Thursday, October 23, 2014

మోడి ప్రభుత్వం ధరలు ఎలా తగ్గించగలిగింది?

నాకు గుర్తు ఉన్నంతవరకు 2010 నుంచీ ద్రవ్యోల్బణం ఎక్కువవడం ప్రారంభించింది. ఇన్నేళ్లలోనూ అది తగ్గిన దాఖలా లేదు. అప్పుడప్పుడు ఏ కొంచెమో తగ్గినట్టు అనిపించినా అది లెక్కలోది కాదు. ధరలు తగ్గాయి అనుకునేటంతగా ఎప్పుడూ తగ్గలేదు.

యూపీఏ ప్రభుత్వం అందుకు రకరకాల కారణాలు చెబుతూ వచ్చింది. ఆహారపదార్థాల ద్రవ్యోల్బణానికే వస్తే, ఆర్థిక స్తోమత పెరుగుతుండడం వల్ల ఇప్పుడు అన్ని తరగతుల వారూ పప్పులు, కూరగాయలు ఎక్కువగా వాడుతున్నారనీ, ఆవిధంగా ఆహారపదార్థాల వినియోగం పెరిగిందనీ, అందుకు తగ్గట్టు వాటి ఉత్పత్తి పెరగలేదనీ ఒక కారణం. ధరలు తగ్గించడం ఎక్కువగా రాష్ట్రప్రభుత్వాల పరిధిలోకి వస్తుందనీ, అవి తీసుకోవలసిన చర్యలు తీసుకోవడం లేదనీ ఇంకొక కారణం.

కానీ ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాగానే కొన్ని మాసాలలోనే ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయగలిగినట్టు చెబుతున్నారు. ఇదెలా జరిగిందో నిజంగా ఆశ్చర్యం. అయితే, యూపీఏ ప్రభుత్వం అన్నేళ్లలోనూ ఆ పని ఎందుకు చేయలేకపోయిందో, మోడీ ప్రభుత్వం ఎలా చేయగలిగిందో, అందుకు ఏం చేసిందో ఎవరైనా విశ్లేషించినట్టు నా దృష్టికి రాలేదు. అలాగే యూపీఏ లో సంబంధిత శాఖకు మంత్రిగా ఉన్న శరద్ పవార్ ఎక్కడ విఫలమయ్యారో కూడా ఎవరూ రాసినట్టు లేదు.

ఇంత అవసరమైన విషయం మీద పెద్దగా చర్చ కనిపించకపోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా విశ్లేషించి ఉంటే సంబంధిత లింక్ ఇవ్వగలరని కోరుతున్నాను. 

11 comments:

  1. Modi effect, not RBI, tames food inflation

    Prime Minister Modi went further, by ignoring pressure from powerful agriculture mafias comprising commodity speculators and "mock" farmers (i.e. those who stay in the city, but operate giant agricultural operations for profit and for tax purposes). He limited the levy ratio on rice mills to 25%, thereby freeing more grain for the market. These steps have damaged the ability of hoarders and speculators to boost prices, and have led to a cooling off of rice and wheat prices in the market, which has nothing to do with the RBI's textbook reliance on monetary policy as a dampener to inflation, despite overwhelming empirical evidence to the contrary.

    Senior officials say that there is "great chemistry" between Prime Minister Modi and US President Barack Obama, and that work on reconciling the positions of the US and India on the WTO standoff began immediately after the PM's meeting with Obama, subsequent to India's refusing to ratify the Trade Facilitation Agreement without ensuring food security safeguards for its poor. Officials said that "backroom negotiations in Geneva took place between the two sides", and that "Obama finally asked his team to agree to Prime Minister Modi's request for a permanent waiver rather than just a 4-year peace clause". This request had been conveyed by Modi to Obama in their September meeting in the White House. These officials say that the PM is keen to ensure that "other anomalies" get corrected, such as "outdated reference prices used to calculate subsidies"
    Senior officials say that they have been "energised by the innovative approach of Prime Minister Modi", which they compare to the "Can't Do Much" approach of his predecessor, and look towards success in other negotiations, such as crafting a stable and mutually beneficial relationship with China and winning India a permanent seat in the UN Security Council

    http://www.sunday-guardian.com/news/modi-effect-not-rbi-tames-food-inflation

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీ రామ్ గారూ...మంచి సమాచారం ఇచ్చారు. మీడియాలో బాగా ఫోకస్ అవాల్సిన సమాచారం ఇది. అలాగే శరద్ పవార్ లాంటి వాళ్ళ performance గురించిన వివరాలు, విశ్లేషణలు రావాలి. రకరకాల మాఫియాలతో రాజకీయ, ప్రభుత్వ వర్గాల అక్రమ nexus ను మోడీ పూర్తిగా ఛేదించగలిగితే అంతకంటే కావలసింది ఉండదు.

      Delete
  2. భాస్కరం గారు,
    నేను ఉండే సిటిలో, రిలయన్స్ ఫ్రెష్ లో గత సంవత్సరం తో పోలిస్తే కిలో సోనా మసురి బియ్యం 60 రూపాయలా నుంచి 46 రూపాయలకు వచ్చింది.
    మోడి ప్రధాని గా చెప్పట్టిన తరువాత కొన్ని నిర్ణయాలు తీసుకొన్నారు. అవి అమలు జరగటానికి ఒక సంవత్సర కాలం పడుతుందని, అవి తప్పక మంచి ఫలితాలు ఇస్తాయని ఈ వ్యాస రచయిత రాశారు. అందులో ఒకటి దేశంలోని వివిధ మార్కేట్లు,గిడ్డంగుల్లో ఉన్న నిల్వల గురించి, సప్లై చైన్ గురించిన సమాచారంతెలుసుకోవటానికి ఒక సాఫ్ట్ వేర్ అప్లికేషన్ డెవెలప్ చేస్తున్నట్లు తెలిపారు. దానిని ఉపయోగించి ఏ రాష్ట్రంలో నైనా, మార్కేట్ లో అయినా ఎవరైనా కిరికిరి చేస్తూంటే, ప్రధాని కార్యాలయం వారు ఇతరులపై రిపోర్ట్ ల కొరకు ఆధారపడకుండా చిటికేలో పట్టేయవచ్చని రాశారు.

    ReplyDelete
    Replies
    1. శ్రీరామ్ గారూ...వ్యాసం చదివాను. అయిదేళ్ళలో upa ప్రభుత్వం చేయలేకపోయిన పనిని అయిదు నెలలలో మోడీ ప్రభుత్వం చేయడం ఆశ్చర్యం కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వాలు msp పెంచడం వల్ల సరకు లభ్యత ఎలా తగ్గిందో, ధరలు ఎలా పెరిగాయో అర్థం కాలేదు. రాష్ట్రాలను msp పెంచకుండా మోడీ ఎలా నివారించారో? ఇంకొంచెం వివరణ అవసరమనిపించింది.

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. నమో ప్రభుత్వం వచ్చిన తరువాత సాధించిన ఇంకొక ఘనవిజయం ఉందండి. శ్రీలంకతో సత్సంసంబంధాలను పున్రుద్దరించారు. మైత్రి హస్తాన్ని అందించి, చైనా ప్రభావాన్ని అడ్డుకట్ట వేయటానికి మోడి ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఈ విషయంలో సుబ్రమణ్యస్వామి కృషి మరువలేనిది. తమిళ రాజకీయా పార్టిల ద్వంద్వ విధానం, మనదేశానికి తీవ్ర నష్టం తెచ్చే వరకు వెళిపోయాయి. రాజకీయ లబ్ది కోసం తమిళ సమస్యను అడ్డుపెట్టుకొని ప్రజలను రెచ్చ గొడుతూ, దేశ ప్రజలని పక్క దారి పట్టించే తమిళ రాజకీయ నాయకుల కపట స్వభానికి అందరికి తెలిసి వచ్చేలా చేసి, వారి ఆటలను కట్టించారు. తమిళ జాలర్లు మరపడవల సహాయంతో బంగాళ ఖాతం లో మత్స సంపదను ఖాళీ చేసేశారు. వీరే శ్రీలంక భాగంలో చేపలు పడుతూ వారి పొట్టకొట్టే వారు. వీరిని శ్రీలంక ప్రభుత్వం జాలర్ల ను అరెస్ట్ చేస్తే దానిని తమిళ సమస్య గా చిత్రికరిస్తూ వచ్చారు. వాస్తవానికి ఈ మరపడవలలో అధికర,ప్రతిపక్ష పార్టిల రాజకీయ నాయకులవి ఉన్నాయని స్వామి ఆరోపణ. తమిళ మత్సకారుల అరెస్ట్ ను నడ్డుపెట్టుకొని గోల చేసే, డ్రామని చూసి చూసి విసుగెత్తిన సుబ్రమణ్య స్వామి, ప్రధానితో అనుమతి తీసుకొని రాజపక్ష ను కలసిశారు. స్వామితో చర్చల అనంతరం శ్రీలంక ప్రభుత్వం జలర్లను మాత్రం విడిచిపెట్టింది. మరపడవలు శ్రీలంక ప్రభుత్వం ఆధినంలో ఉండిపోయాయి. మరపడవలు, ఆదాయం పోయాయన్న కసి, కోపంతో రెండు పార్టిల వారు ఏకమై అర్ణబ్ గోస్వామి ఆధ్వర్యంలో సుబ్రమణ్య స్వామి మీద దాడికి దిగారు. దానిని ఆయన తిప్పికొట్టాడు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం విదేశీ సంబంధాలలో ప్రాంతీయ పార్టిల అభిప్రాయలను పరిగణించదు అని గట్టి సందేశం పంపారు.
    శ్రీలంకలో మత్స్యపరిశ్రమ
    శ్రీలంక జనాభా రెండు కోట్లు. దానిలో 12% మంది అనగా 24 లక్షల మంది మత్స్యపరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. సగటున శ్రీలంక పౌరుడు ఏడాదికి 24 కిలోల చేపలు తింటాడు. ఎల్‌టిటిఇ ప్రాబల్యం క్షీణించి, సాధారణ పరిస్థితులు వచ్చాక ఆర్థికవ్యవస్థ కుదుటపడసాగింది. వాళ్లు వెంటనే ఖరీదైన వలలు కొని చేపల వేటకు ఉద్యమించారు. కానీ భారతీయుల మరపడవల కారణంగా ఆ వలలు చిరిగిపోసాగాయి. శ్రీలంక జాలర్ల ఆదాయం దెబ్బ తింది, అప్పులు పెరిగాయి. తమిళనాడు జాలర్లు వాళ్ల జలాల్లో వేటకు వచ్చినపుడు వాళ్లు యింట్లో కూర్చోవడమో, లేక తీరం దగ్గరే చేపలు పట్టడమో చేస్తున్నారు. వాళ్లు 40 వేల మెట్రిక్‌ టన్నుల చేపలు పడుతుంటే తమిళనాడు జాలర్లు వారి కంటె రెట్టింపు, కరక్టుగా చెప్పాలంటే 85 వేల టన్నులు పట్టుకుంటున్నారు.రు.

    http://telugu.greatandhra.com/articles/mbs/mbs-srilanka-lo-matyaparisrama-57124.html
    Please watch below debate you will get clear picture.

    The Newshour Debate: 3rd September 2014
    https://www.youtube.com/watch?v=75W9RtK2zno

    To be continued ...

    ReplyDelete
  5. శ్రీలంక తో దౌత్య విజయం వెనుక స్వామి కృషి ఎంతో ఉంది.
    దౌత్యం నెగ్గింది!
    http://andhrabhoomi.net/content/sampadhakiyam-11

    ఆయనకు వ్యతిరేకులు పసలేని అనవసర ఆరోపణలు ఎన్నో చేశారు. అర్ణబ్ గోస్వామి అంశాన్ని తప్పుద్రోవపట్టించేందుకు ప్రయత్నించారు. స్వామి అతనిని స్టుపిడ్, లైయర్ అని సంభోదిస్తూ షో పొడుగునా తిట్టారు.

    https://www.youtube.com/watch?v=u_d-4gtGVTg

    ReplyDelete
    Replies
    1. శ్రీరామ్ గారూ...తమిళ జాలర్లను విడిపించడంలో మోడి ప్రభుత్వం విజయం సాధించడం మీరన్నట్టు దౌత్యవిజయమే నండీ...కానీ సత్సబంధాలను పునరుద్ధరించింది అని అప్పుడే అనలేమేమో! ఇంకా వేచి చూడాలి. శ్రీలంక, నేపాల్ ల మీద చైనా ప్రభావం చాలా కాలంగా ఉంది. ఆ ప్రభావాన్ని తగ్గించి పూర్తిగా వాటిని మనవైపు తిప్పుకోవడం పెద్ద సవాలు అవుతుంది. తమిళుల విషయంలో ఇక్కడ objective గా చూడాల్సిన విషయాలు ఉన్నాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కారణంగా తమిళ పార్టీలు 30 ఏళ్లుగా కేంద్రాన్ని అనుచితంగా ప్రభావితం చేస్తూ వచ్చాయి. మమతా బెనర్జీ కూడా బంగ్లాదేశ్ విషయంలో అదే చేసింది. ఇప్పుడు కేంద్రంలో పూర్తి సంఖ్యాధిక్యంతో తిరుగులేని ప్రధానిగా మోడీ కి ఇంతకుముందున్న ప్రధానులకు లేని వెసులుబాటు లభించింది. అలాగని తమిళులను కానీ, బెంగాలీలను కానీ పూర్తిగా కాదనే పరిస్థితికి వెడితే కొత్త సమస్యలు వస్తాయి. political management అవసరమవుతుంది. తమిళ పార్టీల తీరు మీరన్నట్టే ఉన్నా దానిని మరీ ఎత్తి చూపడం పోలిటికల్లీ కరెక్టు కాబోదని చెప్పడమే నా ఉద్దేశం. మోడీ ఈ విషయంలో చాకచక్యంగా వ్యవహరించినా కిందిస్థాయిలో కూడా ఆ చాకచక్యాన్ని చూపకపోతే wrong message వెడుతుంది.

      Delete
    2. శ్రీలంక సమస్యపై జాన్ అబ్రహం మద్రాస్ కేఫే అనే సినేమా ను చాలా బాగా తీశాడు. వీలైతే దానిని చూడండి. శ్రీలంక పైన చైనా ప్రభావం పెరగటానికి తమిళ పార్టిలే ముఖ్యకారణం. యు.పి.ఏ.ప్రభుత్వంలో ఉంట్టు ఆదేశానికి ఏ విధమైన సహాయం చేయకుండా మనదేశాన్ని అడ్డుకొనే వారు. దీనిని చైనా అవకాశంగా తీసుకొని, ఆ దేశంలో పోర్ట్ కట్టటం లాంటి పనులను చేపట్టింది. తమిళ నాడులో ఉన్నని రాజకీయ పార్టి లు దేశంలో ఇంకెక్కడ ఉండవేమో! కులానికొక పార్టి ఉంది. ఇవి గాక కాంగ్రెస్,బిజెపి,రెండు కమ్యునిస్ట్ పార్టిలు, ముపనార్ కొడుకు కాంగ్రెస్ పార్టి అదనం. ఈసారి ఎన్నికలకి అక్కడ ఒక రెండూ మూడు పార్టిల కింద ఓట్లు కన్సాలిడేట్ అవుతాయి. అది రాజకీయాలను మారుస్తుంది. అక్కడ రాజకీయాలలో ఇప్పటివరకు ఏటువంటి మార్పులు రాకపోకపోవటానికి కారణం నాయకులు వృద్దులైనా పదవులు వదలకపోవటం, ఇంకా చెప్పాలి అంటే వయసు పై బడిపోయినా జీవిస్తూండటం కారణం.ద్రవిడ పార్టిల యువనేతలకే 60ఏళ్లు దాటాయి. అంతర్యుద్దం తరువాత ఆసియా దేశాలలో శ్రీలంక చాలా త్వరగా అభివృద్ది చెందుతున్నాది. అంతే కాక పక్కదేశాలతో మనకి సత్సంబంధాలు చాలా అవసరం. దీనిని దృష్టిలో ఊంచుకొనే మొదటి నుంచి రాజపక్సే మీద అంతార్జాతీయంగా వచ్చిన ఒత్తిడులను మొదటి నుంచి సుబ్రమణ్యస్వామి పరిషకరిస్తూండేవారు.

      నేపాల్ తో భారత సంబంధాలు ప్రచండ అధికారంలోకి వచ్చినపుడు ఒడిదుడుకులకు లోనైనాయి. కాని ఆయన పార్టి మొన్న జరిగిన ఎన్నికలలో పెద్ద విజయాలను సాధించలేదు. మునుపటి వ్యతిరేకత కూడ తగ్గినట్లు ఉంది. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే చైనాకి వెళ్లలేదు, డిల్లికి వచ్చి అక్కడి ఆసుపత్రిలో చికిత్స చేయించుకొన్నారు. అంతేకాదు మొన్న మోడి నేపాల్ పర్యటన సందర్భంగా జరిగిన మీటీంగ్ లో ప్రచండ హాజరయ్యారు.
      We had a very fruitful meeting. A new initiative has begun in relations of India and Nepal. It is really historic," the former Prime Minister of Nepal said

      http://www.thehindu.com/news/national/nepal-maoist-leader-prachanda-calls-on-modi/article6280190.ece

      Delete
    3. "అక్కడ రాజకీయాలలో ఇప్పటివరకు ఏటువంటి మార్పులు రాకపోకపోవటానికి కారణం నాయకులు వృద్దులైనా పదవులు వదలకపోవటం, ఇంకా చెప్పాలి అంటే వయసు పై బడిపోయినా జీవిస్తూండటం"
      ప్రజాస్వామ్యాన్ని అంటిపెట్టుకుని ఉండే necessary evils కొన్ని ఉంటాయండి...భరించక తప్పదు. తమిళ జాలర్ల విడుదల విషయంలో సల్మాన్ ఖాన్-రజత్ శర్మల ప్రమేయం గురించి కూడా ఈ రోజు హిందూలో వార్త వచ్చింది. చూసి ఉంటారనుకుంటాను.

      Delete
    4. ఇప్పుడే చదివానండి. సల్మాన్ ఖాన్ కు అంత పలుకబడి ఉంటే మోడి సుష్మాను తీసి యక్స్ టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా సల్మాన్ ఖాన్ ను నియమిస్తే సరిపోతుంది :) ఆయనకి గల్ఫ్, యురోప్ దేశాలలో ఇంకా ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆ వార్త సుబ్రమణ్య స్వామి లాంటివారి పాత్రను తక్కువగా చేయటానికి రాసిందని నా అనుమానం. మొదటి లైన్లో తెలివిగా సినేమా నటుల పేరును రాసి, కింద ఎక్కడో స్వామి పేరు రాయటం గమనిస్తే ఆ వార్త ఉద్దేశం ఎమిటో అర్థం అవుతుంది. పోని సల్మాన్ చేసింది ఎమిటి? perhaps "unknowingly", played an "indirect role" in the release. ఆయన పేరు వాడుకోవటమే గాని పుర్తి క్రెడిట్ ఇవ్వలేదు. ఇటువంటి ట్రిక్స్ మోడి మీద, స్వామి మీదా మీడీయా వాళ్లు ప్రయోగిస్తూంటారు. మోడి ప్రధాని అయ్యాడు గనుక అతనిని కవర్ చేయటం తప్పదు. స్వామి కి ఈ బాధ తప్పదు. హిందులో సిద్దార్థ్ వరదరాజన్ ఏడిటర్ గా ఉన్నపుడు స్వామి వార్తలను ప్రచూరించే వాడే కాదు. అలాగే మోడి ప్రధాని అభ్యర్ధిగా తమిళనాడుకి వస్తే ఆ వార్తను మధ్య పేజిలో ఎక్కడో ప్రచూరించటం చేసేవాడు. ఆ విషయం చిలికి చిలికి పెద్దదై వాళ్లు ఆయనపై చర్య తీసుకొన్నట్లు చదివాను.

      Delete