Friday, October 24, 2014

జార్జి ఫెర్నాండెజ్...అబ్దుల్ కలాం...వాజ్ పేయి...ఎలా ఉన్నారు?

మాజీ రక్షణమంత్రి, ప్రముఖ సోషలిస్టు నాయకుడు, బరోడా డైనమైట్ కేసు నిందితుడు జార్జి ఫెర్నాండెజ్ ఎలా ఉన్నారు? ఆయన గురించి ఈ మధ్య ఎలాంటి వార్తా లేదు. బెంగళూరులో ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్టు మాత్రం చాలా కాలం క్రితం ఒక వార్తా విన్నాం. అంతే. మళ్ళీ ఆయన గురించి ఎలాంటి సమాచారం లేదు.

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి కూడా ఈ మధ్య వార్తలు లేవు. ఆయన ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో? ఆ మధ్య వరకు ఆయన విద్యార్థులతో అప్పుడప్పుడు ఇంటెరాక్ట్ అవుతూ వార్తలలో ఉండేవారు. ఇప్పుడు ఆయన గురించి ఏ సమాచారమూ లేదు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గురించి  గట్టిగా ఏదైనా వార్త వచ్చిఅయిదేళ్లు అయిందేమో! ఈ మధ్య మోడి ప్రధాని అయిన తర్వాత వాజ్ పేయి ఇంటికి వెళ్ళి ఆయనను సందర్శించినట్టు వార్త వచ్చింది. అదొక్కటే ఆయనతో ముడిపడిన  చిట్టచివరి వార్త.

బొత్తిగా వార్తలలోలేని ఈ ముగ్గురు ప్రముఖులే ప్రస్తుతానికి నాకు గుర్తొస్తున్నారు. ఇంకా చాలామందే ఉండచ్చు. ఇలాంటి వార్తలలోలేని ప్రముఖులు/ లేదా ఒకమాదిరి ప్రముఖులు  పదిమందితో ఒక జాబితా తయారు చేయచ్చా?

మీరూ ప్రయత్నించండి. 

6 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ఈ నెల 6 వ తేదీన అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ను చహంద్రబాబు నాయుడు తొ కలిసి మాజి రాష్త్రపతి అబ్దుల్ కలాం ప్రారంభించారు ఆ కార్యక్రం విశేషాలకై క్రింది లింక్స్ ను క్లిక్ చేయండి
    http://gallery.oneindia.com/news-in-pics/apj-abdul-kalam-inaugurates-agricultural-mission/photos-c44-e49530-p500119.html

    www.youtube.com/watch?v=iFu2QRNc5D4

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ ప్రసాద్ గారూ...

      Delete
    2. తాజాగా ఇంకో పేరు గుర్తొచ్చింది. ఆయన మాజీ ఎన్నికల ప్రధానాధికారి టి.ఎన్. శేషన్.

      Delete
  3. out of sight ,out of mind.similarly out of scene and prominence ,out of news.

    ReplyDelete
  4. పాపం! నోరుతెరిచి మాట్లాడలేని వాళ్ళంటే మీడియాకి కూడ చులకన అనుకుంటా, వాళ్ళు కూడ మర్చిపోయారు.

    ReplyDelete