మీడియాను, బీజేపీని ఉద్దేశించి నేను రాసిన కొన్ని బ్లాగులపై శివరామప్రసాదు కప్పగంతు , ‘గడ్కరీ సేవలో...’ అనే బ్లాగ్ పై శ్రీనివాస్ అనే వీక్షకుడూ స్పందించారు. ఇద్దరికీ ధన్యవాదాలు.
మీడియా వ్యవహారశైలిని శివరామప్రసాదు వేలెత్తి చూపించారు. మీడియా
పని తీరులో లోపాలు ఉన్న సంగతిని నేను కూడా నా బ్లాగులలో ప్రస్తావిస్తూనే ఉన్నాను. అయితే
మీడియా ఎంతసేపూ బీజేపీనే లక్ష్యం చేసుకుంటూ ఉంటుందనీ,
కాంగ్రెస్ పై అభిమానం చూపిస్తూ ఉంటుందనీ, కాంగ్రెస్ కు మీడియా
మేనేజ్ మెంట్ బాగా తెలుసుననీ, బీజేపీకి అది చేతకాదనీ శివరామప్రసాదు అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవాలు ఆ అభిప్రాయాన్ని సమర్థించేలా లేవు.
మరీ వెనకటి కాలానికి వెళ్లనవసరం లేదు. గత మూడున్నర దశాబ్దాల
చరిత్రనే గమనిస్తే, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని
కూడగట్టడంలో మీడియా ఎంత ముఖ్య భూమిక పోషించిందో మనకు తెలుసు. అలాగే, రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ పై విపక్షాలతో గొంతు కలిపి, తదుపరి ఎన్నికల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మీడియా పాత్ర
తక్కువేమీ కాదు. నిన్నటికి నిన్న, కామన్వెల్త్ క్రీడలు, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, సీవీసీ నియామకం, దయానిధి మారన్ పై ఆరోపణలు వగైరా అనేక విషయాలలో దాదాపు ఏణ్ణర్థంపాటు యూపీఏ
ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోనివ్వకుండా దాడి చేసిందీ, ఇప్పటికీ
చేస్తున్నదీ మీడియానే. నిజం చెప్పాలంటే ప్రతిపక్షాల కన్నా ఎక్కువగా ప్రతిపక్షపాత్ర
పోషిస్తున్నది మీడియానే. అంతేకాదు, విపక్షాల వైఫల్యం నుంచి పుట్టిన
పౌరసమాజ ఉద్యమంపై ఫోకస్ చేసి ప్రాచుర్యంలోకి తెచ్చింది కూడా మీడియానే అన్న సంగతినీ
గుర్తుపెట్టుకోవాలి.
మీడియాలో లెక్కలేనన్ని లోపాలూ,
లొసుగులూ ఉన్నమాట నిజం. సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. వాటితోపాటే
ఇతరేతర వాస్తవాలనూ ఉన్నవున్నట్టు అంగీకరిద్దాం.
కాకపోతే కాంగ్రెస్, బీజేపీల విషయంలో ఒక తేడాను దృష్టిలో ఉంచుకోక
తప్పదు. కాంగ్రెస్ అవినీతి గురించి అరవై ఏళ్లుగా చెప్పుకుంటున్నాం. నిజానికి ఇంకా ముందు
నుంచే. కాంగ్రెస్ అధికారంలో స్థిరపడే కంటె ముందే అవినీతిలో కూరుకుపోయిందన్న విమర్శలు
గాంధీ జీవించి ఉండగానే వెల్లువెత్తాయి. బ్రిటిష్ దమనకాండకు కూడా భయపడని అంతటి గాంధీజీని సైతం భయభ్రాంతం చేసిన అవినీతి ఇది.
ఆ మాట ఆయనే చెప్పుకున్నాడు. దేశమంతా స్వాతంత్ర్యోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో గాంధీ
తలమునకలైంది, ఇలాంటి కాంగ్రెస్ ను ఏం చేయాలనే. అందుకు సంబంధించిన ముసాయిదాను ఆయన ఖరారు చేసింది సరిగ్గా హత్యకు గురయ్యే రోజునే.
ఇదంతా చరిత్ర. ఇన్నేళ్లలోనూ అవినీతి ఆరోపణల వెలుగులో కాంగ్రెస్ తనను తాను సరిదిద్దుకోలేదు
సరికదా; ఆరోపణలను తట్టుకొనే రెసిస్టెన్స్ ను సహస్రాధికంగా పెంచుకోగలిగింది.
కాంగ్రెస్ తో పోల్చితే బీజేపీ ‘అవినీతి’ ఇటీవలిది. కనుక మీడియా ఫోకస్ సహజంగానే
ఎక్కువగా ఉంటుంది. అలాగని కాంగ్రెస్ ‘అవినీతి’ని మీడియా విస్మరించిందనడానికి ఆధారం లేదు. గడ్కరీ వ్యవహారంతోపాటే
వీరభద్రసింగ్ పై అవినీతి ఆరోపణలనూ సవివరంగా రిపోర్ట్ చేసింది. అంతకు ముందు రాబర్ట్
వద్రా, సల్మాన్ ఖుర్షీద్ లపై ఆరోపణలకూ ఇవ్వవలసినంత జాగా ఇచ్చింది.
బీజేపీ ‘అవినీతి’ని ప్రశ్నిస్తే, కాంగ్రెస్ ‘అవినీతి’ సంగతేమిటని
విద్యావంతవర్గం కూడా ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆశ్చర్యం చిన్న మాట. వాస్తవానికి
ఆందోళన కలిగిస్తుంది. నాటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ లక్ష రూపాయలు తీసుకుంటూ
రహస్య కెమెరాకు చిక్కినప్పుడు ఆయనను వెనకేసుకువస్తూ ఆంగ్ల విద్యావంతులు అనేకమంది హిందూ
లాంటి పత్రికకు సంపాదక లేఖలు రాసిన ఉదాహరణ కూడా మనముందు ఉంది. ఇలాంటి విడ్డూరపు మనస్తత్వాన్ని
విశ్లేషిస్తూ అప్పట్లో నేను రాసిన వ్యాసాన్ని త్వరలోనే పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.
ఆర్.ఎస్.ఎస్. పై నా బ్లాగ్ చవకబారుగా ఉందని ఒకరు(శ్రీనివాస్)
ఆవేశపడ్డారు. తెలుగులో ఇంత చవకబారు వ్యాసం ఎప్పుడూ చదవలేదని అన్నారు. అభిమానపు రంగుటద్దాలను
ఒకసారి తీసి చూడండి...చవకబారుతనం నా వ్యాసంలో ఉందో, ఆ వ్యాసానికి సందర్భమైన
సంఘ్ వ్యవహరణలో ఉందో మీకే తెలుస్తుంది. గడ్కరీపై ఆరోపణలను మొదట మీడియా కుట్ర అనడం, ఆ తర్వాత మోడి కుట్ర అనడం, గురుమూర్తి క్లీన్ చిట్ ఇవ్వడం; అంతకంటే ఘోరంగా ప్రైవేట్ ‘అవినీతి’కీ పబ్లిక్ ‘అవినీతి’కీ మధ్య తేడా
ఉందని రాజ్ నాథ్ సింగ్ ప్రభృతులు అనడం చాలా ‘ఉదాత్తం’గా ఉన్నాయనీ, నా వ్యాసం మాత్రమే చవకబారుగా ఉందనీ అంటే; ఉదాత్తం, చవకబారు అనే రెండు మాటలకూ అర్థం మార్చుకోవలసిందే.
ఇంకో విషయం. సంఘ్ కు ప్రాంతీయతత్వాన్ని, కులతత్వాన్ని నేను ఆపాదించలేదు. మరోసారి నా బ్లాగ్ జాగ్రత్తగా చూడండి. స్వపన్ దాస్ గుప్తాను నేను ఉటంకించాను. పైగా బీజేపీని, సంఘ్ పరివార్ ను గట్టిగా సమర్థించే పాత్రికేయుడుగా స్వపన్ దాస్ గుప్తా సుప్రసిద్ధుడు.
ఇంకో విషయం. సంఘ్ కు ప్రాంతీయతత్వాన్ని, కులతత్వాన్ని నేను ఆపాదించలేదు. మరోసారి నా బ్లాగ్ జాగ్రత్తగా చూడండి. స్వపన్ దాస్ గుప్తాను నేను ఉటంకించాను. పైగా బీజేపీని, సంఘ్ పరివార్ ను గట్టిగా సమర్థించే పాత్రికేయుడుగా స్వపన్ దాస్ గుప్తా సుప్రసిద్ధుడు.
ఇక, ‘లోపలి మనిషి’ పీవీ గురించిన రచన కాదు. పీవీ యే రచించిన ‘ది ఇన్ సైడర్’ కు తెలుగు అనువాదం.
నేను పెద్ద వ్యాఖ్య రాసాను. అది ప్రచూరించే టప్పుడు కొన్నికారణాలవలన మొత్తం పోయింది. క్లుప్తంగా చెప్పాలి అంటే. నేను సంఘ్ వాడిని కాను. సంఘ్ లో విభేదాలు ఉండకుడదని ఎమీ రూల్ లేదు కదా!సంఘ్ గురించి మీరు రాసినది అంగీకరించను. నిజానిజాలు కాలమే తేలుస్తుంది.
ReplyDeleteఅదేలా అంటే ఒక ఉదాహరణ, అవిశ్వాస తీర్మానం పెట్టినపుడల్లా పివి గారు పార్టిలను చీల్చేవారు. అది ఎంత వరకు వెళ్ళిందంటే, ఆయన ప్రభుత్వం పైన అవిశ్వాసం అంటే ఎవరి పార్టిలోనో చీలిపోవటం ఖాయం అని దేశప్రజలు ఒక నిర్దారణ కి వచ్చేవారు. పివి గారు అలా చేయటం గురించి మీడీయా వారు రకరకాలుగా విశ్లేషణ చేసేవారు. కాని చరిత్ర తిరిగి చూస్తే పి వి గారు తీసుకొన్న ప్రతినిర్ణయం వెనుక దేశక్షేమం గురించి ఆలోచించిన కోణం ఉంది. సంఘ్ మీద మీరుచెసిన ప్రాంతీయ,కుల కోణంలో ని ఆరోపణలు భవిషత్ తేలుస్తుంది.
మీడీయా అని 30సం|| క్రితం మీడీయాని కలిపేస్తున్నారు. గత పది సం|| ఎన్నో మార్పులకు లోనైంది. 2జి కేసులో ప్రముఖ మీడీయా సంస్థలు చేసింది ఎమీ లేదు (CNN-IBN,NDTV, HT,TOI మొద|| )అంతా అయిన ఆరునెలలకు రంగంలో దిగి ఎదో చేసినట్లు పోజులు కొట్టారు. CNN-IBN,NDTV ఆరెండు చానల్స్ కాంగ్రెస్ పార్టి కి వత్తాసు పలుకుతాయని తెలిసిన విషయం.HT,TOI ల గురించి ఇక చెప్పనవసరంలేదు.
సంఘ్ కు, పీవీకి పోలిక తీసుకురాలేం. పీవీ రాజకీయాలలో ఉన్నారు. రాజకీయాలలో ఉన్నవారికి కొంతవరకు పోలిటికల్ ప్లే కు స్వేచ్ఛ ఇవ్వవలసిందే. పీవీ విషయంలో అప్పట్లో నేను అలాగే వాదించాను. పోలిటికల్ మేనేజ్ మెంట్ లో భాగంగా పార్టీలను చీల్చడం, కలపడం అనైతికం అని నేను అనుకోను. అయితే దేశక్షేమం కోసం ఏం చేసినా చెల్లుతుందన్న అభిప్రాయాన్ని అన్ని సందర్భాలకూ, అందరి విషయంలోనూ అన్వయించలేం. లక్ష్యమే కాదు, లక్ష్య సాధనకు ఉపయోగించే సాధనమూ మంచిదై ఉండాలన్న నీతి ఎక్కువ సందర్భాలకు వర్తిస్తుంది. సంఘ్ కు ఉన్న ఇమేజ్ భిన్నమైంది. కొన్ని వ్యవస్థలు సక్రమంగా వ్యవహరించడమేకాడు, వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయం కలిగించడమూ అవసరం. ఇక మీడియాలో అప్పటికీ ఇప్పటికీ గొప్ప తేడాలు వచ్చాయని నేను అనుకోను.
Deleteమీడియాకు రాజకీయ పాక్షికత లాంటివి ఎప్పుడూ ఉన్నాయి. నీలంరాజు వెంకట శేషయ్య వంటి వెనకటి తరం సంపాదకుడు అన్న మాట ఇది. బోఫోర్స్ వగైరాలపై కాంగ్రెస్ తో యుద్ధానికి అరుణ్ సౌరీని వాడుకున్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యాజమాన్యం వీపీ సింగ్ ప్రభుత్వం రాగానే ఆయనను తప్పించిందన్న వ్యాఖ్య అప్పట్లో వినిపించింది. కాకపోతే ఎలక్ట్రానిక్ మీడియా విస్తరణ వల్ల, పోటీ వల్ల ప్రతిదానినీ మోతాదును మించి సంచలనాత్మకం చేయడం, కొన్ని విలువలు పలచబారడం జరగచ్చు కానీ మౌలికంగా మీడియా పని తీరులో అప్పటికీ ఇప్పటికీ గొప్ప మార్పు వచ్చిందని అనుకొను.
Delete"రాజకీయాలలో ఉన్నవారికి కొంతవరకు పోలిటికల్ ప్లే కు స్వేచ్ఛ ఇవ్వవలసిందే."
Deleteమీరు పోలిటికల్ మేనేజ్ మెంట్ లో భాగంగా పార్టీలను చీల్చడం చూసారు. అది మీ పరిణతిని సూచిస్తుంది. కాని చాలా మంది ప్రజలు రాజకీయ నాయకులు తయారు చేసిన చట్టాలను వాళ్ళే తూట్లు పొడవటం గా చూస్తారు. ముఖ్యం గా మీడీయా వారు అలా ప్రచారం చేస్తారు. పి.వి. కూడా అందరి రాజకీయనాయకుల వంటివాడే అని ప్రజలలో తప్పుడు సంకేతాలు పంపుతుంది. ప్రజల పర్సెప్షన్ వాస్తవానికి విరుద్దంగా క్రియేట్ చేస్తుంది. నేను ఇచ్చిన ఉదాహరణ పర్సెప్షన్ సంబందించినది.
"లక్ష్యమే కాదు, లక్ష్య సాధనకు ఉపయోగించే సాధనమూ మంచిదై ఉండాలన్న నీతి ఎక్కువ సందర్భాలకు వర్తిస్తుంది. సంఘ్ కు ఉన్న ఇమేజ్ భిన్నమైంది."
సంఘ్ వాళ్ళ ఇమేజ్ ని డామేజ్ చేసుకొనే పని ( అది కూడా అవినితి విషయంలో) చేయరనే నేను నమ్ముతాను. దానికనుగుణంగా వాళ్ళు గురుముర్తి చేత నిజానిజాలు తెలుసుకొనే దానికి ప్రయత్నించారు. ఆయన తన అభిప్రాయలను స్పష్టంగా చెప్పాడు. నితిన్ గడ్కరిమీద ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదని.
"కొన్ని వ్యవస్థలు సక్రమంగా వ్యవహరించడమేకాడు, వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయం కలిగించడమూ అవసరం."
ఇది చెప్పినంత తేలిక కాదు,అమలు చేయాలంటే. అందులోను జాతీయ రాజకీయాలలో. దానిపైన విదేశాల జరిగే మార్పులు ప్రభావం కూడా ఉంట్టుంది. మన్మోహన్ గారు పి.వి. మీద కేసులు నమోదుచేసినపుడు మీరన్నమాటే అన్నాడు. కాని ఆయనని ఇప్పుడు సుప్రీం కోర్ట్ నుంచి సామాన్య ప్రజల వరకు ఈసడిస్తున్నా, దిగిపొమ్మనిఅంట్టున్నాపదవిని పట్టుకొని వేళాడుతున్నాడు. అదే ఆరోజున పివిని కామేంట్ చేశాడు.
మీడియాకు రాజకీయ పాక్షిపాతం ఉండవచ్చు. అందులో కన్సిస్టేన్సి ఉండాలి. తెలుగులో ఆంధ్రభూమి పేపర్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టిని సమర్దిస్తుంది అలా. అదే జాతీయ ఇంగ్లిష్ మీడీయా వారి కథే వేరు. ప్రతి స్కాం కి పార్టిలను మారుస్తుంది. ఇంగ్లిష్ మీడీయాలో ఒక్క అర్ణబ్ గోస్వామి తప్ప. అర్నబ్ గోస్వామి అడిగే ప్రశ్నలతో మధ్య తరగతి వాళ్ళు కనేక్ట్ అవుతారు. మిగతావారి విషయం ఎంత తక్కువచెప్పుకొంటే అంత మంచిది.
Delete"బోఫోర్స్ వగైరాలపై కాంగ్రెస్ తో యుద్ధానికి అరుణ్ సౌరీని వాడుకున్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ వీపీ సింగ్ ప్రభుత్వం రాగానే ఆయనను తప్పించిందన్న వ్యాఖ్య అప్పట్లో వినిపించింది."
మీకు అరుణ్ శౌరి ని వాడుకొని వదిలేసిన అనుమానం వచ్చింది కాని నిజా నిజాలు తేలియదు. ఆయన పదవి ఎందుకుపోయిందో ఈ క్రింది వీడియోను చూడండి, వాస్తవాలు తెలుస్తాయి.
Can You Take It Arun Shourie?
http://www.youtube.com/watch?v=62k8ojLS51E
Popularity vs credibility
DeleteS. Gurumurthy
The incredible media disclosures on Gadkari made me think that any chartered accountant advising Nitin Gadkari could not be so amateurish as to arrange Gadkari’s affairs to package him as fraud. So, I called the chartered accountant friend of mine who, I knew, was handling Gadkari’s tax affairs and asked him what the facts were. The very next day he brought the critical documents and showed them to me.
On seeing the papers I was shocked again, but the other way round. About how recklessly has the media charged Gadkari with money laundering without checking basic facts. An apprentice in an accounting firm would have helped the journalists to do better homework.
Where did the media go wrong? The media looked at the 14 questioned companies holding the Purti ownership and without further probe, acting as Kangaroo Court, convicted Gadkari for ‘laundering his ill-gotten monies’ into Purti. The media did not do the basic check of the dates and events. If it had done the fundamental check, it would have found four irrefutable facts. One, that from 2001 to 2004, 12 genuine companies of the Mehta group in Nagpur had invested `47cr into Purti equity and it was eight years later, in 2009-10, the group transferred its investment to the questioned companies. Two, that, on a tax search on Mehtas in 2006, the authorities had verified and accepted Mehta’s equity into Purti as genuine. Three, that Mehtas had, in writing, owned the 14 questioned companies as early as in 2003-04 itself; so they were not ghost companies. Four, that Mehtas transferring their 47cr equity from 12 genuine companies of theirs to the questioned companies [also theirs] was like transferring it from one pocket to another pocket of theirs. Thus, without basic scrutiny, the media blindly sentenced Gadkari for money laundering.
The facts uncovered by the New Indian Express [Nov 11-12] have demolished the allegations of money laundering. Yet, Gadkari still stands damned in public mind because of the perception created by the media that lacked diligence. More. Instead of regretting that, on wrong facts, it has created a wrong perception, the media now asserts that, ‘the perception is that Gadkari is guilty of wrongdoing’. The creator of the wrong perception is relying on its own wrong creation.
http://newindianexpress.com/opinion/article1344739.ece
"without basic scrutiny, the media blindly sentenced Gadkari for money laundering" మీడియా ఒక్కోసారి ప్రాథమిక తనిఖీని విస్మరిస్తుంటుందనీ,హోం వర్క్ సరిగా చేసుకోదనీ నేనూ ఒప్పుకుంటాను. అయితే మీడియా మనిషిగా ఒకటి చెబుతాను. బాధ్యతను గుర్తించే సీరియస్ మీడియా సంస్థ ఏదైనాసరే, 'ఆరోపణలు'గా చెబుతుందే తప్ప వ్యక్తుల 'అవినీతి'పై తానే తీర్పు ఇచ్చి శిక్షించదు. 'మీడియా ట్రయల్' అన్నదే తరచు వినిపించే విమర్శ.మీడియా సరే, రెండోవైపు చూడండి. గడ్కరీ కూడా హోం వర్క్ చేసుకోకుండానే మీడియా ముందుకు వచ్చారు. ఎండీటీవీలో గడ్కరీతో శ్రీనివాసన్ జైన్ ముఖాముఖీ ఉదాహరణ. ఆ కార్యక్రమం చూసినవారికి ఎవరికైనా గడ్కరీ తడబడుతున్నారనీ, వాస్తవాలు దాస్తున్నారనీ, వార్త పై కాక వార్తాహరుడిపై గురి పెడుతున్నారనే అనిపిస్తుంది. షెల్ కంపెనీల బోగస్ చిరునామాల గురించి అడిగినప్పుడు కంపెనీలు చిరునామాలు మార్చుకుంటూనే ఉంటాయన్నారు. అయితే ఆ చిరునామాలో ఏ కంపెనీ ఎప్పుడూ లేదని ఇరవై ఏళ్లుగా ఆ అడ్రస్ లో ఉన్నవాళ్ళు చెప్పిన సంగతిని ఎండిటీవీ వెల్లడించింది. మీరు పేర్కొన్న మెహతా-నాగ్ పూర్ కంపెనీ వివరాలు ఆ ఇంటర్వ్యూలో గడ్కరీ చెప్పచ్చు. చెప్పకపోవడానికి కారణం ఆయన కూడా హోం వర్క్ సరిగా చేసుకోలేదు. గడ్కరీ ఆ ఇంటర్వ్యూలో చెప్పిన అనేక అంశాలు 'ప్రొప్రైటీ'(ఔచిత్యం) దృష్ట్యా ప్రశ్నార్థకమవుతున్నాయి. మీరు ఉదహరించిన అర్నబ్ గోస్వామి ప్రొప్రైటీని కూడా అనేక సందర్భాలలో చర్చలోకి తెస్తుంటాడు.
Delete"without basic scrutiny, the media blindly sentenced Gadkari for money laundering" మీడియా ఒక్కోసారి ప్రాథమిక తనిఖీని విస్మరిస్తుంటుందనీ,హోం వర్క్ సరిగా చేసుకోదనీ నేనూ ఒప్పుకుంటాను. అయితే మీడియా మనిషిగా ఒకటి చెబుతాను. బాధ్యతను గుర్తించే సీరియస్ మీడియా సంస్థ ఏదైనాసరే, 'ఆరోపణలు'గా చెబుతుందే తప్ప వ్యక్తుల 'అవినీతి'పై తానే తీర్పు ఇచ్చి శిక్షించదు. 'మీడియా ట్రయల్' అన్నదే తరచు వినిపించే విమర్శ.మీడియా సరే, రెండోవైపు చూడండి. గడ్కరీ కూడా హోం వర్క్ చేసుకోకుండానే మీడియా ముందుకు వచ్చారు. ఎండీటీవీలో గడ్కరీతో శ్రీనివాసన్ జైన్ ముఖాముఖీ ఉదాహరణ. ఆ కార్యక్రమం చూసినవారికి ఎవరికైనా గడ్కరీ తడబడుతున్నారనీ, వాస్తవాలు దాస్తున్నారనీ, వార్త పై కాక వార్తాహరుడిపై గురి పెడుతున్నారనే అనిపిస్తుంది. షెల్ కంపెనీల బోగస్ చిరునామాల గురించి అడిగినప్పుడు కంపెనీలు చిరునామాలు మార్చుకుంటూనే ఉంటాయన్నారు. అయితే ఆ చిరునామాలో ఏ కంపెనీ ఎప్పుడూ లేదని ఇరవై ఏళ్లుగా ఆ అడ్రస్ లో ఉన్నవాళ్ళు చెప్పిన సంగతిని ఎండిటీవీ వెల్లడించింది. మీరు పేర్కొన్న మెహతా-నాగ్ పూర్ కంపెనీ వివరాలు ఆ ఇంటర్వ్యూలో గడ్కరీ చెప్పచ్చు. చెప్పకపోవడానికి కారణం ఆయన కూడా హోం వర్క్ సరిగా చేసుకోలేదు. గడ్కరీ ఆ ఇంటర్వ్యూలో చెప్పిన అనేక అంశాలు 'ప్రొప్రైటీ'(ఔచిత్యం) దృష్ట్యా ప్రశ్నార్థకమవుతున్నాయి. మీరు ఉదహరించిన అర్నబ్ గోస్వామి ప్రొప్రైటీని కూడా అనేక సందర్భాలలో చర్చలోకి తెస్తుంటాడు.
Deleteగడ్కరీ ఆ ఇంటర్వ్యూలో తనను గొప్పగా రాణించిన వ్యాపారవేత్తగా చెప్పుకున్నారు. ఆపైన తనది వ్యాపారం కాదు, సంఘసేవ అన్నారు. వ్యాపారవేత్తలతో రాజకీయనాయకులకు సన్నిహిత సంబంధాలు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ఇదే వాదాన్ని పొడిగిస్తే ఏమవుతుంది? జడ్జీలకూ, బురోక్రాట్లకూ కూడా వ్యాపారులతో, పారిశ్రామికులతో చెట్టపట్టాలు వేసుకునే సంబంధాలు ఎందుకు ఉండకూడదనే ప్రశ్న వస్తుంది. ఇది అవినీతికి సంబంధించినది కాదు, ఔచిత్యానికి సంబంధించినది. ఆయన పార్టీవారు ఇంకో అడుగు ముందుకేసి 'ప్రైవేట్ అవినీతి'కీ 'పబ్లిక్ అవినీతి'కీ తేడా తెచ్చారు. గడ్కరీ ప్రభుత్వ పదవిలో లేరు, ప్రజాధనం దుర్వినియోగం చేయలేదన్నారు. ఇలాంటి అపరిణత సమర్థనలు గడ్కరీని నిర్దోషిగా నిరూపిస్తాయా, లేక అనుమానాలు మరింత పెంచుతాయా? ఆలోచించండి. ఈ అంశాలన్నీ నా బ్లాగులలో చర్చించాను. వీలైతే ఒకసారి అన్నీ చూడండి.
Deleteగడ్కరీ ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టులు పొందిన ఐడియల్ రోడ్ బిల్డర్స్ ఆ తర్వాత ఆయనకు చెందిన పూర్తీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన విషయమే తీసుకోండి. ఇందులో 'క్విడ్ ప్రోకో'ఉండచ్చు, ఉండకపోవచ్చు. అది మీడియా లేదా సాధారణ జనం తేల్చగలిగింది కాదు. కానీ క్విడ్ ప్రోకో ను అనుమానించడానికి అవకాశం లేదంటారా? మళ్ళీ ఇది ఔచిత్యానికి సంబంధించిన ప్రశ్న. అదలా ఉంచి, షెల్ కంపెనీల గురించిన చర్చలో, 'అది కార్పొరేట్ ప్రాక్టీసెస్'లో భాగమని ఒక చార్టర్డ్ ఎకౌంటెంట్ అన్నారు. సాధారణ వ్యాపారులు అలాంటి ప్రాక్టిసెస్ ను పాటించడం సరే. కానీ ఒక రాజకీయనాయకుడు? అటువంటి అనుమానాస్పద ప్రాక్టీసెస్ ను ప్రజాక్షేత్రంలో ఉన్న ఒక మాజీ మంత్రి, అన్నీ కలిసొస్తే మళ్ళీ మంత్రి కాగల వ్యక్తి కూడా పాటించడంలో ఔచిత్యం ఉందా? ఇంకోటి కూడా చూడండి. మీడియా హోం వర్క్ గురించిన మీ అభిప్రాయం నిజానికి సురేశ్ కల్మాడీ, ఏ.రాజా, రాబర్ట్ వద్ర, సల్మాన్ ఖుర్షీద్ తదితరులకు కూడా వర్తిస్తుంది. నేను అనేది ఏమిటంటే, అవినీతి ఆరోపణల గురించిన చర్చ అవినీతికే పరిమితం కాదు. అందులో ఔచిత్యం సహా అనేక ప్రశ్నలు పుట్టుకొస్తాయి. సల్మాన్ ఖుర్షీద్ ట్రస్టు అవకతవకలకు పాల్పడిందీ లేనిదీ విచారణలోనే తేలుతుంది. లేదా అనేక అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే అసలు తేలకనూ పోవచ్చు. కానీ ఒక మంత్రి లేదా రాజకీయనాయకుడు వ్యక్తిగతస్థాయిలో నిర్వహించుకునే ట్రస్టుకు ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వడంలోని ఔచిత్యం ఏమిటి? ఇది నేను లేవనెత్తిన ప్రశ్న.
Deleteమనం అవినీతి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అసలు సమస్య-పారదర్శకత లోపించడం. అవినీతి ఉన్న మాట నిజమే. కానీ అది ఏ పరిమాణంలో ఉందో మనకు తెలియదు. అలాగే అవినీతి లేని చోట ఉన్నట్టు కనిపించచ్చు. ఉన్న చోట లేనట్టు కనిపించచ్చు. ఆయా వ్యవస్థలను పారదర్శకంగా తీర్చిదిద్దడమే పరిష్కారం. పారదర్శకతా లోపానికి ఏ పార్టీ అతీతంగా లేదు. గడ్కరీ అల్లరి పడడానికి అది కూడా కారణం. ఇన్నేళ్లలో అన్ని పార్టీలవారూ పారదర్శకత అంతగా లేని ఒక విధమైన వ్యవహరణకు అలవాటు పడ్డారు. కానీ ఇటీవలి కాలంలో మీడియా మూల మూలల్ని కూడా తరచి చూపిస్తుండేసరికి అంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆర్టీయైని తెచ్చిన ప్రభుత్వం కూడా దాని కోరలు కత్తిరించాలని చూస్తోందంటే ఆ ఉక్కపోత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మీడియా లోపాలకు అతీతమని ఎవరూ అనరు. అది స్వచ్చంద నియంత్రణకు పూనుకోకపోతే దాని మనుగడా సందేహార్థకమే అవుతుంది. అయితే ప్రస్తుత చర్చను మీడియా వర్సెస్ రాజకీయనాయకులుగా మార్చడంలోని ఔచిత్యాన్ని కూడా ఒకసారి పునరాలోచించండి. రాజకీయనాయకులు మంచికో చెడ్డకో ఈ దేశ సంపదకు, సహజవనరులకు, ఈ దేశ భవిష్యత్తుకు కష్టోడియన్లు. గురుతర బాధ్యత ఉన్నవారు. మీడియాను వారిని ఒకే గాటన కట్టలేం. "వ్యవస్థలు సక్రమంగా వ్యవహరించడమే కాదు వ్యవహరిస్తున్నట్టు కనిపించడం" అంత తేలిక కాదని మీరు అన్నారు. తేలిక కాకపోవచ్చు, కానీ ప్రజాభిప్రాయం కీలకంగా పరిణమించే ప్రజాస్వామ్యంలో అంతకంటే మరో మార్గం ఉందా? న్యాయవ్యవస్థ చాలావరకు ఆ జాగ్రత్త పాటించడం లేదా?
Deleteమీరు మీడీయా వారే కావచ్చు, దానిని కాదనను. నేను రాసిన దానిని చదివి మీడీయా లో వార్తలు రాసే వ్యక్తిగా మీరు అఫెన్సివ్ గా ఫీలవసరంలేదు. అందరి ఉద్దేశం నిజం వాస్తవాలను తెలుసు కోవటమే కదా! ఈ రోజు నెట్ వలన నాలాంటి మీడీయాలో లేని వారు కుడా తెలిసిన నిజాన్ని, వ్యాఖ్యల రూపంలో రాస్తున్నారు. మీబ్లాగులో ఈ నాలుగు ముక్కలు రాయటానికి నేను కూడా నా గ్రౌండ్ వర్క్ చేశాను. దానిని కుదించి కామేంట్ల రూపంలో రాశాను. సత్యం తెలుసుకోవటానికే ఆలింక్ లు ఇచ్చాను. గమనించిందేమిటంటే వర్తమానం లో జరిగే కొన్ని సంగటనల పైన వెంటనే కంక్లుషన్ కి రావటం అనేది తొందరపాటని పిస్తుంది. మీడీయా వాళ్ళు అన్నితెలిసిన త్రికాలజ్ణానులు కారు. ప్రతి ఒక్కరికి, రంగానికి పరిమితులు ఉన్నట్లే వారికి ఉన్నాయి. గురుముర్తి క్లిన్ చిట్ తరువాత వారు అతను చెప్పిన అంశాన్ని పరిశీలించకుండా, గడ్కరి తొలగించాలనే దానిమీద మంకు పట్టు పట్టి, ఆవాదనకు అవసరమైన వాటినే టి వి లో అదే పని గా చూపటం అర్థంలేని వ్యవహారం. అటువంటి వార్తలను విని గడ్కరి రాజీనామా ఇవ్వాలనటం కూడా బాగాలేదు. గడ్కరి విషయానికొస్తే అతను ప్రిపేర్ కాలేదు అని తెలుస్తూనే ఉన్నది. ఆయనకి విషయం కొత్త, సమయం లేకపోవటం ఇలాంటి కారణాలు ఉండిఉండవచ్చు. అదేగాక ఇంటర్వ్యు అనేది యాంకర్ యాటిట్యుడ్ మీద కూడా ఎక్కువ ఆధారపడుతుంది.
Delete* ఆయన పార్టీవారు ఇంకో అడుగు ముందుకేసి 'ప్రైవేట్ అవినీతి'కీ 'పబ్లిక్ అవినీతి'కీ తేడా తెచ్చారు.*
ఇక బి జె పి నాయకులు చేసిన విభిన్న వ్యాఖ్యలపైన, ఎలెక్ట్రానిక్ మీడీయా వారు కనిపించిన ప్రతి రాజకీయ నాయకుడి దగ్గరికి పోయి మైక్ ముందు పెట్టి అభిప్రాయం అడుగుతూంటే, వాళ్లకు తోచింది వాళ్ళు చెపుతారు. పార్టిలో గడ్కరి అందరు మిత్రులు ఉండాలని ఎక్కడా రూల్ లేదు కదా? ఆయనంటే నచ్చనివారు సమయం చూసుకొని ఇలా మాట్లాడి ఉండవచ్చు. మీరు చెప్పండి యశ్వంత్ సిమ్హా ఆయనని ఏముఖం పెట్టుకొని రాజినామా అడుగుతాడు? బి జె పి పార్టిలో ఆయన పెద్ద రాజకీయ నాయకుడా? రెండు మూడు పార్టిలు మారి చివరికి ఆ పార్టిలో చేరారు. వాళ్లు ఆయనని ఒక నాలేడ్జ్, అడ్మినిస్ట్రేషన్ రంగాలపైన అవగాహన ఉన్న వాడిగా గుర్తించి మంత్రిపదవి ఇచ్చారేగాని, ఈయనేదో పార్టిని ఉద్దరించగల పెద్ద పుడింగి అని కాదు. పార్టిలో,ప్రజలలో పైసా ప్రభావం లేని వీరి మాటలను మీడీయా వారు చాలా ఎక్కువ చేస్తూ ఇంకొక నాయకుడు గడ్కరి ని రాజీనామా అడిగాడు అని ప్రచారం మొదలు పెడుతుంది.
"ఇలాంటి అపరిణత సమర్థనలు గడ్కరీని నిర్దోషిగా నిరూపిస్తాయా, లేక అనుమానాలు మరింత పెంచుతాయా? "
దీనిని ప్రభుత్వం వేసే కమిషన్, కోర్ట్టు తెలుస్తుంది.
మీడీయా నిజం గా ఈ దేశ ప్రజలకు సహాయం ఎమైనా చేయదలచుకొంటే, ముందర అది మునిసిపాలిటిలో జరిగే అవినితీ తో మొదలు పెట్టాలి. స్థానిక యం.యల్.ఏ. లు కార్పొరేటర్లు ఏవిధంగా స్కాములు చేస్తున్నారో వివరాలు రోజు బయటకి లాగాలి. ఆప్పుడే ప్రజలకి మీడీయాపైన విశ్వాసం పెరిగేది. జాతీయస్థాయిలో జరిగే అవినీతి పైన ఇంగ్లిష్ మీడీయా ఉంది . ఈ ఇంగ్లిష్ మీడీయాను కంట్రొల్ చేయటానికి వారిపైన దేశ విదేశాలలోని సోషల్ మీడీయా ఉంది. జాతీయ స్థాయిలో వేల కోట్ల స్కాంలను అడ్డుకోగలుగుతున్నాం. కాని ఒక జిల్లా కేంద్రంలో జరిగే స్కాములను అడ్డుకోలేక పోతున్నారు. మీడియా యం యల్ ఏ, మేయర్, కార్పోరేట్ల పైన దృష్ట్టిని పెట్టటం లేదు. రాను రాను ఈ మధ్య జిల్లా కేంద్రాలలో రోడ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు,నదుల పరిస్థితి క్షీణిస్తున్నాది.రోజు రోడ్ల పైన ఎదో ఒక యాక్సిడేంట్, ప్రాణాలు కోల్పోవటం అనేది ఒక సాధారణ అంశం అయింది. మొన్న యర్రం నాయుడు సంఘటన ఒక ఉదాహరణ. మీరు కృష్ణా నది పరిస్థి తి గురించి మీరే రాశారు.
Deleteనేను రాసిన వ్యాఖ్యల వలన మీతెలియని విషయాలు తెలిస్తే ఆనందిస్తాను. దాని ప్రయోజనం అంతరవరకే. మీరు రాసిన ప్రతి లైన్ కి కౌంటర్ గా రాయటమనేది నా ఉద్దేశం కాదు. నాకు చాలా తెలుసుకదా అనేభావంతో, మీతో వాదన చేసి మిమ్మల్ని గెలవాలనే ఆలోచన అసలికే లేదు. చర్చ ఇంతటితో సమాప్తం.
"గడ్కరీ ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టులు పొందిన ఐడియల్ రోడ్ బిల్డర్స్ ఆ తర్వాత ఆయనకు చెందిన పూర్తీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన విషయమే తీసుకోండి. ఇందులో 'క్విడ్ ప్రోకో'ఉండచ్చు, ఉండకపోవచ్చు. అది మీడియా లేదా సాధారణ జనం తేల్చగలిగింది కాదు. కానీ క్విడ్ ప్రోకో ను అనుమానించడానికి అవకాశం లేదంటారా? అవినీతి ఆరోపణల గురించిన చర్చ అవినీతికే పరిమితం కాదు. అందులో ఔచిత్యం సహా అనేక ప్రశ్నలు పుట్టుకొస్తాయి."
Deleteఈ వ్యాఖ్య చూడలేదు కనుక మళ్ళీ సమాధానం ఇస్తున్నాను. మీలాగే ఎందరికో ఇటువంటి అనుమానాలు రావచ్చు. ఇటువంటి సందర్భాలలో ప్రస్తుతానికి విచారణ జరుగుతున్నాది కనుక, పూర్తివివరాలు తెలియవు ఎవరికి తెలియవు గనుక, నేను బ్రాండ్ నేం పైన ఆధారపడుతాను. ఆబ్రాండ్ ఆర్ యస్ యస్. గురుముర్తి, సుబ్రమణ్య స్వామి వీళ్ళు గడ్కరి గురించి ఎమి అన్నారనేదానికి ప్రాముఖ్య్త నిస్తాను.
ఇక మీరు రాసిన క్విడ్ ప్రోకో, ఔచిత్యం అంటు ప్రశ్నలు వేసుకొంటే మీరెళితే,నాలంటివారు గాంధి గారి స్వాతంత్ర పోరాటానికి టాటా బిర్లాలు సహాయం చేయలేదా అంట్టూ వాదనను అంతవరకు తీసుకుపోవచ్చు. ఆ తరువాత అసలికి ప్రజాస్వామ్యం లో లోపాలు లేవా అంటూ ఇంకొక వాదన మొదలు పెట్టవచ్చు. వీటికి అంత ఉండదు.
గడ్కరి వ్యాపారం చేస్తున్నారని మీరంటారు. మరి దేశంలో ప్రజాస్వామ్యం అంతా భుస్వామ్య్ల చేతిలో చిక్కిందని నేనంటాను. ఒక్క విషయం మీరు గమనించాల్సింది ఎమిటంటె మన ప్రజాస్వామ్యం పాశ్చయత్య దేశాల నమునా దానిని భారతీయ విలువల కోణంలో మీరు చూస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే మీరు అతివాద బ్రహ్మణ కోణం లో చూస్తున్నారు (వారి వాదన కూచొన్న చెట్టుని తెగనరికే టైప్ అన్నమాట (అతి నిజాయితి గాంధి గారు వీరికి మార్గదర్శకులు ) మీరే కులమో నాకుతెలియదు కాని వాదన మాత్రం వారిదే ). కాని మనం అడాప్ట్ చేసుకొన్న పాశ్చత్య ప్రజాస్వామ్య మేధావులకు ఒకటి స్పష్టం గా తెలుసు, అంగీకరించారు కూడా అదేమిటంటే ప్రతి మనిషి అవకాశమొస్తే అడ్డదారిలో సొమ్ము చేసుకోవాలనుకొంటాడు. ప్రపంచంలో ఎవరు ఐడియల్ వ్యక్తి కారు, ఐడియల్ వ్యక్తి లేడు, నిజంగా అటువంటి వాడు ప్రజల మధ్యఉన్నా ప్రజలు నమ్మరు, వాడు మంచోడని ఒప్పుకోరు. కనుక ఐడియలిజం ముందర పక్కన పెట్టి మొదట మనమదరం దొంగలే అనుకోని వాళ్ళు చట్టాలను చేసుకొన్నారు. చేసిన పనిని బట్టి శిక్షను నిర్ణయించారు. సత్వరం అమలు చేస్తున్నారు. మనం వారిలాగే ఫాలో కావాలి. ఒకవేళవిచారణలో అతను చేసింది తప్పని తేలితే దానిప్రకారం ఫలితం అనుభవించాలి. అంతకు మించి చేసేది ఎమీ లేదు. ఈ సమస్యకు మీదగ్గర ఎమైనా ఉత్తమ మార్గం ఉంటే చెప్పండి.
ఇప్పటికే తగినంత చర్చ చేశాం. మన అభిప్రాయాలు వీక్షకుల ముందు ఉన్నాయి. వారి విచక్షణకు వదిలేద్దాం. మీరన్నట్టు ఈ చర్చకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెడదాం.
Deleteమీ వ్యక్తిగత వివరాలు నాకు ఎమీ తెలియదు (మీరు రచయితనా, విలేఖరా ఎంత వయసు,అనుభవం, మొద|| వివరాలు). నేను ఇంతక్రితం రాసిన వ్యాఖ్య మీటపాకు చదివి దానికి ప్రతిస్పందించాను అంతే. అంతకుమించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టటానికి ఆ వ్యాఖయ రాయలేదు.
ReplyDeleteమీరు నన్ను ఇబ్బంది పెట్టారని నేను అనుకోవడం లేదు. ఆయా అంశాలపై నా అభిప్రాయాన్ని పదిమందితో పంచుకునే అవకాశం నాకు వృత్తి(పాత్రికేయ) రీత్యా, అనుభవం రీత్యా ఉన్నాయనుకుంటున్నాను.
Delete@Kalluri Bhaskar,
ReplyDeleteFirst write my name correctly.
Second, give a link to the article where I made a comment so that any Reader who comes to your present writing can easily go there, read and come to his own conclusion, instead of your selective quoting now.
Deleteసారీ శివరామప్రసాదు, మీ పేరు సవరించాను.
Deleteమీ వ్యాఖ్యలు పబ్లిష్ అయ్యాయి కనుక ఆ అవసరం లేదనుకుంటాను. నేను సరిగానే సమ్మప్ చేశానని కూడా అనుకుంటున్నాను. మీ సూచనను దృష్టిలో ఉంచుకుంటాను.
Delete