Tuesday, February 11, 2014

'1984 ఢిల్లీ-2002 గుజరాత్' స్పందనల మధ్య తేడా ఎందుకుంది?

'2002 గుజరాత్' ప్రస్తావన వచ్చినప్పుడల్లా,  '1984 ఢిల్లీ' కూడా ప్రస్తావనకు వస్తోంది. ఎన్నికల సమయంలో ఇంకా ఎక్కువగా వస్తోంది.

దాంతోపాటే, అంతగా కాకపోయినా,  ఇంకో ప్రశ్న కూడా ప్రస్తావనకు వస్తోంది. అది:  '2002 గుజరాత్' వివాదాస్పదం, సంచలనాత్మకం అయినంతగా '1984 ఢిల్లీ' ఎందుకు కాలేదు?

టీవీ డిబేట్లలో కొందరు టీవీ జర్నలిస్టులు దానికి ఒక సమాధానం చెబుతూ వస్తున్నారు. అదేమిటంటే, 1984లో ఇన్ని టీవీ న్యూస్ చానెళ్లు లేవు కనుక ఢిల్లీ ఊచకోత తీవ్రత జనానికి తెలియలేదు కనుక అది అంత వివాదాస్పదం, సంచలనాత్మకం కాలేదట! 2002లో టీవీ చానెళ్లు మూల మూలలకూ విస్తరించాయి కనుక గుజరాత్ ఊచకోత జనం దృష్టిలో బాగా పడిందట! టీవీ చానెళ్లు లేక పోవడం కాంగ్రెస్ కు అదృష్టం తెచ్చిపెడితే, ఉండడం నరేంద్ర మోడీకి దురదృష్టం తెచ్చిపెట్టిందన్నమాట.

నిజమా? ఆ సమాధానంతో మీరు ఏకీభవిస్తారా??

నాకు కూడా మొదట్లో అది సహేతుక సమాధానమనే అనిపించింది. కానీ  ఇంకోవైపునుంచి చూస్తే అలా అనిపించడం లేదు.

ఢిల్లీలో 3000 వేల మంది శిక్కులను నరికి పోగులు పెడితే, టీవీ చానెళ్లు లేవు కనుక దాని తీవ్రత జనానికి తెలియలేదా? కాంగ్రెస్ కు 400 పైగా లోక్ సభ సీట్లతో అఖండ విజయం అందించారా? ఇదేమైనా నమ్మశక్యంగా ఉందా? ఢిల్లీలో ఏం జరిగిందో తెలియని అంధయుగంలో మన దేశం ఉందా? దాని తీవ్రత ఎంతో తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉందా? టీవీ చానెళ్లు లేకపోతే మానె, వార్తా పత్రికలు లేవా? పల్లెటూళ్ళ రచ్చబండ దాకా వార్తా పత్రికలు వెళ్ళడం లేదా? ఇంకా దారుణం, కాంగ్రెస్ కు అపూర్వ విజయం కట్టబెడతారా?

ఆలోచించిన కొద్దీ జర్నలిస్టు మిత్రుల మాటల్లో నాకు ఎలాంటి సహేతుకతా కనిపించడంలేదు. నాకు సమస్య కాంగ్రెస్ తో కన్నా జనంతో ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది. అది కూడా 1984 లో తగిన వయస్సూ, పరిణతి ఉన్న జనాలతో! వారి ఆలోచనల్లో 3000 వేల మందిని పరమ ఘాతుకంగా చంపడం గాఢమైన ముద్ర వేయలేదా? వాళ్ళలో ఆగ్రహావేశాలు పెల్లుబుకలేదా? పెల్లుబుక లేదంటే, వారి మైండ్ సెట్ ఎలాంటిదనుకోవాలి? ఎంతటి హింసనైనా మామూలుగా తీసుకునే ఒక నిర్లిప్త స్వభావం వారిదనుకోవాలా? ఈ మానసిక కోణాన్ని ఎవరైనా ఇంతవరకు పరిశీలించారా?

నేను కూడా ఈ జనంలోకి(తగినంత వయసు, పరిణతి ఉన్న) వస్తానేమో నాకు తెలియదు. కాకపోతే 1984లో నేను అప్పుడప్పుడే పత్రికా రంగంలోకి అడుగుపెట్టాను. ఒకవేళ నేను కూడా ఈ జనంలో భాగమే ననుకుంటే, వారి గురించి అన్నవి నాకూ వర్తిస్తాయి.


15 comments:

  1. నిజమా? ఆ సమాధానంతో మీరు ఏకీభవిస్తారా??
    ఏకీభవించను. అలా ఇంగ్లిష్ మీడీయా వారు చెప్తూంటారు. వాస్తవమేమిటంటే మత కలహాలలో మనుషులు చనిపోవటం దేశ విభజన జరిగినప్పటినుంచి కొనసాగుతూనే ఉండింది(పాకిస్తాన్ కు చెందిన అతను దేశ విభజన వలన భారత ఉపఖండంలో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటి వరకు 50 లక్షలు ఉంట్టుందని లెక్క వేశాru). అప్పట్లో మత కలహాలను, అదొక వాస్తవం గా ప్రజలు చూశారు. దేశం లో సెక్యులరిజానికి వచ్చిన ముప్పు అని ఎవ్వరు అనుకోలేదు. గుజరాత్ విషయానికొచ్చేసరికి ఇంగ్లిష్ మీడీయా వారు చాలా అతి చేశారు. సెక్యులరిజం వర్సెస్ హిందుత్వతో మొదలుపెట్టి మోడిత్వ అనే పదం కూడా సృష్ట్టించారు. పది సంవత్సరాలు పైగా మొడి కి వ్యతిరేకం గా ,చేసిన ప్రాపగండాను చూసి, తటస్తులుగా ఉండే ప్రజలకు కూడా విసుగ్గెత్తింది. అందువలననే ఈ రోజు సోషల్ మీడీయాలో మోడికి తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది. ఇంగ్లిష్ మీడీయా కన్నా లోక్ సభ,రాజ్య సభ ,డిడి టివి చానల్స్ లో చర్చలు ఎంతో అర్థవంతంగా జరుగుతాయి.

    ReplyDelete
  2. స్పందనల మధ్య తేడా మీడియాకి మాత్రమే ఉన్నట్టుంది. ప్రజలకేమాత్రం ఉన్నట్టులేదు.
    1984లో దేశంలో కాంగ్రెసుని గెలిపించినట్లే, 2002లో గుజరాత్‌లో బిజెపిని గెలిపించారు.

    ReplyDelete
    Replies
    1. ఒక ప్రశ్న..ఢిల్లీలో శిక్కుల ఊచకోతను మామూలు మతఘర్షణల గాటన కట్టగలమా? మామూలుగా మతఘర్షణలంటే మనదేశంలో హిందూ-ముస్లిం ల మధ్య జరిగేవే. ప్రారంభం ఏవైపునుంచి జరిగినా వాటిలో ఉభయుల పాత్రా ఉంటుంది. రాజకీయం కావచ్చు, స్థానిక వివాదాలు కావచ్చు అవి సాధారణంగా ఒక ముసుగులో జరుగుతాయి. అసలు విలన్ కూడా ముసుగులో ఉండిపోతాడు. శిక్కుల ఊచకోత అలా కాదు. మతఘర్షణలకు ప్రసిద్ధం కాని(దేశవిభజన నాటివి వదిలేస్తే) ఢిల్లీలో జరిగాయి. వాటికి ఒక స్పష్టమైన కారణం ఉంది. అది, ఇందిరాగాంధీ హత్య. వాటి వెనుక ఒక స్పష్టమైన విలన్ ఉన్నాడు. అది, కాంగ్రెస్ పార్టీ. అందులో రెండు పక్షాలు లేవు. అది పూర్తిగా ఏకపక్షం. కనుక శిక్కుల ఊచకోతను మామూలు మతఘర్షణల జాబితాలో చేర్చలేము. మూడువేలమందిని మట్టుపెట్టిన ఆ చర్యపై జనం స్పందన ఉండవలసినంత ఎందుకు లేదన్నదే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం.

      Delete
    2. బోనగిరి గారి వ్యాఖ్యపై...నాకు లీలగా ఏమనిపిస్తోందంటే, 2002 గుజరాత్ కు 1984 ఢిల్లీ ఒరవడి అయిందేమోనని...అత్యధిక మెజారిటీతో అధికారానికి ఎలా రావచ్చో 1984 ఢిల్లీ నిరూపించింది.

      Delete
    3. మీ ఊహ నిజం కాదు. అదే నిజమైతే బిజెపి వాళ్లు పాలించే రాష్ట్రాలలో మధ్యప్రదేశ్,చత్తిస్ ఘర్,గోవా లలో మూడు సార్లు వరుస విజయాలను కైవసం చేసుకొన్నారు. అక్కడ ఎమీ మతకలహాలు జరగలేదు. ఆ విషయం గమనించాలి.

      Delete
  3. మీడియా అల్లరి లేకపోవటం ఒక కారణం కావచ్చును.అంత అరాచకం జరిగిందా అని ఆశ్చర్యపోయ్యే వారిలో నేనూ ఉన్నాను. మరొకటి, అప్పటిదాకా పంజాబులో హిందువుల మీద జరిగిన అరాచకం కూడా ప్రజల ఉదాసీనతకి కారణం కావచ్చును. పొయ్యే రైలులో, బస్సులో నెత్తిన ముడి లేని వారిని ప్రక్కన నిలబెట్టి కాల్చివేసిన సంఘటనలు ఎన్నో పంజాబు అల్లర్లలో జరిగినాయి. ఇంకొకటి, కాంగ్రెస్సుకు ఉన్నంత నోరు మిగిలిన పార్టిలకి లేకపోవటం కూడా కావచ్చును. నిజానికి భారత్ పాకిస్తాన్‌ల విభజన కాలంలో జరిగిన అల్లర్లని, ఆ కాలంలో మరో పార్టీ ఉండి ఉంటే, ఆ పార్టీ ఖాతాలో వేసేసేవారే మన కాంగ్రెస్ వారు.

    ReplyDelete
    Replies
    1. పై మూడు వ్యాఖ్యలలో ఉమ్మడిగా ఉన్న అంశం మీడియా. మీడియాలో చాలా లోపాలున్న మాట నిజమే. మీడియా యాజమాన్యాలకు సొంత అజెండాలు ఉన్న మాటా నిజమే. సవాలక్ష లోపాలు ఉన్నప్పటికీ మిగతా రంగాలు ప్రజాస్వామ్యంలో తమ వంతు పాత్ర ఎలా నిర్వహిస్తున్నాయో, ఎలా నిర్వహించకతప్పదో అలాగే మీడియా కూడా నిర్వహిస్తోంది. ఒకటి గమనించండి...మోడీ కి వ్యతిరేకంగా పదేళ్ళు ప్రోపగాండా చేసిందని మీరు అన్న మీడియాయే ఇప్పుడు మోడీని ఫోకస్ చేస్తోంది. యూపీఏ అవినీతి ముఖాన్ని జనం ముందు చర్చకు పెట్టిందీ మీడియాయే. సొంత అజెండాలు ఎలా ఉన్నా అది కూడా జనం వెంట వెళ్లకు తప్పదు.

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. పై వ్యాఖ్యను తొలగించాను. నా అభిప్రాయం మీరు చదివారు.ఆ వ్యాఖ్య పర్పస్ అంతటితో అయిపోయింది. మీడీయాలో సిన్సియర్ గా పనిచేసిన వారిని తప్పు పట్టటం నా ఉద్దేశం కాదు. నాలాంటి మధ్యతరగతి వారికి నచ్చని విషయం, ఇంగ్లిష్ మీడీయా వారు దేశానికి లాభం కన్నా, నష్టం కలుగ జేస్తున్నారు. ఇది సుప్రీం కోర్ట్ జడ్జ్ గంగూలి వెంటపడి వేధించటం, కంచి శంకరాచార్య కేసు విషయాలలో స్పష్టంగా అర్థమైంది. కంచి శంకరాచార్య కేసేతీసుకోండి రోజుల తరబడి పగలు రాత్రి నిందారోఫణలు చేయటం కోర్ట్ క్లిన్ చిట్ ఇస్తే ఒక్క నిముషం ఆ వార్తను న్యుస్ లో చదివి చేయి దులుపుకోవటం. అది వరుస.

      Delete
  5. సిద్దార్థ్ వరదరాజన్ లాంటి విదేశీయులు భారత దేశ రాజకీయ నాయకులను ఎలా విమర్శిస్తారు?

    N. Ram denied that the move was prompted by the case filed by the BJP’s Subramanian Swamy on Varadarajan’s ineligibility to be editor of the paper because he is a US citizen, but admitted that it “was hanging like a sword over our heads”.

    http://www.livemint.com/Consumer/7Igh9ncxU6SfsvAg9sukZL/Siddharth-Varadarajan-resigns-from-The-Hindu.html

    వినొద్ మెహత ఇంకొక మేధావి.

    Mocking the news channels, he said "50% of their content should be taken as joke". "They also serve entertainment along with news," he said, and quipped: "I speak rubbish on TV debates, yet I'm called again." With great pride, Mehta shared he was the first person to start the trend of drinking during prime time TV debates.

    http://articles.timesofindia.indiatimes.com/2013-12-08/lucknow/44941132_1_narendra-modi-gujarat-riots-meena-kumari

    When an old pseudo-secularist like me says get ready for a Narendra Modi-led NDA government, you’d better believe it. Unless some divine agency intervenes, the Congress is heading for an electoral rout. The AAP, high on its initial success, seems unlikely to pose a serious challenge in the general election.

    http://www.outlookindia.com/article.aspx?288898

    ReplyDelete
  6. సరే, మీ అభిప్రాయాలూ మీవీ నా అభిప్రాయాలూ నావీ..వదిలేయండి. ఒకటి మాత్రం నాకు అర్థం కాలేదు. అంత డబ్బు ఉన్న బీజేపీ డబ్బు పడేసి (అదే యాడ్స్ రూపంలో) మీడియా నోరు ఎందుకు మూయించలేదు? పదేళ్ళపాటు ప్రోపగాండా ఎందుకు జరగనిచ్చింది? ఇప్పుడు మాత్రం అలాంటి మీడియాకు యాడ్స్ ఎందుకు ఇవ్వాలి? ఏమిటి ఇందులోని తర్కం?

    ReplyDelete
    Replies
    1. Bhaskaram gaaru,
      I am goning to answer your question now. Read this article carefully
      .
      http://www.sunday-guardian.com/news/obama-quietly-reverses-hillarys-get-modi-policy

      M D Nalapat holds the UNESCO Peace Chair and is Director of the Geopolitics and International Relations Department at Manipal University,an international private university headquartered in Southern India. The former Coordin in 1991, one of his mentors, P. V. Narasimha Rao, took over as prime minister and put together an informal group of friends, including Nalapat, to develop new ideas on economics and national security. Editor of the Times of India, Prof. Nalapat writes extensively on security, policy and international affairs.

      In 1991, one of his mentors, P. V. Narasimha Rao, took over as prime minister and put together an informal group of friends, including Nalapat, to develop new ideas on economics and national security

      Delete
    2. http://www.youtube.com/watch?v=4DxX1QFTZvU
      http://www.youtube.com/watch?v=vjJ-zpDbUCM
      http://www.youtube.com/watch?v=bqzNtuje9g4
      http://www.youtube.com/watch?v=0rjOo9Owllo
      http://www.mediacrooks.com/2014/02/the-saints-at-ndtv.html

      Delete
    3. భాస్కరం గారు,
      పైన ఇచ్చిన వివరాలత , ప్రాపగండా గురించి మీరడిగిన ప్రశ్నకు సమధానం లభించిందని నేనకుంట్టున్నాను. మోడి మీద ప్రాపగండా వేరే దేశాల పాలసి లో భాగం. దానిని అడ్డుకోవటానికి కేంద్ర లోని ప్రభుత్వం సహకరించి పోయి ఉండవచ్చేమో!

      ఇప్పుడు మాత్రం అలాంటి మీడియాకు యాడ్స్ ఎందుకు ఇవ్వాలి? ఏమిటి ఇందులోని తర్కం?
      ఇది చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలా ఉంది. సమాధానం ఇవ్వటం చాలా కష్టం.

      Delete
  7. మీరడిగిన ప్రశ్నలకి సమాధానాలు వీలు చూసుకొని ఇస్తాను. వివరంగా రాస్తే ఒక పుస్తకం అవుతుంది.
    మొదట పాలగుమ్మి సాయినాథ్ గారు ఇంగ్లిష్ మీడియా మీద ఇచ్చిన ఉపన్యాసం చూడండి.

    http://www.youtube.com/watch?v=AbjsQ_dYuJQ

    ReplyDelete