Monday, July 29, 2013

'ఆంధ్రప్రదేశ్' ఇక గతం...భవిష్యత్తు ఒక్కటే మనకు మిగిలింది!

తెలుగువారి చరిత్ర మరో కీలకమైన మలుపు తిరుగుతోంది. తెలంగాణ ఖాయమని ఇప్పుడు మరింత స్పష్టంగా తేలిపోయింది. ఇది కన్నీరు-బహుశా పన్నీరూ కలగలసిన ఒక సందర్భం. 1947లో భారతదేశ స్వాతంత్ర్యం అనే ఒక చరిత్రాత్మక ఘటన జరిగింది. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ అనే మరో చరిత్రాత్మక ఘటన జరిగింది. నేటి రెండుతరాల తెలుగు ప్రజలకు ఈ రెండుఘటనలను తిలకించే అవకాశం కలగలేదు. ఇప్పుడు రాష్ట్రవిభజన అనే ఘటనను తిలకించే అవకాశం వారికి కలుగుతోంది. ఇది తొలి రెండు ఘటనలవంటిది కాకపోవడం ఒక తేడా.

యథాతథస్థితి(స్టేటస్ కో)ని  చెరపడానికి మానవనైజం సాధారణంగా అంగీకరించదు. భవిష్యత్తు గురించిన భయాలు, బెంగలూ భూతద్దంలో కనిపిస్తాయి. కానీ, యథాతథస్థితిని చెరిపితేనే తమకు భవిష్యత్తు ఉంటుందని ఒక ప్రాంతం నమ్ముతోంది. ప్రజాస్వామ్యంలో ఒక ప్రాంతం ఆకాంక్షలను గుర్తించక తప్పదు. దశాబ్దాలుగా రగులుతున్న సమస్య పరిష్కారాన్ని నిరవధికంగా వాయిదా వేయలేరు. అందువల్ల అన్ని ప్రాంతాలూ నష్టపోతూనే ఉంటాయి. ఇప్పటికే గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అన్నీ స్తంభించి పోయాయి. దీనిని ఇంకా కొనసాగిస్తే రేపటి తరాలు క్షమించవు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నిర్ణయం జరిగిపోతోంది. ఇక గతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. రెండు ప్రాంతాలవారికి  బాధాకరంగా, ఒక ప్రాంతంవారికి సంతోషదాయకంగా  తోచే ఈ  పరిణామం నుంచి వీలైనంత మంచిని పిండుకోడానికే అన్ని ప్రాంతాల వారూ ఇక ప్రయత్నించాలి.

ఆవేశాలు ఇక తగ్గించుకుని ఆలోచన పెంచుకుంటే, ప్రాంతాల మధ్య వేర్పాటు భావన పెరగడానికి కారణం ఆర్థికమూ, అందులోంచి పుట్టే  రకరకాల అసమానతలే నని గుర్తించడం కష్టం కాదు. మాండలిక భేదాలు, సంస్కృతి, సాహిత్యం వగైరాలలో తేడాల గురించిన భావనలు ఆర్థికం అనే మూల కారణాన్ని మరుగుపుచ్చే తాత్కాలిక సమర్థనలు మాత్రమే. సంస్కృతి, సాహిత్యం, భాష, మాండలిక భేదాలు  వగైరాలే  ప్రాంతాల విభజనకు, స్వతంత్ర అస్తిత్వానికి ప్రాతిపదికలైతే భారత్ ఒక దేశంగా ఉండడమే సాధ్యం కాదు. కనుక ఇకనైనా ఇటువంటి తేడాలను తీసుకురాకపోవడమే వివేకవంతం.

ఆర్థిక అభివృద్ధి ఒక్కటే వేర్పాటు వాదాలకు విరుగుడు అనే వాస్తవాన్ని అంగీకరించడానికి ఇప్పుడిక ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. కనుక అన్ని ప్రాంతాలూ ఇక అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. రాజకీయ మోసాలకూ, అవకాశవాదాలకూ, బాధ్యతారాహిత్యానికి ఇకముందు అవకాశమివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని, వేర్పాటుభావనకు దారితీయించిన గతాన్ని ఇక పునరావృతం చేయించరాదనీ అందరూ నిర్ణయం తీసుకోవాలి.

రాయలసీమలోని రెండు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకో ప్రాంతం నుంచి మరి కొన్ని దశాబ్దాలపాటు నిప్పును మూటగట్టుకునే ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారో ఆశ్చర్యం. ఇది నిజం కాదని నేను అనుకుంటున్నాను. రాయలసీమ వారు తమను విభజించే ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి కారణం లేదు.

'ఆంధ్రప్రదేశ్' ఇక గతం! భవిష్యత్తు ఒక్కటే తెలుగువారికి మిగలబోతోంది. ముక్కలవుతున్న ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పటం మన గుండెల్ని ముక్కలు చేసేలా కనిపించే మాట నిజమే. కానీ తప్పదు...మనసు రాయి చేసుకోవలసిందే...

24 comments:

  1. అదేనండీ శాపగ్రస్థులైన ఆంధ్రుల పరిస్థితి.
    ఆంధ్రజాతికి యెప్పుడూ గతమే కాని భవిష్యత్తు అంటూ కనిపించటం లేదు.

    ఆ. తప్పు జరిగె నేని దాని దుష్ఫలితంబు
    కూడ నొక్క నాడు కుడవ వలయు
    హ్రస్వదృష్టి తోడ నాలోచనలు చేయ
    దీర్ఘకాల మందు దిగులు మిగులు

    ReplyDelete
  2. A small bit from Andhra Pradesh is gone, but Andhra Pradesh still exists

    This is a lesson for all of us, Gandhiji said long ago, Grama Swarajyam, develop all areas equally so that we dont have to cry about leaving our 50 years effort to someone else.

    ReplyDelete
    Replies
    1. మిగిలిన ఆంధ్రప్రాంతానికి స్వర్ణాంద్ర అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి అందరూ.
      తెలంగాణారాచపుండు వదిలిందనుకుని ఇక ఆరోగ్యం పుంజుకుందుకు కృషిచేయాలి.

      Delete
    2. నిజమే, మీరన్నట్టు 'ఆంధ్రప్రదేశ్'ఇక ముందూ ఉండచ్చు. అయితే, రాష్ట్రం రెండుగా చీలిపోవడం కన్నా ఎక్కువగా రాజకీయనాయకులను తలచుకునే భయమేస్తోంది కృష్ణ గారూ. ఇంకో యాభై యేళ్లపాటు ఆరని చిచ్చు ఎక్కడ రగిలిస్తారో! ఆంధ్ర, రాయలసీమల మధ్య ఎలాంటి మంట పెడతారో!!

      Delete
    3. 'స్వర్ణాంధ్ర' మంచి మాటే కానీ రాజకీయనాయకుల నోట అదే పనిగా అరిగిపోయి, తాజాదనం కోల్పోయింది శ్యామలరావు గారూ...మరో మాట ఆలోచించాలేమో!

      Delete
  3. శ్యామలీయం సారు,
    ఏంది దొరా గట్లంటవు, మీ పక్క స్వర్ణాంధ్ర.. మా పక్క రాచపుండు అంటరా.. అందుతలేవని ద్రాక్షపండ్లని,,అయన్ని పుల్లటియి అన్నదట నక్క ఒకటి.. ఎవరు ఎవరికి రాచపుండు అంటరు ?.. తెలంగాణని తెచ్చి మీకు కలిపిన్లా.. ఆంధ్రని తెచ్చి మాకు కలిపిన్లా ?

    మా పట్ల రాచపుండు లెక్క తయారైంది ఎవలు.. ?

    అయినా మీకు రాజకీయాలెందుకు.. పద్యాలపై ధ్యాస పెట్టండి.. ఏదో పేద్ద పోరాటాలు చేసినట్లు మాట్లాడుతరు..

    ReplyDelete
    Replies
    1. 'తెలంగాణ రాచపుండు' అన్న expression సరి కాదు. పెద్దలు, సహృదయులు అయిన శ్యామలరావు గారు కూడా గుర్తించారనే అనుకుంటాను. మన స్పందనను అవాంఛనీయమైన మార్గం పట్టకుండా చూసుకోవాలని మనవి.

      Delete
    2. ఆయన వ్యాఖ్య నాకు అర్థమైంది భాస్కరం గారు.. రాచపుండు అనేది ధీర్ఘకాల సమస్యని సూచించటానికి వాడుతరు.. అయినప్పటికి పండితులు, భాషా నైపుణ్యం కల వారు పామరులను నొప్పించకుండా తాము ఆవెశకావేశాలకు లొంగకుండా భావాన్ని గుండెలోకి చొప్పించగలగాలి..

      భక్తి యోగానికి బర్రెలడ్డొస్తున్నయ్ సారూ.. చూస్కోండి జర..

      Delete
  4. అభివృద్ది కి అంతం ఎక్కడ దొరా.. అభివృద్ది కాదు సారు.. సంబంధాలు, గౌరవ మర్యాదలు ముఖ్యం.. అడవిలో బతికే మనుషులకైనా సంబంధ బాంధవ్యాలు సరిగా లేకపోతే విడిపోతరు.. ఏది పడితె అది రాస్తె ఎట్ల సారు..

    ReplyDelete
  5. ఇంతవరకు అటువాళ్లు, ఇటువాళ్లు కూడా ఆవేశకావేషాలకు పోయి ఎన్నో అనుకున్నారు. ఇప్పుడు తెలంగాణ సాకారం కాబోతోంది కనుక ఏ ప్రాంతం వారి ముందైనా అభివృద్ధి తప్ప ఇంకేం అజెండా ఉంటుంది కాయ గారూ, ఆ మాటను తప్పు పట్టడం భావ్యమా?

    ReplyDelete
  6. ఇంత మనస్తాపం అవసరం లేదు!వాస్తవాలను గమనించండి!తెలంగాణా ౯౦౦ మంది అమరవీరుల ఆత్మత్యాగ ఫలితం!చిన్నబుచ్చే ప్రయత్నం చేయకండి!మీరు తెలంగాణారాచపుండు అంటే నాకు గుర్తొస్తున్నది!మన స్వాతంత్ర్యం మేడిపండు మన దారిద్ర్యం రాచపుండు....అనే కవిగారి మాటలు!

    ReplyDelete
  7. శ్యామలీయం గారు!
    ఎంత విషం పెట్టుకొన్నారండి కడుపులో!
    ఇదొ ... ఈ అహంకారం వల్లే మీలాంటివాళ్ళతో మేము కలి్సిఉండలేకపోతున్నది.

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. ఆ మాటయే నేనునుం‌ బల్కగలనని ఫణీంద్రగారికేలఁ దోచదో గదా

    క. విషవక్త్రుల కమృతంబును
    విషసదృశ మగుచు నెగడు విధమున తమలో
    విషమున్న యెడల నిజములు
    విషమగుచుం దోచు టేమి వింత ఫణీంద్రా

    వాదించుట కిట్లునుం‌ బల్కవచ్చును గదా?

    ఆ. కలసి యుండలేమి కలుగుట యన్నది
    పాడు రాజకీయ క్రీడవలన
    వెనుకబడుట యన్న విషయంబు పలుచోట్ల
    నీ తెలంగాణ కన్న హీన మరయ

    ఆ. ఆత్మగౌరవంబు లందర కుండును
    దాని తమకు సొత్తు గా నెఱింగి
    అవలి వారి దిట్టి ఆశించి స్వార్థంబు
    వేరు పడుట మంచి దారి యగునె.

    ఈ‌లాగున చాల వ్రాయవచ్చును గాని పోనిండు. మీ మీ‌వాదనలు మీవి, ఆవలి వారి వాదనలు వారివి. సౌహృదము లోపించినప్పుడు ఆవలి వారి తప్పులే తోచును గదా. పరస్పరవిషారోపణలు కర్జంబులు గావని యెఱుంగునది.

    నిజమున కీ వ్యాఖ్య నుంచుటకు పూర్తిగా మనస్కరించక పోయినను మీ బోటి విద్వద్వరేణులు నాలో విషం ఉందని ప్రకటించుట వలన తప్పని సరియై వ్రాయుచున్నాను. మన్నించగలరు.

    ReplyDelete
  11. @మిగిలిన ఆంధ్రప్రాంతానికి స్వర్ణాంద్ర అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి అందరూ.
    తెలంగాణారాచపుండు వదిలిందనుకుని ఇక ఆరోగ్యం పుంజుకుందుకు కృషిచేయాలి.>>>


    కాస్తా కటువుగానే అనిపించ వచ్చు...కానీ ఒకటే మంత్రం...దోపిడీ..దోపిడీ..దోపిడీ...ఎవడైనా లెక్కలు తీస్తే వాడి మీదా...ఇంత బురద జల్లడం...ఎవరో ఒకరు..పక్కకు తప్పుకోవాలి...ఎంత కాలం ఈ నస...

    కాలం ఎప్పుడూ ఒకటి చెప్తుంది...గత కాలం మిన్న అనీ...దొర్లు అలా అనిపించకపోతారూ...?శాపనార్ధాలు కాదు....

    ReplyDelete
  12. @ ఏదో పేద్ద పోరాటాలు చేసినట్లు మాట్లాడుతరు.....ఎవరు నాయనా దొర?దొరా కాల్మొక్తా ...సాంప్రాదాయం రాకుండు కాక...తధాస్తు!!!

    ReplyDelete
  13. అయినా మన పిచ్చి గానీ...ఎవడో ఒకడు కొత్త పార్టీ పెట్టి...చరిత్రలోని ఏదో ఒక గాయాన్ని మళ్ళీ రాజెస్తే...మరో సారి ముక్కలు కామా?

    ReplyDelete
  14. శ్యామలీయం వంటివారితో మాట్లాడవచ్చు.. తాతావారి లాంటి ఛాదస్తులతో మాట్లాడటం పిచ్చిపని.. నిన్నెవడు దొర అన్నడు ఇక్కడ ?
    ఫణీంద్ర గారూ..మీరు ఫన్నీ..

    ReplyDelete
  15. కాయ గారు!
    "తెలంగాణ రాచపుండు" అట!
    మీకు ఫన్నీగా ఉందా?

    ReplyDelete
  16. పైన రాచ పుండు అంటే ఆతని ఉద్దేశ్యం వ్రాశాను గురువు గారు.. చూడండి.."రాచపుండు అనేది ధీర్ఘకాల సమస్యని సూచించటానికి వాడుతరు.."

    ReplyDelete
  17. ఫణీంద్రగారూ, నేను సీమాంధ్రతరపున మాట్లాడానని, ఎంత విషం పెట్టుకొన్నారండి కడుపులో అన్నారు మీరు. ఈ‌రోజు KCR గారు సీమాంధ్ర ఉద్యోగులను గెంటివేస్తామని హర్షద్వానాల మధ్య ప్రకటించారే, అది కడుపులో‌ని విషం కక్కటం‌ కాదూ‌‌ అవి అమృతవాక్యాలూ అని మీకూ‌ అనిపిస్తున్నాయా?

    ReplyDelete
  18. శ్యామలీయం గారు!
    కె.సి.ఆర్. అన్నది - ఇప్పుడున్న రాష్ట్ర ఉద్యోగులను రేపు ఏర్పడే రెండు రాష్ట్ర ప్రభుత్వాలలో ప్ర్రాంతాల వారిగా పంచుతారు; అందులో ఆప్షన్స్ ఉండవని. ఆ మాటకు వస్తే ఉద్యోగులనే కాదు ... బల్లలు, కుర్చీలను కూడా పంచుతారు.ఇలా మద్రాసు విభజన సమయంలో కూడా జరిగింది. ఇది సీమాంధ్ర మీడియాకు గాని, మీకు గాని అర్థం కాని విషయమేమి కాదు. అయినా పనిగట్టుకొని కె.సి.ఆర్. మీద అక్కసుతో బురద చల్లుతారు.
    అయినా రాజకీయ నాయకులు విషం కక్కుతారే అనుకొందాం. ఒక కవిగా, సమాజ హితాన్ని కాంక్షించాల్సిన మీరు విషం కక్కుతారా? ఏమిటొ... మీరేం మాట్లాడినా ... మీకు పరిపక్వత వచ్చినట్టుగా కనిపించదు. ఏమైనా వివరించబోతే ... చిన్న పిల్లల్లా మాటకు మాట ... తిట్టుకు తిట్టూ అంటారు. మీరెన్ని మాట్లాడినా, ధర్మమన్నది ఒకటుంటుంది. అదే గెలుస్తుంది.

    ReplyDelete
    Replies
    1. ఫణీంద్రగారూ,
      > మీకు పరిపక్వత వచ్చినట్టుగా కనిపించదు.
      మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను.
      పరిపక్వతకోసమే ప్రయత్నిస్తున్నాను.
      సరిగా చెప్పారు.
      అభినందనలు.
      >ధర్మమన్నది ఒకటుంటుంది. అదే గెలుస్తుంది.
      ధర్మమే‌గెలుస్తుందని ఆశిద్దాం.
      కాలమే నిర్ణయిస్తుంది. అది దీర్ఘకాలికమైన విషయంగా చూద్దాం.

      మీరు ఈ‌ వాక్యాలను కూడా నా అపరిపక్వత క్రింద పరిగణిస్తారేమో తెలియదు.
      అది విజ్ఞులైన మీ యిష్టం. పునఃపునః ధన్యవాదాలు.

      Delete