ఇంతకీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలి?!
దీని మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
1953, అక్టోబర్ 1న మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అప్పటికి తెలంగాణ ఆంధ్రరాష్ట్రంలో భాగం కాదు.
1956లో తెలంగాణ కూడా కలసిన తర్వాత నవంబర్ 1న ఏటా అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం.
ఇప్పుడు తెలంగాణ వేరుపడింది. కనుక ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడన్న ప్రశ్న తలెత్తింది.
తెలంగాణాను కూడా కలుపుకుని ఆంధ్రప్రదేశ్ అవతరించిన నవంబర్ 1కి, తెలంగాణ వేరుపడడంతో రెలెవెన్స్ పోయింది. కనుక ఆ రోజున అవతరణ దినోత్సవం జరుపుకోవడంలో సాంకేతికంగానూ, ఔచిత్యపరంగానూ కూడా అర్థంలేదు.
ఇక మిగిలింది ఆంధ్రరాష్ట్ర అవతరణ తేదీ అయిన అక్టోబర్ 1. ఆరోజున జరుపుకోవడం కన్నా మరో మార్గం కనిపించడంలేదు.
ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ అనే పేరు అప్పటికి లేదుకనుక అదెలా కుదురుతుందనే ప్రశ్న రావచ్చు.
మొత్తం మీద ఇది చిక్కు ప్రశ్నే.
దీని మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
1953, అక్టోబర్ 1న మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అప్పటికి తెలంగాణ ఆంధ్రరాష్ట్రంలో భాగం కాదు.
1956లో తెలంగాణ కూడా కలసిన తర్వాత నవంబర్ 1న ఏటా అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం.
ఇప్పుడు తెలంగాణ వేరుపడింది. కనుక ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడన్న ప్రశ్న తలెత్తింది.
తెలంగాణాను కూడా కలుపుకుని ఆంధ్రప్రదేశ్ అవతరించిన నవంబర్ 1కి, తెలంగాణ వేరుపడడంతో రెలెవెన్స్ పోయింది. కనుక ఆ రోజున అవతరణ దినోత్సవం జరుపుకోవడంలో సాంకేతికంగానూ, ఔచిత్యపరంగానూ కూడా అర్థంలేదు.
ఇక మిగిలింది ఆంధ్రరాష్ట్ర అవతరణ తేదీ అయిన అక్టోబర్ 1. ఆరోజున జరుపుకోవడం కన్నా మరో మార్గం కనిపించడంలేదు.
ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ అనే పేరు అప్పటికి లేదుకనుక అదెలా కుదురుతుందనే ప్రశ్న రావచ్చు.
మొత్తం మీద ఇది చిక్కు ప్రశ్నే.
అక్టోబరు ౧న ఐతే సమంజసం అంటూ ఈ విషయంపై నేను లోగడనే వ్యాఖ్యానించానొక బ్లాగులో. అంధ్రప్రదేశ్ అన్న పేరు మాత్రం ఎందుకు? మరొక చక్కని పేరుతో పునర్నామకరణోత్సవం కూడా చేయటమే బాగుంటుం దనుకుంటాను. కావలిస్తీ మునుపటి పేరు ఆంధ్రరాష్ట్రం కాబోలు, దానినే పునరుధ్ధరించ వచ్చును.
ReplyDeleteఇన్ని సార్లు విడిపోయి, కలిసి, విడిపోయిన రాష్ట్రానికి అసలు అవతరణదినోత్సవం అవసరమా? నా దృష్టిలో అనవసరం.
ReplyDeleteచిత్తం.
Deleteఇంకొక ముక్క కూడా సెలవీయండి మరి.
ఎన్నో దండయాత్రలు.
ఎన్నో రాజ్యాలు.
ఎనెన్నో అంతర్గతయుధ్ధాలు.
ఐనా చచ్చీ చెడి, స్వాతంత్యం పేరుతో ఒకటైనట్లు నటిస్తూ కలిసున్నట్లుగా జీవిస్తూ విడివిడి ప్రాంతాలవారంగా భావిస్తూ ఒక విచిత్ర దేశంగా ఉన్న ఈ భారతావనికి స్వాతంత్ర్య దినోత్సవం మాత్రం అవసరమా?
ఇదీ అనవసరమేమో మీ మార్కు లాజిక్ ప్రకారం?
ఏమంటారు?
అక్టోబర్ 1 న జరపడమే సమంజసం. శ్యామలీయం గారన్నట్లు. ఆంధ్రప్రదేశ్ అన్న్న పేరు కూడా ఇహ అనవసరం. సింపుల్ గా ఒరిజినల్ గా వట్టి Andhra అని వ్యవహరించుకుందాం. అప్పుడు కూడా అక్షరక్రమంలో ముందే ఉంటాం గా!
ReplyDeleteశ్యామలీయం మాస్టారు & మహోజస్ గార్లతో ఏకీభవిస్తున్నాను. అక్టోబరు 1 నాడు అవతరణ దినోత్సవం చేసుకుంటే ఆంద్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ శాంతిస్తుంది. అలాగే ప్రదేశ్ అన్న పదానికి హిందీలో రాష్ట్రం అన్న అర్ధం ఉన్నా అది తెలుగులో సరిపోదు.
ReplyDeleteమా రాష్ట్రం సంగతి మాకు తెలుసు. నీ సలహలు, సమర్ధింపులు అస్సలు అవసరం లేదు.
Delete"నేను నేనే" గారూ, సభాముఖంగా లేదా ఇలా బ్లాగుముఖంగా లేదా ఎలాంటి పదిమందీ ఉండే వేదికలమీదనైనా స్పందించే విధానం బాగుండాలని దయచేసి అర్థం చేసుకోండి. సగౌరవంగా సంభావించబడాలని మీరు భావించుకుంటారు కదా, అటువంటప్పుడు తొలుత ఇతరులతో మర్యాదగా మాట్లాడటం ప్రాథమికమైన బాధ్యత. అభిప్రాయాలంటారా, అవి ఇతరుల అభిప్రాయలతో కలవాలని నిర్భంధం ఏమీ ఉండదు. అంతమాత్రం చేత భిన్నాభిప్రాయం కనిపించగానే ఏకవచనప్రయోగంతో విరుచుకు పడటం సభ్యతకాదండి.
Deleteబ్లాగు యజమాని మీరు మీరేనాండీ, nice to meet you.
Deleteశ్యామలీయం గారూ ,
Deleteక్షమించాలి. మీరు చెప్పినది నీ ఆమోదయోగ్యమే అది కేవలం మనుషుల విషయంలో. ఒళ్ళంతా గులాబీ విషయం నింపుకుని ఎప్పుడూ పక్కవాళ్ళ మీద పడేడ్చి వాళ్ళ నాశనం కోరుకునే పయోమముఖ విషకుంభాల విషయంలో కాదు.
బ్లాగు నాదో కాదో తర్వాత సంగతి, ఆంధ్రప్రదేశ్ లో నీకేం సంబంధం ఉందని నీ జోక్యం గొట్టిముక్కల?నీ గులాబీ అతితెలివి కట్టిపెట్టు.
అక్టోబరు ఒకటి ముగిసి పోయింది. నవంబరు 1 ముచ్చట కూడా జరిగేటట్టు కనిపించడం లేదు. ఈ సంవత్సరం అవతరణ ఉత్సవాలు లేనట్టేనా నేను నేనే గారు? మీ రాష్ట్రం సంగతి మీకు బాగా తెలుసన్నారని, జనరల్ నాలెడ్జి కోసం అడిగానంతే. కోపగించకండి.
Deleteనేను రాయడం ఇష్టం లేకపోతె భాస్కరం గారు చెబుతారు నడిమిట్ల మందికి రంది ఎందుకో ఏమో? ఎవరు తన బ్లాగులో వ్యాఖ్యలు రాయాలో రాయకూడదో నిర్ణయించే హక్కు బ్లాగు యజమానికే ఉంటుంది. ఆ మాత్రం తెలియకపోతే ఎలాగండీ సార్!
Deleteఅబ్బో పక్క రాష్ట్రం గురించి తెలుసుకోవాల్లన్న యావ ఎంత ముచ్చటేస్తుందో. మేము ఎప్పుడు చేసుకుంటామో, చేసుకోమో అన్న ఆరాటం తో నిద్ర కూడా పట్టలేదేమో పాపమ్. పోన్లే ఇంత ముచ్చట పడతంటే చెప్పకపోతే ఎట్లా. మా రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్, దాని అవతరణ దినోత్సవం నవంబర్ 1. ఎవరికో ఇష్టం లేకవిడిపోయినంత మాత్రాన మా రాష్ట్రం పేరు మార్చుకోవాల్సిన అగత్యం మాకు లేదు.
Deleteఇది సరేగానీ నా జనరల్ knowledge కూడా పెంచుకోవాలని మహా యావగా ఇప్పుడు. అబ్బే పక్క రాష్ట్రం గురించిన యావ నాకేమాత్రం లేదుగానీ, గాప్పుడేప్పుడో తెలంగాణా కావాలని ఎవరో శ్రీకాంత్ చారి సూసైడ్ చేసుకున్నాడని చదివినా గప్పుడు చచ్చిపోతే గిప్పుడు ఆళ్ళ అమ్మ కి MLA టికెట్ ఇచ్చుడు లేక్కేంది అని కెసిఆర్ దొర అన్నాడని చదివినా. సర్లే ఎవడు ఎటు పొతే నాకేంది గానీ, ఆ శ్రీకాంత్ చారి ఈ శ్రీకాంత్ చారి ఒక్కరేనా కాదా అన్న డౌట్ నాకు జర క్లియర్ చేస్తే చాలు .
ఎవరి బ్లాగులో ఎవరు వాక్యలు రాయాలో ఆ బ్లాగ్ ఓనర్ చెప్పాలన్న జ్ఞానం ఉన్న గొట్టిముక్కుల, ఎవరి రాష్ట్రం సంగతి వాళ్ళు చూసుకుంటారన్న తెలివిలేని అజ్ఞానం లో ఎలా ఈదులాడుతున్న . పైనే చెప్పా ఇహ నీ అతి తెలివి ప్రదర్శన చాల్లే .
కొంచెం జంకు తోనే, మరొకసారి వ్రాయటానికి సాహసిస్తున్నాను. 'నేను నేనే' అన్న కలంపేరుతో వ్రాస్తున్నవారు 'మాకు మేమే మీకు మీరె ఎందుకీ రుస రుస" అన్న ధోరణిలో ఉన్నారు. ఇది చింత్యం.
Deleteమన బ్లాగులో టపాలో వ్యాఖ్యలో ఐనాసరే, ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలో ఐనా సరే, సముదాచారం పాటించటం మనకే గౌరవప్రదం అని నా అభిప్రాయం. ఒకరు విసుర్లకు దిగితే మరికొందరూ దిగకతప్పని పరిస్థితిని వారు ఏర్పరచే ప్రమాదం తప్పకుండా ఉంటుంది. ఇక్కడ అదే జరుగుతున్నది. ఇది అంత మంచి సంప్రదాయం కాదు. తెలుగుబ్లాగులు పోట్లాటల వేదికలుగా ఉండటం తెలుగుబ్లాగులకూ తెలుగుబ్లాగర్లకూ కూడా మంచిది కాదని నా అందోళన.
ఈ వ్యాఖ్యాశేణిలో గొట్టిముక్కలవారు ఏమైనా ఏకవచనప్రయోగం చేసారా, "నీ సలహలు, సమర్ధింపులు అస్సలు అవసరం లేద"ని ఏకవచనప్రయోగంతో అనుచిత వ్యాఖ్య రావటానికి? అందుచేత "బ్లాగుయజమాని మీరా"" అని గొట్టిముక్కలవారు అడగవలసి వచ్చింది. ఆయన సంయమనం ఎలా పాటిస్తున్నారో నేనునేనేగారు గమనించగలరు. కాని సందర్భం ఏముందని నేనునేనేగారు ఆంధ్ర-తెలంగాణాల విబేధాలను ప్రస్తావించారో బోధపడదు. ఈ అసందర్భవ్యాఖ్య అసలుటపాకు సంబంధంలేని చర్చకు దారితీస్తున్నది. అనవసరంగా మరింత రెచ్చగొట్టే ధోరణిలో 'యావ', 'కేసీఅర్ దొర', 'అజ్ఞానం' వంటి మాటలను దురుసుదనంతో ప్రయోగిస్తూ యుధ్ధప్రకటనలు చేస్తున్నారు నేనునేనేగారు. ఇది బాగాలేదని నా అసంతృప్తి తెలియజేయటం కోసం ఈ వ్యాఖ్యచేయవలసి వస్తున్నది.
భాస్కరం గారూ, దయచేసి విషయసంబంధంలేనివీ, దురుసుగా ఉన్నవీ ఐన వ్యాఖ్యలను పరిహరించగలరు. వీటి వలన ఎవరికీ ఏ ఉపయోగమూ ఉండదు కదా.
నేను ఇలా అడగటం వెనుక మరొక కోణం కూడా ఉన్నది. అన్ని సందర్భాల లోనూ యుధ్ధాలను ఎదుర్కొంటూ ప్రతివ్యాఖ్యలు చేసుకుంటూపోవటం మనకు సాధ్యపడదు కదా. అటువంటి సందర్భాలలో కొందరు వ్యాఖ్యాతలు అనవసరంగా నిందలకు గురికావటం తరచుగా గమనిక లోనికి వస్తున్నది. ఇది వ్యాఖ్యలు ఉంచాలంటే భయపడే పరిస్థితిని తెస్తున్నది. అందుకే ఈ వ్యాఖ్యను ఉంచటమూ కొంత జంకుతోనే చేస్తున్నానని తొలుతనే మనవి చేసుకున్నాను.
అయ్యా శ్యామలీయం గారూ , మీ కున్నంత ఓపిక సహనం నాకు లెవు. ఎదుటివాటి మొహం మీద ఉమ్మేస్తున్నా తుడుచుకుని తిరగే ఓపిక అంతకన్నా లెదు. సదరు గొట్టిముక్కల చేసిన బోడి ఆంధ్రప్రదేశ్ తరహా విద్వేషపు రాతలు నా రక్తాన్ని మరిగిస్తున్నాయి . తమరికి అంత మక్కువగా ఉంటె ఆ విద్వేషపు రాతలను చూసి మురుసుకోండి. నాకంతటి విశాల హృదయం లెదు. వెళ్ళు దూరే సందు లేదు, కానీ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ని ఎగతాళి చేయటం బాగా అలవాటు ఈ రాతగాల్లకి మీ అతి మంచి తనపు సమర్ధింపు ఒకటి .
Deleteఏకవచన ప్రయోగం అంత బాధగా ఉందేమి మీకు, వాళ్ళు ఒక ప్రాంత ప్రజల్ని బ్లాగుల నిండా కూసే సూతలు కనపడటం లేదా?