక జాబితా సీల్డు కవర్ లో పెట్టి సుప్రీం కోర్టుకు ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆ జాబితాను సిట్ కు ఇచ్చి నెల రోజుల్లో దానిపై ఏం చేశారో నివేదిక ఇమ్మని అడిగింది. ఈసారి పేర్లు వెల్లడించమని కోర్టు అనలేదు.
4. విచిత్రంగా ఇంకో మాట వినిపించింది. సిట్ కు ప్రభుత్వం ఆ జాబితాను జూన్ లోనే ఇచ్చిందట. అంటే ఏం జరిగిందన్నమాట? సిట్ దగ్గర ఇప్పటికే ఉన్న జాబితానే సుప్రీం కోర్టు మళ్ళీ సిట్ కి ఇచ్చిందన్న మాట.
5. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న సిట్ కు జూన్ లోనే జాబితా ఇచ్చామన్న సంగతి కోర్టుకు ప్రభుత్వం ముందే చెప్పినట్టు లేదు. సిట్ కూడా చెప్పినట్టు లేదు. ఎందుకు చెప్పలేదో తెలియదు. మరచిపోయిందా?
6. ఆపైన ఇంకో ప్రశ్న. జూన్ లోనే జాబితా తీసుకున్న సిట్ దాని మీద ఇన్ని మాసాల్లో ఏం చేసింది? తెలియదు.
7. ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో పేర్లు ఒప్పందంలో భాగంగా విదేశాలనుంచి అందినవి కావు. ఒక HSBC బ్యాంక్ ఉద్యోగినుంచి ఫ్రాన్స్ అడ్డదారిలో సంపాదించి మనదేశానికి ఇచ్చిన పేర్లు. అంటే వాటికి ఒప్పందాలు వర్తించవు. అయినా ప్రభుత్వం ఒప్పందాలు అడ్డువస్తాయని ఎందుకు అంది? తెలియదు.
8. తాజాగా మరో వార్త. ఆ జాబితాలోని 150 పేర్లవారి కేసులు ఇప్పటికే ప్రభుత్వం సెటిల్ చేసేసిందనీ, వారిమీద ఇప్పుడు కొత్తగా తీసుకునే చర్యలు ఏవీ లేవని ఆదాయం పన్ను శాఖ అధికారులు అన్నారట. మరో 120 మంది తమకు విదేశంలో ఖాతా లేదని చెప్పారట. అలాంటప్పుడు ఖాతా ఉందని నిరూపించడం కష్టమట. ఎందుకంటే, ఆ జాబితా అడ్డదారిలో అందింది కనుక బ్యాంక్ సహకరించదట.
9. అన్నింటికన్నా పెద్ద షాక్ కు మనం సిద్ధంగా ఉండాలి. ఆదాయం పన్ను శాఖ అధికారుల ప్రకారం, నల్లధనం మహా ఉంటే 3వేల కోట్లను మించదట. దాన్ని దేశానికి రప్పించడం కూడా కష్టమట. మనం ఏళ్ల తరబడిగా వింటున్నది, లక్షల కోట్లలో ఉంటుందని! ఈ మాత్రం సమాచారం ఆదాయం పన్ను శాఖవారు ఇన్నేళ్లలోనూ ఎప్పుడూ ఇవ్వకుండా ఎందుకు ఊరుకున్నారో తెలియదు. ఇప్పుడు ఈ భోగట్టా వారినుంచి తీసుకున్న మీడియా వారు ఇంతకాలం ఎందుకు ఆ పని చేయలేదో తెలియదు.
దీనంతటిని బట్టి ఏమనిపిస్తోంది? నల్లధనం బయటపడడం సంగతి దేవుడెరుగు...నల్లధనం గురించిన పూర్తి సమాచారమైనా ఎప్పటికైనా బయటపడుతుందా అనిపించడం లేదా???

Free blogger templates www.ltemplates.com
ReplyDeleteఅంతా హళ్ళికి హళ్ళి సున్నకి సున్నా వ్యవహారం అండీ. రకరకాల కారణాలు. రకరకాల ఉపాయాలు. అన్నీ దొడ్డిదారిన నల్లకుబేరులను ఒడ్డెక్కించటానికే ప్రభుత్వమూ దాని విభాగాలూ అడే నాటకాలు. పిచ్చివాళ్ళు జనమే.
ReplyDeleteనిజమేనండీ. జనమే పిచ్చివాళ్లు.
Deleteభాస్కరం గారు,
ReplyDeleteనల్లధనం గురించి సమాచారం ఎవరి దగ్గర ఉందని మీరనుకొంట్టున్నారు?
నల్ల ధనం సమాచారం ఎవరి దగ్గర ఉందో నాకూ తెలియదండీ. దీనిపై నేనేమీ అనుకోవడంలేదు. పొగ మాత్రమే కనిపిస్తోంది కానీ, నిప్పు ఎక్కడుందో తెలియడం లేదనే నా బాధ.
ReplyDeleteDocuments released by ICIJ reveals abt massive tax evasion by global Cos.PepsiCo seems to be one of the Cos cheating-huge taxes for years
ReplyDeletehttp://www.dailypioneer.com/nation/accounting-fraud-opens-can-of-worms.html
Key points
ReplyDelete1. One address where 1600 Cos listed
2. PwC, Ernst & Young, KPMG & Deloitte caught for tax frauds
3. Companies have channeled hundreds of billions of dollars through Luxembourg and saved billions of dollars in taxes. Some firms have enjoyed effective tax rates of less than 1 percent on the profits they’ve shuffled into Luxembourg.
4. Pepsi, IKEA, AIG, Coach, Deutsche Bank, Abbott Laboratories and nearly 340 other companies have secured secret deals from Luxembourg that allowed many of them to slash their global tax bills.
5. Your head will spin-12 Lux leaks diagram on Tax cheating :)
http://www.theguardian.com/business/gallery/2014/nov/07/12-luxleaks-diagrams-that-will-make-your-head-spin
http://www.icij.org/project/luxembourg-leaks/leaked-documents-expose-global-companies-secret-tax-deals-luxembourg
http://www.dailypioneer.com/nation/accounting-fraud-opens-can-of-worms.html