ఎట్టకేలకు 'ప్రకటన' జరిగిపోయింది!
దశాబ్దాలపాటు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంటున్న తెలంగాణ సోదరులకు శుభాభినందనలు!
ఇంతకాలం తమకు ఒక రాజధాని స్థాయి నగరం లేని లోటును ఎదుర్కొంటున్న ఆంధ్రసీమ ప్రాంతీయులు ఇక ఆ లోటును తీర్చుకోబోతున్నారు కనుక శుభాకాంక్షలు!
గతజల సేతుబంధనం వల్ల ఉపయోగం లేదు. జరిగింది మంచికా, చెడ్డకా అన్న చర్చను పక్కన పెడదాం. మంచినే చూస్తూ ముందుకు వెడదాం.
తెలుగువారి చరిత్రలో ఆవిష్కృతమవుతున్న ఈ కొత్తపుటను నైరాశ్యపు చీకట్లతో కాకుండా, ఆశాభావపు అక్షరకాంతులతో అలంకరిద్దాం.

ఆంధ్రసీమ ప్రాంతీయులు ఇక ఆ లోటును పూడ్చుకోబోతున్నారా? నమ్మకం లేదు.
ReplyDeleteగత్యంతరం లేదు కదా, నమ్మకపోతే ఎలా?
ReplyDeleteమంచి ఆశావాదులు.
Deleteకాని చరిత్రలో ఆంద్రులకు ధిల్లీ పెద్దలు ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఇక ముందూ చేస్తారు.
శ్యామలరావు గారూ, మీ నుంచి ఇలాంటి స్పందనను నేను ఊహించలేదు. రాష్ట్రవిభజన నిర్ణయాన్ని ఒక ప్లేన్ లో జీర్ణించుకోవడం కష్టమే. కానీ ఇంకో ప్లేన్ లో హేతుబద్ధంగా ఆలోచించాలి. యాభై ఏళ్ళు ఒకళ్లనొకరం అనుమానిస్తూ, తిట్టుకుంటూ గడిపాం. విభజన తర్వాత కూడా ఇంకో యాభై ఏళ్ళు తిట్టుకుంటూ గడపాలని మీ ఉద్దేశమా? రేపటి తరాలవారికి ఈ తిట్ల వారసత్వమే అందిద్దామా, లేక వాళ్ళు మనల్ని తిట్టుకోడానికి అవకాశమివ్వని మంచి వారసత్వాన్ని అందిద్దామా? భాష వేరు కావచ్చు కానీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి మనం విడిపోయినప్పుడు దానిని తమిళుల్లో కూడా చాలామంది జీర్ణించుకోలేక పోయే ఉంటారు. అయినా మనం ఆంధ్రరాష్ట్ర అవతరణను హర్షించలేదా? అలాగే, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను హైదారాబాద్ రాష్ట్రం నుంచి విడగొట్టినప్పుడు నిజామూ, ఆయన అనుయాయులూ బాధపడే ఉంటారు. ఎవరి కోణం నుంచి వాళ్ళదే న్యాయమనిపిస్తుందని చెప్పడానికే ఈ ఉదాహరణలు తప్ప దయచేసి అపార్థం చేసుకోకండి. నైరాశ్యంతో కుంగిపోవడం మంచిదా, ఆశాభావంతో ముందుకు వెళ్ళడం మంచిదా?
ReplyDelete