కళ్ళు కనిపించని పాము
తన పిల్లల్ని తనే తినేస్తుందట!
అవినీతి, అక్రమాలు, అలక్ష్యంతో కళ్లుమూసుకుపోయిన ఈ వ్యవస్థ
తన పిల్లల్ని తనే తినేస్తోంది!
పిల్లలు తినే అన్నంలో పచ్చివిషం కలిపే
ఈ పాషాణ వ్యవస్థను ఏంచేయాలి?!
దేశాన్ని అభివృద్ధి చేస్తామంటారు
ఈ వ్యవస్థకు కేరక్టర్ ఎలా ఇస్తారు?!
పిల్లలన్న కనికరం కూడా లేని
ఈ కర్కోటక వ్యవస్థకు
కారుణ్యపు గుండెను
ఎక్కడినుంచి తెచ్చి అతికిస్తారు?!
ఈ దేశంలో తల్లిదండ్రులు బతికున్నారా?
ఉంటే వాళ్ళ కళ్ళముందే పిల్లలెలా చనిపోతారు?!
ఇది మృత్యుభూమి
ఇక్కడ పుట్టుకల్ని నిషేధించాలి.
(బీహార్ లో విషాన్నం తిని చనిపోయిన పిల్లలకు కన్నీటి తర్పణంతో)
తన పిల్లల్ని తనే తినేస్తుందట!
అవినీతి, అక్రమాలు, అలక్ష్యంతో కళ్లుమూసుకుపోయిన ఈ వ్యవస్థ
తన పిల్లల్ని తనే తినేస్తోంది!
పిల్లలు తినే అన్నంలో పచ్చివిషం కలిపే
ఈ పాషాణ వ్యవస్థను ఏంచేయాలి?!
దేశాన్ని అభివృద్ధి చేస్తామంటారు
ఈ వ్యవస్థకు కేరక్టర్ ఎలా ఇస్తారు?!
పిల్లలన్న కనికరం కూడా లేని
ఈ కర్కోటక వ్యవస్థకు
కారుణ్యపు గుండెను
ఎక్కడినుంచి తెచ్చి అతికిస్తారు?!
ఈ దేశంలో తల్లిదండ్రులు బతికున్నారా?
ఉంటే వాళ్ళ కళ్ళముందే పిల్లలెలా చనిపోతారు?!
ఇది మృత్యుభూమి
ఇక్కడ పుట్టుకల్ని నిషేధించాలి.
(బీహార్ లో విషాన్నం తిని చనిపోయిన పిల్లలకు కన్నీటి తర్పణంతో)
చాలా కసిగా నిజాలు చెప్పారు, ముఖ్యంగా చివరి రెండు లైన్లు.
ReplyDeleteఎలాగైనా డబ్బు సంపాదించాలి, మానవత్వాన్ని పణంగా పెట్టైనా సరే, అనే దారుణ మనస్తత్వాన్ని ఇన్ని మతాలు, దేవుళ్ళు, చట్టాలు ఏవీ మార్చలేకపోతున్నాయి.
నిజం బోనగిరి గారూ...
Delete