“…and so-and-so took as a wife so-and-so, and begat…and
begat…and begat…”
ఆ వృద్ధ గాథికుని కథనం వింటున్న హెలీకి బైబిల్ శైలి
గుర్తొచ్చింది. కుంటా కింటే ముస్లిం మతస్థుడు. అతని నుంచి ఏడో తరానికి చెందిన హేలీ
దగ్గరికి వచ్చేసరికి ఒంటి రంగు,
కారు నలుపు నుంచి గోధుమవర్ణానికి మారిపోవడమే కాదు, మతమూ
మారిపోయింది. హెలీకి బైబిల్ ఒక్కటే తెలుసు.
మహాభారతంతో అతనికి పరిచయం ఉండుంటే గాథికుని కథనం మహాభారత శైలిలా ఉందని కూడా అనుకుని
ఉండేవాడు. అంతేకాదు, మౌఖిక సంప్రదాయానికి చెందిన ప్రపంచ
పురాణ కథకులందరూ తమ వీరపురుషుల గాథలనూ, వంశచరిత్రలనూ, కుల పురాణాలనూ ఈ శైలిలోనే చెప్పుకుని ఉండచ్చన్న సంగతి అతనికి స్ఫురించి
ఉండేది.
గాథికుడు కింటే వంశ వివరాలు చెప్పుకుంటూ వెడుతున్నాడు. నాటి
ముఖ్యమైన కొన్ని ఘటనల ద్వారా సంవత్సరాలను, తేదీలను సూచిస్తున్నాడు. ఉదాహరణకు, అప్పుడు “భారీగా వరదలు వచ్చాయి”... “అతను ఓ దున్నపోతును వధించాడు”...
గాథికుడు చెప్పిన కింటే వంశ వివరాలను సంగ్రహీకరిస్తే...
(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)
No comments:
Post a Comment